మంగళవారం 31 మార్చి 2020
Gadwal - Jan 22, 2020 , 04:57:44

నిరంతరం పల్లె ప్రగతిని కొనసాగించాలి

నిరంతరం పల్లె ప్రగతిని  కొనసాగించాలి
  • - ఫ్లయింగ్‌ స్కాడ్‌ హరిప్రీత్‌సింగ్‌
  • -తిమ్మపూర్‌, కోదండాపూర్‌, కొండేర్‌ గ్రామాలలోపల్లె ప్రగతి పనులఅలంపూర్‌, నమస్తే తెలంగాణ : మున్సిపల్‌ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. మంగళవారం  మధ్యాహ్నం పోలింగ్‌ సామాగ్రి పంపిణీ చేయగా, సాయంత్రం వరకు ఎన్నికల సిబ్బంది వారికి కేటాయించిన పోలింగ్‌ స్టేషన్లకు చేరుకున్నారు. పోలింగ్‌ స్టేషన్‌కు వచ్చే ప్రతి వ్యక్తి తమ ఓటరు స్లిప్‌లతోపాటు మరో గుర్తింపు కార్డుతో హాజరు కావాల్సి ఉంటుందని ఇన్‌చార్జి కమిషనర్‌ మదన్‌మోహన్‌ తెలిపారు. ఈ మేరకు ఇన్‌చార్జి తాసిల్దార్‌ వివరాలు వెల్లడిస్తూ నేటి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్‌ నిర్వహించ బడుతుందన్నారు. ఓటర్లు స్లిప్పులు తీసుకోలేని వారేవరైనా ఉంటే పోలింగ్‌ స్టేషన్‌ల వద్ద ఏర్పాటుచేసిన హెల్ప్‌డెస్క్‌ల వద్ద తీసుకునే సదుపాయం ఉందన్నారు. ఏమైనా సమస్యలు తలెత్తితే సమాచార కేంద్రం ఇన్‌చార్జి అధికారి ఎంఈవో అశోక్‌కుమార్‌ ఫోన్‌ నెంబర్‌ 8106368588కు సమాచారం అందించాలని కోరారు. ఎన్నికల సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్‌ ఎన్నికల జిల్లా పరిశీలకురాలు స్నేహ, ఎన్నికల ఖర్చుల వ్యయ పరిశీలకులు ఉసేన్‌ సందర్శించారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి గోవింద్‌నాయక్‌ తదితరులు ఉన్నారు.

తొమ్మిది వార్డులకు ఎన్నికలు..

అలంపూరు మున్సిపాలిటీలో పది వార్డులకు గాను ఐదో వార్డు ఏకగ్రీవం కాగా  9 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఒక్కో వార్డుకు రెండు పోలింగ్‌ బూత్‌ల చొప్పున 18 బూత్‌లు ఏర్పాటుచేయగా వాటిలో 10 సమస్యాత్మకమైనవి గుర్తించారు. అధికారులు అన్ని పోలింగ్‌ స్టేషన్‌లలో వెబ్‌ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్‌స్టేషన్‌ల వద్ద ఇద్దరు జోనల్‌ ఆఫీసర్లు, 24 మంది పీవోలు, 24 మంది ఏపీవోలు, ఐదుగురు ఆర్వోలు, ఐదుగురు ఏఆర్వోలు, 70 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు.

భారీ బందోబస్తు

ఎన్నికల నేఫథ్యంలో మున్సిపల్‌ పరిధిలోని 18 పోలింగ్‌ స్టేషన్‌లలో పోలీసులు, అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పట్టణంలో నేడు 144 సెక్షన్‌ విధించినట్లు అలంపూరు సీఐ రాజు తెలిపారు. ఎన్నికల సందర్భంగా డీఎస్పీ, సీఐ, నలుగురు ఎస్సైలు 45 మంది కానిస్టేబుల్స్‌ విధులు నిర్వహించనున్నారన్నారు.

అయిజలో..

