శనివారం 04 ఏప్రిల్ 2020
Gadwal - Jan 22, 2020 , 04:59:21

నేడే పుర పోలింగ్‌

నేడే పుర పోలింగ్‌


మున్సిపాలిటీలు         :   4
వార్డులు             :   76
అభ్యర్థులు            :   331  
ఐదు బల్దియాల్లో ఓటర్లు         :   97,244
పోలింగ్‌ కేంద్రాలు        :   152
సమస్యాత్మక కేంద్రాలు         :   97
విధుల్లో పోలీసులు          :   640
ఎన్నికల సిబ్బంది సంఖ్య          :   460

మున్సిపల్‌ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు 152 కేంద్రాల్లో ఓటింగ్‌ నిర్వహించనున్నారు. గద్వాల, అలంపూర్‌, అయిజ,  వడ్డేపల్లి  పట్టణాల్లోని 76 వార్డు స్థానాలకు 331 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. జిల్లాలో 97 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను పోలీసులు గుర్తించారు. ఇక్కడ పోలింగ్‌ సరళిని వెబ్‌కాస్టింగ్‌ ద్వారా  రికార్డు చేయనున్నారు. ఇందుకోసం 97 మంది విధుల్లో ఉంటారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 640 పోలీసులు ఎన్నికల విధుల్లో నిమగ్నమవుతారు. నాలుగు మున్సిపాలిటీలను పదిహేను రూట్లుగా విభజించి 15 మంది జోనల్‌ అధికారులను నియమించారు. ఎన్నికలు జరిగే పట్టణాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
-జోగుళాంబ గద్వాల జిల్లా  ప్రతినిధి/నమస్తే తెలంగాణ

జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఎన్నికల నిర్వహణ సజావుగా జరిగిందేకు జిల్లా ఎన్నికల అధికారి, ఇన్‌చార్జి కలెక్టర్‌ శ్వేతా మొహంతి విశేష కృషి చేశారు. ప్రతి పోలిం గ్‌ బూత్‌లో సకల సదుపాయాలు ఏర్పాటు చేసి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కునే లా చర్యలు చేపట్టారు. 18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పించడంలో జిల్లా ఎన్నికల అధికారులు విజయవంతమయ్యారు. వీటితో పాటు నాలుగు మున్సిపాలిటీల్లో పోలింగ్‌ కేంద్రా లు గుర్తించడం, అధికారులకు ఎన్నికల బాధ్యతలు అప్పగించడం వంటి కార్యక్రమాలను గత 10రోజులుగా చేపట్టారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా తగిన చర్యలు చేపట్టారు.  
ఓటు హక్కువినియోగించుకోనున్న
  97,244 మంది
నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం 97,244 మంది ఓటర్లు నేడు తమ ఓటు హక్కును వినియోగించు కోనున్నారు. వీరిలో గద్వాలలో 59,498 మంది ఓటర్లు ఉండగా వీరిలో  పురుషులు 29,310 మంది ఉండగా స్త్రీలు 30,108 మంది ఉన్నారు. అయిజ మున్సిపాలిటీలో మొ త్తం  20,082 మంది ఓటర్లుండగా వీరిలో  పురుషులు 9,959 మంది ఉండగా స్త్రీలు 10,122 మంది, ఇతరులు ఒకరు ఉన్నారు. అలంపూర్‌లో మున్సిపాలిటీలో 9,033 మంది ఓటర్లుండగా వీరిలో  పురుషులు 4,486 మంది, స్త్రీలు 4,547 మంది ఓటర్లు ఉన్నారు. అయితే అలంపూర్‌ మున్సిపాలిటీల్లో పది వార్డులకు గాను 5వ వార్డు ఏకగ్రీవం కాగా మిగతా తోమ్మిది వార్డుల్లో 8089 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వారిలో 4020 పురుషులు, 4069 మహిళా ఓటర్లు ఉన్నారు. వడ్డేపల్లి మున్సిపాలిటీలో 9,575మంది ఓటర్లుండగా వీరిలో పురుషులు 4,796 మంది, స్త్రీలు 4,779 మంది ఓటర్లు ఉ న్నారు. ప్రతి ఒ క్క ఓటరు ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లను చేపట్టారు. వీ రందరి కోసం మొత్తం నాలుగు మున్సిపాలిటీల్లో 152 పోలింగ్‌ కేం ద్రాలను ఏర్పాటు చేశారు. గద్వాలలో 37 వార్డులకు 76 పోలింగ్‌ కేంద్రాలు, అయిజలో 20 వా ర్డులకు 40 పోలింగ్‌ కేంద్రా లు, అలంపూర్‌లో 10 వార్డులకు 18 పోలింగ్‌ కేంద్రాలు, వడ్డేపల్లిలో 10 వార్డులకు 19 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

