బుధవారం 01 ఏప్రిల్ 2020
Gadwal - Jan 25, 2020 , 00:54:00

రీపోలింగ్‌ ప్రశాంతం

రీపోలింగ్‌ ప్రశాంతం
  • -198 బూత్‌లో పోలింగ్‌
  • -718 ఓట్లకు గాను 429 పోలింగ్‌
  • -కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌, ఎస్పీ రెమా రాజేశ్వరి

మహబూబ్‌నగర్‌, నమస్తే తెలంగాణ/ మున్సిపాలిటీ : అభియోగాలకు తావిచ్చి తిరిగి పోలింగ్‌ జరుపుకొన్న పాలమూరు మున్సిపాలిటీలోని 198 బూత్‌ పరిధిలో శుక్రవారం జరిగిన పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. తమ ఓట్లు ఇతరులు వచ్చి మా కంటే ముందుగా ఓటు వేశారని నిరూపణ కావడంతో ఎన్నికల సంఘం ఈ మేరకు తిరిగి రీపోలింగ్‌ నిర్వహించాలని జిల్లా ఎన్నికల సంఘం అధికారులకు సూచించిన విషయం విధితమే. ఈ క్రమంలో మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలోని 41వ వార్డు 198 బూత్‌లో 718 ఓట్లకు సంబంధించి రీపోలింగ్‌ను శుక్రవారం ఉదయం 7 గంటలకు కాకతీయ టెక్నోస్కూల్‌లో ఆరంభమైంది. నిర్విరామంగా పోలింగ్‌ ప్రక్రియను ఉన్నతాధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించడంతోపాటు పోలీస్‌ భద్రత మరింత రెట్టింపు చేశారు. దీంతో పోలింగ్‌ ప్రశాంత వాతావారణంలో జరిగింది.

రీపోలింగ్‌లో తగ్గిన ఓటింగ్‌

తమ ఓటు ఇతరులు వేసి తమకు ఓటుహక్కు లేకుండా చేశారని అభియోగాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చారు. ఈ మేరకు ఎన్నికల సంఘం రీపోలింగ్‌కు ఆదేశాలు జారీ చేయడంతో  వెంటనే అధికారులు ఈ బూత్‌లో శుక్రవారం రీపోలింగ్‌ నిర్విహించారు. ఈ నేపథ్యంలో బుధవారం తొలిసారి 198 బూత్‌లో 718ఓట్లకు జరిగిన మొదటి పోలింగ్‌లో 458 ఓట్లు పోలింగ్‌ అయినట్లు అధికారుల నివేధికలు చెబుతున్నాయి. ఈ బూత్‌లో అవకతవకల్లో ఎన్నికల ప్రక్రియ నిర్వహణ జరిగిందని జరిపిన రీపోలింగ్‌లో 29 ఓట్లు తగ్గి 429 ఓట్లు శుక్రవారం పోలింగ్‌ కావడం జరిగింది. దీంతో పోలింగ్‌ ప్రక్రియ తగ్గడంతో అభ్యర్థుల్లో కొంతమేరకు అలజడి చోటుచేసుకున్నట్లు సమాచారం.

బందోబస్తు మధ్య పోలింగ్‌

జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో ఏ పోలింగ్‌ స్టేషన్‌కు కూడా ఏర్పాటు చేయని భద్రత సిబ్బందిని రీపోలింగ్‌ కేంద్రానికి అధికారులు ఏర్పాటు చేశారు. ఓటర్లను తప్ప ఇతరులను ఎట్టి పరిస్థితుల్లో హద్దులను దాటనివ్వకుండ అవసరమైన చర్యలు తీసుకున్నారు. నిర్లక్ష్యం అనే మాటకు తావు లేకుండ పక్కా ప్రణాళికలతో ముందుకు సాగడం జరిగింది. కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌, ఎస్పీ రెమా రాజేశ్వరి ప్రత్యేకంగా పోలింగ్‌ జరుగుతున్న 198 బూత్‌ను పరిశీలించారు. ఎక్కడ ఎలాంటి సమస్యకు తావివ్వకుండా ముందస్తు చర్యలు తీసుకుని ఎక్కడ ఎలాంటి సమస్యలు లేకుండా పోలింగ్‌ ప్రక్రియను పూర్తి చేశారు.

ప్రత్యేక స్ట్రాంగ్‌ రూం

198 బూత్‌లో పోలింగ్‌ ప్రక్రియ పూర్తికావడంతో ఈ పోలింగ్‌ బాక్సుకు ప్రత్యేక స్ట్రాంగ్‌రూంను ఏర్పాటు చేసి  పోలింగ్‌ బాక్సును భద్రపర్చనున్నారు. బాలుర కళాశాలలోనే ప్రత్యేక స్ట్రాంగ్‌రూంను ఏర్పాటు చేసి పోలింగ్‌ బాక్సును అధికారులు ఉంచనున్నారు. శనివారం ఫలితాలు ప్రక్రియ ఆరంభం కావడంతో అధికారులు మరింత శ్రద్ధ వహించి అవసరమైన చర్యలు తీసుకుంటు ముందుకు సాగుతున్నారు.logo
>>>>>>