శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Gadwal - Jan 28, 2020 , 03:29:44

మార్కెట్‌ యార్డులోనే కందులను విక్రయించుకోవాలి

 మార్కెట్‌ యార్డులోనే కందులను విక్రయించుకోవాలి

ఇటిక్యాల:  పీఏసీఎస్‌ గోదాముల దగ్గర కందుల కొనుగోలును నిలిపివేస్తున్నట్లు మార్క్‌ఫెడ్‌ డీఎం హన్మంత్‌రెడ్డి తెలిపారు. మార్కెట్‌ యార్డ్‌ కలిగిన అలంపూర్‌ చౌరస్తా,  అయిజ ,గద్వాలలోనే మంగళవారం నుంచి యథాతథంగా కందులను కొనుగోలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. అయితే రెండు రోజులు కిందట జెడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, ఎమ్మెల్యే అబ్రహంలు మండల కేంద్రంలోని పీఏసీఎస్‌ గోదాముల చెంత కందుల కొనుగోలును ప్రారంభించగా సోమవారము మండలం నుండి అధిక సంఖ్యలో మూడువేల (50కేజీల)బస్తాల కందులను రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చారు. రైతులు శ్రేయస్సు దృష్ట్యా వచ్చిన మూడు వేల బస్తాల ప్రస్తుతానికి కొనుగోలు చేస్తామని తదుపరి కందులను మార్క్‌ఫెడ్‌ లో విక్రయించాలనుకొనే రైతులు అలంపూర్‌ చౌరస్తా మార్కెట్‌ యార్డ్‌ కేంద్రానికి తీసుకొని రావాలని డీఎం సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం వెలువడిందని రైతులు సరైన నాణ్యతా ప్రమాణాలకు విక్రయించుకోవడానికి తగి ధ్రువీకరణ పత్రాలను తీసుకొచ్చి కందులను విక్రయించుకోవాలన్నారు.


logo