శనివారం 04 ఏప్రిల్ 2020
Gadwal - Jan 24, 2020 , 04:51:38

డెబబ్భైశాతం దాటలే!

డెబబ్భైశాతం దాటలే!


మహబూబ్ నగర్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఉమ్మడి జిల్లాలోని 17 మున్సిపాలిటీల్లో బుధవారం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అయితే ఈ ఎన్నికల్లో పట్టణ ఓటర్లు పోలింగ్ పెద్దగా శ్రద్ధ కనబర్చకపోవడంతో పోలింగ్ శాతం తక్కువగా నమోదయిందని చెప్పవచ్చు. అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమై ఉన్నది. శనివారం ఫలితాలు వెలువడనున్న తరుణంలో ఓటర్లు, అభ్యర్థులు అంతా ఎవరు గెలుస్తారనే అంశంపైనే చర్చించుకుంటున్నారు. చాలా చోట్ల పెరిగిన, తగ్గిన పోలింగ్ శాతం ఫలితాలపై ప్రభావం చూపిస్తుందని అంచనా వేస్తున్నారు. ఫలానా వార్డులో పెరిగిన పోలింగ్ వల్ల ఫలానా అభ్యర్థి గెలుస్తాడని.. ఇంకో వార్డులో తగ్గిన పోలింగ్ సదరు అభ్యర్థి కొంపముంచుతుందని.. ప్రచారాలు కొనసాగుతున్నాయి. అయితే అభ్యర్థులు మాత్రం తమకు పోలైన ఓట్లు ఇవీ అంటూ లెక్కలు వేసుకుని తృప్తి పడుతున్నారు. వారి అంచనాలతో ఓ ఫలితాన్ని నిర్ణయించుకుంటున్నారు. 17 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం కలిపి 78.51 శాతం మేర పోలింగ్ నమోదైంది. ఒక్క మహబూబ్ మినహా అన్ని చోట్లా 70 శాతం మేర పోలింగ్ దాటింది. 2014 ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం పోలింగ్ శాతం పెరిగిందనే గణాంకాలు చెబుతున్నాయి. మహబూబ్ గద్వాలలో మినహా మిగతా పాత మున్సిపాలిటీల్లో పోలింగ్ శాతం పెరిగింది. ఈ లెక్కలు ఎలా ఉన్న అంతా రేపటి కౌంటింగ్ పైనే దృష్టి పెట్టారు.

పాలమూరు, గద్వాలలో తగ్గిన పోలింగ్ శాతం

మహబూబ్ మున్సిపాలిటీ పరిధిలో 2014లో 70.4 శాతం పోలింగ్ నమోదైంది. ఇప్పుడు మాత్రం పోలింగ్ శాతం 67.17 శాతం మాత్రమే నమోదై.. 3.19శాతం తగ్గింది. ఇక గద్వాలలో 2014లో 75.85 శాతం పోలింగ్ నమోదవ్వగా ప్రస్తుతం 74.10 శాతానికి తగ్గింది. 1.75 శాతం మేర తగ్గుదల కనిపిస్తోంది. ఇక 5 పురాల్లో మాత్రం పోలింగ్ శాతం పెరగడం గమనార్హం. వనపర్తిలో 2014లో 71.36 కాగా ఇప్పుడు 72.96, నాగర్ అప్పుడు 71.01 ఇప్పుడు 76.89, నారాయణపేటలో 2014లో 72.77, ఇప్పుడు 74.09, అయిజలో అప్పుడు 84.02, ఇప్పుడు 87.06, కల్వకుర్తిలో గత ఎన్నికల్లో 76.77, ఇప్పుడు జరిగిన పోలింగ్ 80.84 మేర పెరుగుదల కనిపిస్తోంది. అత్యధికంగా అయిజలో 87.06 శాతం పోలింగ్ నమోదవ్వడం విశేషం. ఇక వార్డుల వారీగా చూసుకుంటే భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో 91.22 శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా మహబూబ్ 8వ వార్డులో 49.67 శాతం మాత్రమే ఓట్లు పోలయ్యాయి. చాలాచోట్ల ఓటర్లు ఓటేసేందుకు ఉత్సాహంగా మాత్రం కనిపించారు. ప్రధానంగా మహబూబ్ మాత్రమే 70 శాతం కంటే తక్కువగా ఓట్లు పోలవ్వడం విశేషం.

మేమే గెలుస్తాం..

పోలింగ్ ముగిసిన తర్వాత అభ్యర్థులు లెక్కలు వేసుకునే పనిలో పడ్డారు. తమ వార్డులోని ఓటర్లలో ఎవరెవరు తమకు ఓటేసి ఉంటారో ఓ అంచనా వేసుకుని లెక్కలు రాసుకుంటున్నారు. ఫలానా ఫలానా వారు వేశారు కాబట్టి వారి అంచనాల మేరకు గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు అయితే ఓటర్లు మోసం చేశారని ఓటమి తప్పదేమోనని ఆందోళన చెందుతున్నారు. అన్ని పనులు చేసి పెట్టినా కొన్ని విషయాల్లో ఓటర్లను ప్రభావితం చేయలేకపోయామనే అభద్రత పోటీ చేసిన అభ్యర్థుల్లో కనిపిస్తోంది. వార్డుల్లో విస్తృతగా కలియదిరిగి ప్రచారం నిర్వహించినా.. తాయిలాలు పంచినా ఓటర్లు మాత్రం తాము ఎవరికి ఓటు వేయాలో వారికే వేస్తారు. ఈ నేపథ్యంలో పనిచేసే వారు, అందుబాటులో ఉండేవారు, అభివృద్ధి చేసే వారికి తప్పకుండా గెలుపు లభిస్తుందనే ధీమా వ్యక్తమవుతోంది. గెలుపుపై ఇప్పటికే పలుచోట్ల బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. పోలింగ్ సరళిని దగ్గరి నుంచి చూసి పలువురు నేతలు బెట్టింగ్ పాల్గొంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అందరి చూపు కౌంటింగ్ వైపే కనిపిస్తోంది. ఇన్నాళ్ల ఎదురుచూపులకు తెరదించుతూ శనివారం జరిగే కౌంటింగ్ ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో తెలిసిపోనున్నది. అంతవరకు ఈ సస్పెన్స్ తప్పదు.logo