గురువారం 02 ఏప్రిల్ 2020
Gadwal - Jan 25, 2020 , 00:55:06

దళారులను నమ్మి మోసపోవద్దు

దళారులను నమ్మి మోసపోవద్దు
  • - జెడ్పీ చైర్‌పర్సన్‌, ఎమ్మెల్యే అబ్రహం
  • - ఇటిక్యాలలో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం

ఇటిక్యాల: రైతులు తమ పంటలను దళారులకు విక్రయించి నష్టపోవద్దని జెడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌కమిటీ గోదాముల వద్ద కందుల కొనుగోలు కేంద్రాన్ని  వారు శుక్రవారం ప్రారంభించారు. అనంతరం వారు రైతులనుద్దేశించి మాట్లాడుతూ తాము పండించిన పంటలను బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తే దళారులు మోసగించే అవకాశముందన్నారు. ప్రభుత్వం ప్రారంభించిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతు శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్‌ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ఎకరాకు మూడు క్వింటాళ ్లకందులను మాత్రమే కొనుగోలు చేయాలనే నిబంధన వల్ల ఇబ్బందులు పడుతున్నట్లు రైతులు ఈ సందర్భంగా వారి దృష్టికి తీసుకొచ్చారు. ఎకరాకు కనీసం ఐదు క్వింటాళ్లు కొనుగోలు చేయాలని రైతులు కోరగా ఈ విషయమై తాము మార్కెటింగ్‌ మంత్రితో మాట్లాడతామన్నారు. పుటాన్‌దొడ్డి వ్యవసాయ పరపతి సంఘం చైర్మన్‌ మాణిక్యారెడ్డి మాట్లాడుతూ సహకారం సంఘంలో రుణాలను పొందేందుకు అలంపూర్‌ బ్యాంక్‌కు వెళ్లాల్సిన పరస్థితి ఇక ముందు ఉండబోదన్నారు. సోమవారం నుంచి ఎర్రవల్లి చౌరస్తాలో నూతనంగా ఏర్పాటుచేసిన బ్యాంక్‌ నుంచే రైతులకు రుణాలను అందజేయడం జరుగుతుందన్నారు. అలాగే సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో పెట్రోల్‌బంక్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ హన్మంత్‌రెడ్డి, మండల రైతు సమన్వయసమితి కోఆర్డినేటర్‌ గిడ్డారెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి, సీఈవో శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్‌ రవీందర్‌రెడ్డి, కిశోర్‌, తిరుపతయ్య, సర్వారెడ్డి, యుగంధర్‌రెడ్డి, శ్రీనాథ్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, రంగారెడ్డి, రైతులు పాల్గొన్నారు.


logo