గురువారం 02 ఏప్రిల్ 2020
Gadwal - Jan 22, 2020 , 04:56:13

మొక్కలు పెంచి పర్యావరణాన్ని కాపాడుదాం

మొక్కలు పెంచి పర్యావరణాన్ని కాపాడుదాం
  • -విత్తనశుద్ధి చేస్తే మొక్కలు బాగా పెరుగుతాయి
  • -జడ్పీ సీఈవో ముషాయిదాబేగం
  • - హరితహారంలో భాగంగా అధికారులతో సమావేశం

గద్వాల, నమస్తే తెలంగాణ: జిల్లాలో ఎక్కువభాగం మొక్కలు నాటడం వల్ల పర్యావరణాన్ని కాపాడిన వారమవుతామని జెడ్పీ సీఈవో ముషాయిదాబేగం పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పీజేపీ క్యాంప్‌లో గల వేంకటేశ్వర కల్యాణ మండపంలో తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎంపీడీవోలు, ఏపీవోలు, టీఏలు, ఈసీలతోపాటు ఇతర అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈవోతోపాటు డీపీవో కృష్ణ పాల్గొని అధికారులకు మొక్కల పెంపకంపై అవగాహన కల్పించారు. నర్సరీల్లో సంచుల్లో మంచి మట్టిని నింపడంతోపాటు విత్తన శుద్ధి చేయడం వల్ల మొక్క బాగా పెరగడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. నర్సరీల విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేయవద్దని ఆమె సూచించారు. మొక్కలు పెంచి వాటిని సంరక్షించడం వల్ల అతివృష్టి, అనావృష్టి సంభవించకుండా చూడవచ్చన్నారు. నర్సరీల్లోని బ్యాగులను మట్టితో నింపి వాటి అడుగుభాగానికి నీరు వచ్చేలా పూర్తిస్థాయిలో నింపాలన్నారు. బ్యాగుల్లో వేసిన విత్తనాలకు సగం వరకు నీటిని నింపితే చివరన మట్టి వేడెక్కి విత్తనం మొలకెత్తకుండా ఉండే అవకాశం ఉందని వారు తెలిపారు. బ్యాగుల్లో విత్తనం వేసేటప్పుడు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేయాలన్నారు. విత్తనశుద్ధి చేయడం వల్ల మొక్క బాగా పెరుగుతుందని, పెరిగిన మొక్క తెగుళ్ల  బారిన పడకుండా ఆరోగ్యంగా పెరుగుతుందని వారు స్పష్టం చేశారు. కార్యక్రమంలో అన్ని మండలాల ఎంపీడీవోలు ఇతర అధికారులు పాల్గొన్నారు.logo
>>>>>>