మంగళవారం 31 మార్చి 2020
Gadwal - Jan 27, 2020 ,

కోర్టు భవనంపై రెపరెపలాడిన త్రివర్ణ పతాకం

కోర్టు భవనంపై రెపరెపలాడిన త్రివర్ణ పతాకం

మహబూబ్‌నగర్‌ లీగల్‌: గణతంత్ర దినోత్సవం సందర్భంగా  జిల్లా కోర్టు భవనంపై జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ ప్రేమావతి జాతీయ జెండాను ఎగుర వేశారు. ఉదయం 8 గంటలకు న్యాయమూర్తులు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు, సీనియర్‌, జూనియర్‌ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతదేశ గణతంత్ర దినోత్సవ అవశ్యకత గురించి న్యాయమూర్తి మాట్లాడారు. కార్యక్రమం లో న్యాయమూర్తులు రఘురాం, వసంత్‌,  అన్నిరోస్‌ క్రిష్టియన్‌, దీప్తి తదితరులు పాల్గొన్నారు. 

న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో

మహబూబ్‌నగర్‌ జిల్లా న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో సం ఘం అధ్యక్షుడు అనంతరెడ్డి జాతీయ జెండాను ఎగుర వే శారు.అనంతరం జాతీయ గీతాన్ని న్యాయ వాదుల సంఘం కార్యాలయ భవనంపై ఆయన త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేశారు.  ఈ సందర్భంగా అనంతరెడ్డి మా ట్లాడా రు. కార్యక్రమంలో న్యాయమూర్తులతోపాటు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు,  సీనియర్‌, జూనియన్‌ న్యాయవాదులు పాల్గొన్నారు. 


logo
>>>>>>