సోమవారం 06 ఏప్రిల్ 2020
Gadwal - Jan 27, 2020 ,

‘నమస్తే’ యూనిట్‌లో గణతంత్ర వేడుకలు

‘నమస్తే’ యూనిట్‌లో గణతంత్ర వేడుకలు

మహబూబ్‌నగర్‌, నమస్తే తెలంగాణ : ప్రతి ఒక్కరూ తమకు చేతనైనంత సహయం చేస్తు ఉ న్నత లక్ష్యాలను అధిరోహించాలని నమస్తే తెలంగాణ మహబూబ్‌నగర్‌ యూనిటీ బీఎం, బ్యూరో ఇన్‌చార్జి విజయభాస్కర్‌ అన్నారు. ఆదివారం జి ల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న మయూరీ ఏకో పార్కు సమీపంలో నమస్తే తెలంగాణ యూనిట్‌ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను పెద్దివిజయభాస్కర్‌ ఎగురవేశారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ జనవరి 26, 1950 నాడు మన దేశానికి రాజ్యాగం అమల్లోకి రావడం జరిగిందని, స్వ రాజ్యం కోసం మహానీయులు ఎన్నో త్యాగులు చే శారని గుర్తు చేశారు. దేశం బాగుపడడం అంటే మనం ప్రతి ఒక్కరం ఎంచుకున్న రంగంలో ఉన్న త స్థాయికి చేరుకునేలా ముందుకు సాగడమే అ న్నారు. అందరూ వ్యక్తిగతంగా ఉన్నతంగా జీవి స్తూ తోటి వారికి సహయం చేస్తు ముందుకు నడవాలని సూచించారు. అప్పుడే మన దేశం ఉన్నత స్థాయిలో ఉంటుందని తెలియజేశారు. నమస్తే తె లంగాణ దిన పత్రికను మరింత ఉన్నతస్థాయిలో నిలిపేందుకుగాను అందరూ కృషి చేస్తు ముందు కు సాగాలని సూచించారు. కార్యక్రమంలో ఎడిషన్‌ ఇన్‌చార్జి నరసింహాచారి, సర్యూలేషన్‌ ఇన్‌చార్జి జగన్‌, అసిస్టేంట్‌ మేనేజర్‌ విజయ్‌కుమార్‌రెడ్డి, సిబ్బంది కిశోర్‌, విజయ్‌కుమార్‌, రఘు, మగ్బూల్‌పాషా, నర్సింములు ఉన్నారు. logo