గురువారం 02 ఏప్రిల్ 2020
Gadwal - Jan 27, 2020 ,

మువ్వన్నెల జెండా రెపరెపలు

మువ్వన్నెల జెండా రెపరెపలు ఘనంగా71వ గణతంత్ర దినోత్సవం

 జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఇన్‌చార్జి కలెక్టర్‌ శ్వేతామొహంతి  

 పోలీసుల గౌరవ వందనం స్వీకరణ

 వివిధ శాఖల ఆధ్వర్యంలో స్టాళ్ల ఏర్పాటు

 అధికారులకు అవార్డుల ప్రదానం

 అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

 జిల్లా ప్రగతి పథంలో దూసుకుపోతుంది

 ఇన్‌చార్జి కలెక్టర్‌ 


జోగుళాంబ గద్వాలజిల్లా ప్రతినిధి,నమస్తే తెలంగాణ :71వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ఆదివారం ఇన్‌చార్జి కలెక్టర్‌ శ్వేతామొహంతి పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో త్రివర్ణ పథాకాన్ని ఎగరవేసి జిల్లా ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి వివిధ శాఖల అధి కారులు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో మొదటిసారిగా గణతంత్ర దినోత్సవ వేడులు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని కలెక్టర్‌ చెప్పారు. ఈ ఏడాది కాలంలో జిల్లా అధికార యంత్రాంగం సాధించిన ప్రగతిని, అభివృద్ధి పథకాలను ఆమె ప్రజలకు వివరించారు. జిల్లాగా ఏర్పడిన నాటి నుంచి నడిగడ్డ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధిస్తుందన్నారు. వివిధ శాఖల్లో ప్రతిభను కనబర్చిన ప్రభుత్వ ఉద్యోగులకు అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసి విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి.

గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లాలో అన్ని సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నట్లు ఇన్‌చార్జి కలెక్టర్‌ శ్వేతామొహంతి  ప్రకటించారు. 


రైతుబందు, రైతుబీమా

రైతు బంధు పథకం ద్వారా రైతులకు పెట్టుబడికి ఎకరాకు రూ.5000ల చొప్పున ఖరీఫ్‌లో 93,529 మందికి రూ.127 కోట్ల 47లక్షలు అందించామని ఇన్‌చార్జి కలెక్టర్‌ తెలిపారు. రైతుబీమా ద్వారా 73,742 మంది రైతులు నమోదు చేసుకోగా వారిలో మరణించి 653 మంది రైతు కుటుంబాలకు రూ.32కోట్ల 62 లక్షలు చెల్లించామని చెప్పారు. 


ఉద్యాన వన, పట్టుపరిశ్రమ శాఖ

జిల్లాలో మల్బరీతోటల పెంపకాన్ని 200 హెక్టార్లో కొత్తగా పంటలను సాగ చేసేందుకు నిర్దేశించామని చెప్పారు. పండ్ల తోటల ఉత్పాదకాలను పెంచడానికి 405 హెక్టార్లలో రూ.1కోటీ 47లక్షల 65వేలతో పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు.  


మత్స్యశాఖ

మత్స్యశాఖ ద్వారా జిల్లాలోని 65 నీటి వనరులున్న జలాశయాల్ల్లో కోటీ 2లక్షల  75వేల చేప పిల్లలను జిల్లాలోని చెరువులన్నింటిలో వదిలామని చెప్పారు.  సమీకృత మత్స్యశాఖ అభివృద్ధి పథకం ద్వారా రూ.9కోట్ల 71లక్షలతో 2,034 పథకాలను మత్స్యకారులకు అందించామని చెప్పారు.


గొర్రెల పంపిణీ

ఈ ఏడాది 5,91,931 గొర్రెలు, మేకలకు ఉచితంగా నట్టల నివారణ మందులను అందచామని చెప్పారు. 5,31,120 గొర్రెలకు, మేకలకు వ్యాధి నివారణ టీకాలు వేయించామన్నారు. కృత్రిమ గర్భధారణ పథకం  ద్వారా 6,498 పశువులకు కృత్రిమ గర్భధారణ చేశామన్నారు. 