అయిజ మున్సిపాలిటీలో మొదటి మున్సిపల్‌ సాధారణ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు జిల్లా అసిస్టెంట్‌ ఎన్నికల రిటర్నింగ్‌, ఆర్డీవో రాములు వెల్లడించారు. మంగళవారం ఎన్నికల మెటీరియల్‌ పంపిణీ కేంద్రంలో విలేకర్లతో మాట్లాడారు.  మున్సిపాలిటీలో 20 వార్డులు ఉండగా, 91 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అయిజ మున్సిపాలిటీలో 20,082 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. 20 వార్డులకు 40 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 48 మంది పీవోలు, 48 మంది ఏపీవోలు, 144 మంది ఓపీవోలను పోలింగ్‌ కేంద్రాలకు నియమించి ఎన్నికల మెటీరియల్‌ను అందజేశారు. మున్సిపాలిటీలో 34 పోలింగ్‌ కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి ఆన్‌లైన్‌ వెబ్‌ కాస్టింగ్‌ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 34 పోలింగ్‌ కేంద్రాలలో నిరంతరం వెబ్‌ కాస్టింగ్‌ నిర్వహించేందుకు సిబ్బందిని నియమించారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలలో పోలీస్‌ బందోబస్త్‌ను పెంచారు. పోలింగ్‌ పర్యవేక్షణకు 18 ఆర్‌వోలు, ఏఆర్‌వోలను నియమించారు. మున్సిపాలిటీ పరిధిలోని పర్దిపురం, తుపత్రాల గ్రామాలతోపాటు అయిజ పట్టణంలో పోలీస్‌ నిఘాను పెంచారు. ఎస్పీ అపూర్వరావు, ఏఎస్పీ కృష్ణ, డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు శాంతినగర్‌ సీఐ వెంకటేశ్వర్లు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సమావేశంలో కమిషనర్‌ యాదగిరి, సీఐ వెంకటేశ్వర్లు, ఆర్‌వోలు పాల్గొన్నారు.

ఓటు హక్కు వినియోగించుకోనున్న 9,575 మంది ఓటర్లు

వడ్డేపల్లి : మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా 19 పోలింగ్‌ కేంద్రాల్లో 58 మంది పోలింగ్‌ ఆఫీసర్లు, ఐదుగురు ఆర్‌వోలు, ఐదుగురు ఏఆర్‌వోలు, రూట్‌ ఆఫీసర్లను, జోనల్‌ ఆఫీసర్లను నియమించినట్లు మున్సిపాలిటీ కమిషనర్‌ పార్థసారధి అన్నారు. మండలంలోని 10 వార్డుల్లో 9,575 ఓటర్లు ఉండగా అందులో మహిళలు 4,779, పురుషులు 4,796 ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. పైపాడు, వడ్డేపల్లి, శాంతినగర్‌లలో బూత్‌లు ఏర్పాటుచేయగా వృద్ధులకు, వికలాంగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ట్రైనింగ్‌ కలెక్టర్‌ శ్రీహర్ష చేతులమీదుగా పోలింగ్‌ విధులు నిర్వహించే సిబ్బందికి సామగ్రి అందజేశారు. సిబ్బందిని ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన బస్సుల్లో సామాగ్రితోపాటు వారి స్థానాలకు సురక్షితంగా చేరవేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో రవీంద్ర, ఎంఈవో నరసింహ, విజయసారథిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఏర్పాట్లను పర్యవేక్షించిన ఆర్డీవో రాములు, ఏఎస్పీ కృష్ణ

అయిజ / అయిజ రూరల్‌ : అయిజ పట్టణంలోని వేంకటేశ్వర ఫంక్షన్‌హాల్‌లో మంగళవారం ఏర్పాటుచేసిన పోలింగ్‌ మెటీరియల్‌ పంపిణీ కేంద్రంలో సిబ్బందికి పోలింగ్‌ మెటీరియల్‌, బ్యాలెట్‌ బాక్స్‌లను ఆర్డీవో అందజేశారు. నేడు పోలింగ్‌ పూర్తికాగానే పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్‌ రూంకు బ్యాలెట్‌ బాక్స్‌లను తరలించనున్నట్లు ఆర్డీవో రాములు తెలిపారు. అదేవిధంగా మంగళవారం సాయంత్రం పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్‌ కేంద్రాన్ని ఏఎస్పీ కృష్ణ తనిఖీ చేసి ఏర్పాట్లపై సీఐతో చర్చించారు. ఎన్నికల సందర్భంగా పట్టణంలో 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని పర్దిపురం, తుపత్రాల గ్రామాల్లోని పోలింగ్‌ కేంద్రాల వద్ద గట్టి బందోబస్త్‌ ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సైలు, పోలీస్‌ సిబ్బంది ఉన్నారు.logo
>>>>>>