మంగళవారం 31 మార్చి 2020
Gadwal - Jan 23, 2020 , 00:55:11

రెండు మున్సిపాలీటిల్లో టీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేస్తాం..!

రెండు మున్సిపాలీటిల్లో టీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేస్తాం..!
  • - పార్టీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు
  • - దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
మూసాపేట : నూతనంగా ఏర్పడిన భూత్పూర్‌, కొత్తకోట మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ జెండాను ఎగురవేస్తామని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిపాలనలో అన్ని వర్గాల అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు అమలులో ఉన్నాయన్నారు. ప్రతి కుటుంబంలో పథకాలు పొందిన వారే ఉన్నారన్నారు. కావున ప్రజలంతా విజ్ఞతతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంటనే ఉంటారని భావిస్తున్నట్లు చెప్పారు. అందుకే రెండు స్థానాల చైర్మన్‌ పదవులు టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులే అవుతారని తెలిపారు. టీఆర్‌ఎస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థుల గెలుపు కోసం గత పది రోజులుగా టీఆర్‌ఎస్‌కు చెందిన ఆయా మండలాలకు సంబంధించిన ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఇన్‌చార్జులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు శక్తివంచన లేకుండా పని చేశారని, పార్టీ కోసం శ్రమించిన టీఆర్‌ఎస్‌ కుటుంబ సభ్యులందరికీ ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.logo
>>>>>>