విధుల్లో 456 మంది సిబ్బంది

అన్ని పోలింగ్‌ పోలింగ్‌ కేంద్రాల్లో విధులు నిర్వ హించేందుకు ప్రభుత్వం మొత్తం 456మంది సి బ్బందిని నియమించింది. నాలుగు మున్సి పాలి టీలకు నలుగురు రిటర్నింగ్‌ అధికారులకు కూడా నియమించారు. వీరిలో గద్వాల రిటర్నింగ్‌ అధి కారిగా జేసీ నిరంజన్‌, అయిజ రిటర్నింగ్‌ అధికారి గా ఆర్డీవో రాములు, అలంపూర్‌ రిటర్నింగ్‌ అధి కారిగా వ్యవసాయశాఖ జిల్లా అధికారి గోవింద్‌ నాయక్‌, వడ్డేపల్లి రిటర్నింగ్‌ అధికారిగా మార్కె టింగ్‌ శాఖ జిల్లా అధికారి పుష్ప విధుల్లో ఉన్నా రు.  వీరితో పాటు 152 మంది పీవోలను, 152 మంది ఏపీవోలను కూడా నియమించారు. ఎ న్నికల అధికారులందరికీ పోలింగ్‌ సామాగ్రిని అందించి వారి వారి పోలింగ్‌ కేంద్రాలను మంగళవారం కేటాయించారు.

పోలింగ్‌ కేంద్రాల్లో సకల సదుపాయాలు

ప్రతి పౌరుడు కూడా తన ఓటు హక్కును విని యోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారులు పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక సదుపాయాలను కల్పించారు. వృద్ధులు, వికలాంగులకు ఇబ్బం దులు  కలుగకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని పోలిం గ్‌ కేంద్రాల దగ్గర వీల్‌చైర్లను ఏర్పాటు చేశారు. ఓటు హక్కు వినియోగించుకొనే వికలాంగులను, వృద్ధులను ప్రభుత్వమే ప్రత్యేక వాహనాల ద్వారా పోలింగ్‌ కేంద్రాలకు తీసుకువచ్చే సదుపాయం కల్పించారు. పోలింగ్‌ కేంద్రాల దగ్గర ఏర్పాటు చేయబడిన  వలంటీర్లు వృద్ధులను వికలాంగుల ను వీల్‌చైర్ల ద్వారా పోలింగ్‌ కేంద్రంలోకి తీసుకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకు నేందుకు సహా యపడుతారు.  పోలింగ్‌ కేంద్రాల దగ్గర మంచి నీటి సదుపాయాన్ని కూడా ఏర్పా టు చేశారు.  పోలింగ్‌ సజావుగా సాగేందుకు ని ఘా నడుమన కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మొత్తం 97 సమస్యత్మాక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి వాటన్నింటిలో ప్రతి అంశం వీడియోల్లో రికార్డ్‌ చేసేలా కెమెరాలను,  వెబ్‌ కా స్టింగ్‌ను ఏర్పాటు చేసి నేరుగా ఎన్నికల సంఘం చెంతకు వీడియో లు చేరేలా ఏర్పాట్లు చేశారు. ఇక మిగిలిన 55 పో లింగ్‌ కేంద్రాల్లో వీడియో కెమెరాలను ఏర్పాటు చేశారు.

మున్సిపాలిటీల వారీగా స్ట్రాం రూంల వివరాలు

మున్సిపల్‌ ఎన్నికల అనంతరం బ్యాలెట్‌ బా క్సులను మున్సిపాలిటీలలోనే ప్రభుత్వ భవనాల వద్ద భద్రపరచనున్నారు. గద్వాలలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో బ్యాలెట్‌ భద్రపరుచగా, అయిజలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, అ లంపూర్‌ మున్సిపాలిటీలో  ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, వడ్డేపల్లిలో ప్రభుత్వ  డీగ్రి కళాశాలలో భద్రపరచునున్నారు.

650మంది పోలీసు సిబ్బంది ఏర్పాటు

పోలింగ్‌ కేంద్రాల దగ్గర ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా పోలీసు శాఖ మొత్తం 640 మంది పోలీసు సిబ్బందిని విధుల్లో నియ మించింది. నాలుగు మున్సిపాలిటీల్లో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ టీమ్స్‌-04, ఫ్లయింగ్‌ స్కాడ్స్‌-04, స్టాటిస్టికల్‌ సర్వేలెన్స్‌ టీమ్స్‌ -10, వీడియో సర్వేలెన్స్‌ టీమ్స్‌ -04 ఏర్పాటు చేశారు. పోలింగ్‌ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ ను విధించారు.logo