సాగు నీటిప్రాజెక్ట్‌

నెట్టెంపాడు ప్రాజెక్ట్‌ పనుల కోసం 24,130 ఎకరాల భూమిని సేకరించి సంబంధిత రైతులకు రూ.328 కోట్లను చెల్లించామన్నారు. తుమ్మిళ్ల ప్రాజెక్ట్‌ కోసం 89 ఎకరాలను సేకరించి రైతులకు రూ. కోట్ల 11లక్షలు చెల్లించామన్నారు. 


మిషన్‌ కాకతీయ

నాలుగు  దశల్లో కలిపి 346 చెరువుల్లో పనులు ప్రారంభించి ఇప్పటి వరకు 232 చెరువుల్లో పనులు పూర్తి చేశామన్నారు. వాటి కోసం ఇప్పటి వరకు రూ. 27కోట్ల 56లక్షలు నిథులు ఖర్చు చేసి 9,817 ఎకరాలను సాగునీటిని అందిచామన్నారు.


 మిషన్‌ భగీరథ

జిల్లాలోని 319 గ్రామాలకు, 2 మున్సిపాలిటీలకు రూ.700 కోట్లతో తా గునీటిని అందించేందుకు మిషన్‌ భగీరథ పథకం చేపట్టామన్నారు. గ్రామాలకు, మున్సిపాలిటీలకు తాగు నీటిని అందించేందుకు రూ.420.7 కోట్లు ఖర్చుచేసి పనులు పూర్తి చేశామన్నారు.  ఇందుకోసం 70ఎంఎల్‌డీ నీటిశుద్ధి కేంద్రాలు, 13 ఓహెచ్‌బీఆర్‌, రెండు సంపులు, 5జీఎల్‌బీఆర్‌లు, రెండు పంప్‌హౌజ్‌లు, 849 కి.మీ. పైప్‌లైన్లు, 465 కి.మీ. పనులు పూర్తి చేశామన్నారు. 


విద్య

పదో తరగతిలో 100శాతం ఉత్తీర్ణత సాధించేందుకు 2019 డిసెంబర్‌ 16 నుంచి ఫిబ్రవరి 11, 2020 వరకు అన్ని పాఠశాల్లలో ప్రత్యేక తరగతులు నిర్వహించామన్నారు.విద్యార్థుల కోసం 6వేల పుస్తకాలను పంపిణీ చేశామన్నారు.

వైద్యం

అన్ని ప్రభుత్వ దవాఖానల్లో 8828 ప్రసవాలు జరుగగా వాటిలో 61శాతం 5,397 ప్రసవాలు సాధారణ ప్రసవాలు చేపట్టామని చెప్పారు. 8,770 మంది శిశువులకు వ్యాధి నిరోదక టీకాలను కూడా వేశామన్నారు. 

రోడ్లు, భవనాలు

రూ. 43కోట్ల 8లక్షలతో 4 భవనాలు చేపట్టామని అలంపూర్‌ శాసన సభ్యుని కార్యాలయం ప్రారంభించామన్నారు. మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి 7 రోడ్ల పనులను 55.57 కోట్లతో 48.4కి.మీ.లలో ప్రారంభించామన్నారు.  

రైల్వే ఒవర్‌ బ్రిడ్జి  నిర్మాణం పనుల కోసం రూ.25కోట్లు  అంచనాతో ప్రా రంభించి  బ్రిడ్జి పనులు పూర్తి చేశామని ఫుట్‌పాత్‌, అప్రోచ్‌రోడ్‌, సర్వీస్‌ రోడ్డు, డ్రైనేజీ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. 


డబుల్‌ బెడ్రూం ఇండ్లు

 రెండు పడకల గదుల నిర్మాణం కింద రూ.142.85 కోట్ల  వ్యయంతో 2,800 ఇళ్లు మంజూరు చేశామని చెప్పారు. ఇందులో క్యాతూరు, గోనుపాడు గ్రామాల్లో 60 ఇళ్లు, గద్వాల పట్టణంలో 560ఇళ్లు  నిర్మాణంలో ఉన్నాయన్నారు.


