శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Gadwal - Jan 27, 2020 ,

డబ్బులిస్తే ప్రభుత్వ ఉద్యోగం

డబ్బులిస్తే ప్రభుత్వ ఉద్యోగం

గద్వాల అర్బన్‌ : ఇద్దరు మహిళలను అమాయకులను చేసి కొందరు ప్రభుత్వ అధికారులు సినీ పక్కీలా వ్యవహారం నడిపించారు. నిలువుగా డబ్బులు వసూలు చేసి ఉడాయించిన వ్యవహారం 2014 సంవత్సరంలో చోటు చేసుకుంది. జోగుళాంబ గద్వాల టౌన్‌ ఎస్‌ఐ సత్యనారాయణ కథనం ప్రకా రం.. జిల్లా కేంద్రంలోని చింతలపేట కాలనీకి చెందిన సునీత, కోస్గి ఎంపీడీవో బాలమణిల దగ్గర ఉద్యోగం, భూములు ఇప్పిస్తామని చెప్పి కొందరు ప్రభుత్వ ఉద్యోగులు నమ్మించి డబ్బులు వసూలు చేసుకొని మోసం చేశారు. వారు 2019 సంవత్సరంలో నవంబర్‌, డిసెంబర్‌ నెలలో పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసును లోతుగా తవ్వి ఈ ముఠాలో ఎవరు ఉన్నారని, అన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు ప్రభుత్వ అధికారులు విజయ్‌కుమార్‌, రఘునందన్‌ రావు, మోహన్‌ లాల్‌ వీరంత ఒక గ్యాంగ్‌ల ఏర్పడి అమాయకులను లక్ష్యం చేసుకొని వారికి ఉద్యోగం ఇప్పిస్తాం, భూములు తక్కువ రేటుకు వస్తుందని బాధితులను నమ్మబలికారు. వారి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసే పని పెట్టుకోన్నారు. అందులో భాగంగానే చింతలపేట కాలనీకి చెందిన సునీత అనే మహిళ దగ్గర వీరు ముగ్గురు కలసి మక్తల్‌ తాలూకా దగ్గర రైల్వే పట్టాలు, స్టేషన్‌ పడుతుందని వివరించారు. అక్కడ ఇప్పుడు భూము లు కొంటే భవిష్యత్‌లో రెండింతలు డబ్బులు వస్తాయని నమ్మబలికి ఆమె వద్ద సుమారు రూ.12 లక్షలు చేశారు. ఆమెకు రిజిస్ట్రార్‌ కార్యాలయంలో నీ పేరు మీద భూమి మా ర్పిడి చేస్తామని చెప్పి ఆమెను అక్కడకు రమ్మని చెప్పి వారు అక్కడి నుంచి ఉడాయించారు. వారిని సునీత ఒక సంవత్సరం పాటు వెతికి వెతికి పట్టుకొని డబ్బులను అడిగింది. ప్రతిసారి డబ్బులు అడిగినప్పుడల్ల ఇప్పుడు ఇస్తాం, అప్పుడు ఇస్తామని చెప్పి కాలయాపన చేశారు. అనంతరం భూములు వద్దు నీకు రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి మారోమరు మోసం చేశారు. కోస్గి ఎంపీడీవోగా విధులు నిర్వహించే బాలమణి అధికారిణితో మహేశ్వరం, తుక్కగూడ వద్ద ప్లాట్‌లు తక్కువ రేటులో ఉన్నాయి. ఇప్పుడు కొంటే భవిష్యత్‌లో రెండింతలు అవుతుందని వివరించారు. అదే ప్లాట్లను రియల్‌ ఎస్టేట్‌ చేస్తే డబ్బులు నాలుగు ఇంతలు వస్తాయని చెప్పి ఆమె దగ్గర రూ.19 లక్షలు తీసుకొని ఉడాయించారు. వారి ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేశామన్నారు. వారిని శనివారం రోజు గద్వాల కొత్త బస్డాండ్‌ వద్ద విజయ్‌ కుమార్‌ని, రేవులపల్లి దగ్గర రఘునందర్‌రావును, కొండంగల్‌ దగ్గర మోహన్‌లాల్‌ను అదుపులోకి తీసున్నట్లు తెలిపారు. ఆదివారం వారిని రి మాండ్‌కు తరలించినట్లు తెలిపారు. వారికి సహకరించిన విజయ్‌కుమార్‌ కారు డ్రైవర్‌ మఠం బస్వరాజప్ప, రఘునందన్‌రావు కార్‌ డ్రైవర్‌ గద్మిలి జైపాల్‌యాదవ్‌ల మీద కూడా కేసునమోదు చేసినట్లు తెలిపారు. వారు ప్రస్తుతం కొండంగల్‌ మున్సిపల్‌ ఇన్‌చార్జి కమిషనర్‌గా మోహన్‌లాల్‌, గట్టు ఎంపీడీవో కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా రఘునందన్‌రావు, ఆత్మకూర్‌ మున్సిపల్‌ కార్యాలయంలో బిల్‌ కలెక్టర్‌గా విజయ్‌కుమార్‌లు పలు ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు విధులు నిర్వహిస్తున్నారు. వారి దగ్గర నుంచి రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. 


logo