గురువారం 02 ఏప్రిల్ 2020
Gadwal - Jan 23, 2020 , 01:00:54

పోటెత్తిన ఓటర్లు జిల్లాలో 78.27శాతం

పోటెత్తిన ఓటర్లు జిల్లాలో 78.27శాతం

  ప్రశాంతంగా ముగిసిన పోలింగ్‌ అత్యధికంగా  అయిజలో 87.06 శాతం గద్వాలలో 74.10% అలంపూర్‌ 80.03%   వడ్డేపల్లి 84.24 % గద్వాలలో స్వల్ప ఉద్రిక్తత 

మున్సిపల్‌ ఎన్నికల పోరు ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్‌ సమయం ముగిసేనాటికి జిల్లా వ్యాప్తంగా 78.27శాతం పోలింగ్‌ నమోదుకాగా జిల్లాలో అత్యధికంగా అయిజ మున్సిపాలిటీలో 87.06, అత్యల్పంగా గద్వాలో74.10 శాతం ఓటింగ్‌ నమోదైంది. అలంపూర్‌లో 80.03శాతం, వడ్డేపల్లిలో 84.24శాతం పోలింగ్‌ జరిగినట్టు అధికారులు తేల్చారు. జిల్లావ్యాప్తంగా 97,244 మంది పట్టణ ఓటర్లకుగాను 79,109 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గద్వాల పట్టణంలోని గంజిపేటలో కాంగ్రెస్‌, ఎంఐఎం వర్గాల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకున్నది. మిగతా మూడు బల్దియాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. పోలింగ్‌ ముగిసిన అనంతరం సాయంత్రం బ్యాలెట్‌బాక్సులను సీల్‌ చేసి ఎక్కడికక్కడ స్ట్రాంగ్‌రూంలకు తరలించారు..
-జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ

జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : హోరాహోరీగా నిర్వహించిన పురపోరు ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చేపట్టారు. గద్వాలలో చెదురుమొదురు సంఘటనలు మినహా ఎక్కడా కూడా వివాదాస్పద సంఘటనలు చోటుచేసుకోలేదు. ఓటింగ్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నికల అధికారులు సకలసదుపాయాలు కల్పించారు. వృద్ధులు విక లాంగులకు ప్రత్యేకంగా వీల్‌చైర్లు ఏర్పాటుచేసి స్వేచ్ఛగా పోలింగ్‌లో పాల్గొనేలా చర్యలు చేపట్టారు.

పోలింగ్‌ జరిగిన తీరు

ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ నాలుగు మున్సిపాలిటీల్లో మందకోడిగా కొనసాగింది. ఉదయం 9గంటల వరకు జిల్లావ్యాప్తంగా 19.99 శాతం పోలింగ్‌ నమోదు కాగా గద్వాలలో అతితక్కువగా 16.61శాతం పోలింగ్‌ మాత్రమే నమోదైంది. క్రమేపి ఓటర్లు పోలింగ్‌ సెంటర్లకు బారులు తీరడంతో పోలింగ్‌ శాతం పెరిగింది. ఉదయం 11గంటలకు 43.69శాతం, ఒంటి గంటకు 61.35శాతం, మధ్యాహ్నం 3గంటలకు 71.28శాతం సాయంత్రం 5గంటలకు 78.27శాతం పోలింగ్‌ నమోదైంది. గద్వాలలోని 15వ వార్డులో ఎంఐఎం అభ్యర్థి భర్త, కాంగ్రెస్‌ అభ్యర్థికి మధ్య స్వల్ప ఘర్షణ చెలరేగింది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. సమయానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. 17వ వార్డుల్లో ప్రతిపక్ష నాయకులు నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్‌ కేంద్రాల వద్ద పర్యటనలు చేపడుతున్నారని టీఆర్‌ఎస్‌ నాయకులు నిరసనలు తెలిపారు. బీజేపీ నేతల వాహనాలను అడ్డంగా రోడ్డుపై బైఠాయించి వెనక్కి వెళ్లాల్సిందిగా నినాదాలు చేశారు. ఈ ఘటనలు మినహా అన్ని మున్సిపాలిటీల్లో పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది.

ఓటింగ్‌లో పాల్గొన్న 76,109మంది

పోలింగ్‌లో నాలుగు మున్సిపాలిటీలలో మొత్తం 97,244 ఓటర్లుండగా వీరిలో 76,109 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో గద్వాలో 59,498 మంది ఓటర్లుండగా పోలింగ్‌లో 44,086 మంది పాల్గొనడంతో 74.10శాతం పోలింగ్‌ నమోదైంది. అయిజలో 20,082 మంది ఓటర్లుండగా పోలింగ్‌లో 17,483 మంది పాల్గొనడంతో 87.06శాతం పోలింగ్‌ నమోదైంది. అలంపూర్‌లో 8,089మంది ఓటర్లుండగా పోలింగ్‌లో 6,474 మం ది పాల్గొనడం తో 80.03 శా తం పోలింగ్‌ నమోదైంది. వడ్డేపల్లిలో 9,575 మంది ఓటర్లుండగా వీరిలో 8,066 మంది ఓట ర్లు పోలింగ్‌లో పా ల్గొనడంతో 84.24శాతం పోలింగ్‌ న మోదైంది. నాలుగు ము న్సిపాలిటీల్లో అత్యధికంగా అయిజలో 87.06శాతం పోలింగ్‌ నమోదవ్వగా అత్యల్పంగా గద్వాలలో 74.10శాతం పోలింగ్‌ నమోదైంది.logo
>>>>>>