ఆసరా పథకం 

ఏ ఆధారం లేని 22,955 మంది వృద్ధులు, 28,351 మంది వితంతువులు, 2,061 మంది చేనేత, 388 మంది గీత, 53 మంది బీడీ కార్మికులకు, 2,080 మంది ఒంటరి మహిళలకు నెలకు రూ.2016 చొప్పున, 11,133 మంది  వికలాంగులకు రూ.3016 చొప్పున జిల్లాలో 67,021 మందికి ప్రతి నెలా రూ.15 కోట్ల 15 లక్షలు పంపిణీ చేస్తున్నట్టుగా చెప్పారు. పేదరిక నిర్మూల కార్యక్రమం ద్వారా 1,033 స్త్రీ నిధి సంఘాలకు రూ.3కోట్ల 86 లక్షలు, 1,985 సంఘాలకు రూ.70కోట్ల 5లక్షలు మంజూరు చేసామని చెప్పారు.


కళ్యాణలక్ష్మి

కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ పథకాల ద్వారా 2019-20లో 302 దళిత యువతులకు, 11 మంది గిరిజన యువతులకు, 1,549 మంది  వెనకబడిన తరగతుల యువతకు, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల యువతకు రూ. 1,00,116 చొప్పున మొత్తం రూ.17 కోట్ల 81లక్షలు పంపిణీ చేశామని చెప్పారు.  షాదీముబారక్‌ ద్వారా 178 మంది మైనారిటీ యువతులకు రూ.1.70 కోట్లు పంపిణీ చేశామన్నారు. 


హరితహారం 

 2019-20 సంవత్సరంలో మొత్తం 81లక్షల 97 మొక్కలను నాటడం జ రిగిందని చెప్పారు. వచ్చే వర్షాకాలంలో సామాన్య ప్రజలకు పంపిణీ చేసేందుకు 12లక్షల మొక్కలను జిల్లాలో 16 అటవీ శాఖ నర్సరీలను పెంచుతున్నామన్నారు. 


మహిళా శిశు సంక్షేమశాఖ

స్త్రీ, శిశు సంక్షేమశాఖ ద్వారా  జిల్లాలో మూడు ప్రాజెక్టుల పర్యవేక్షణలో మొత్తం 713 అంగన్‌వాడీ  కేంద్రాల ద్వారా 6,689 మంది గర్భిణులకు, 4,856మంది  బాలింతలకు, 42,294 మంది 3 ఏళ్లలోపు పిల్లలకు, 27,265 మంది 3 నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లలకు వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు.  మహిళా,శిశు సంక్షేమ శాఖ ద్వారా 23 మంది అనాథ బాలికలకు ఉచిత హాస్టల్‌తో విద్యను అందిచామన్నారు.  

షెడ్యూల్‌ కులాల అభివద్ధి

షెడ్యూల్‌ కులాల అభివృద్ధి కోసం జిల్లాలో 13 హాస్టళ్లు, 2 సమీకృత హాస్టళ్లులో 2,225 మంది విద్యార్ధులతో  నడుస్తున్నాయని చెప్పారు. ఈ నిర్వహణ కోసం ప్రతి ఏటా రూ. 215.5లక్షలు ఖర్చు చేస్తున్నామన్నారు.  కళాశాలలో చదివే 605 మంది విద్యార్ధులకు 2 హాస్టళ్లు నడపబడుతున్నాయని చెప్పారు.  

చేనేత జౌళిశాఖ

 చేనేత, జౌళీ శాఖ ద్వారా 40శాతం నూలు సబ్సిడీని ఇప్పటి వరకు 11,883 మంది చేనేత కార్మికులకు, అనుబంధ కార్మికులకు  రూ.కోటీ 92లక్షలు కేటాయించామని చెప్పారు.  

పరిశ్రమలు 

నూతన పారిశ్రామికి పెట్టుబడి ప్రోత్సాహక విధానం ద్వారా 140 మంది షెడ్యూల్‌ కులాల వారికి రూ.5లక్షల 99వేలను, 13 మంది ఎస్‌టీలకు రూ.61లక్షలు, 61 మంది సాధారణ వికలాంగ లబ్ధిదారులకు 8లక్షల 65వేల సబ్సిడీ రాయితీలను ఇచ్చామన్నారు.logo