గురువారం 09 ఏప్రిల్ 2020
Gadwal - Jan 21, 2020 , 01:40:55

పుర పోరుకు ఏర్పాట్లు పూర్తి

పుర పోరుకు ఏర్పాట్లు పూర్తి
  • - ఓటరుకు స్లిప్పులతో పాటు గుర్తింపుకార్డు తప్పనిసరి
  • - నాలుగు పురపాలకల్లో 97 సమస్యత్మాక ప్రాంతాల గుర్తింపు
  • - జిల్లాలో 152 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు
  • - విధుల్లో 558 మంది సిబ్బంది
  • - విలేకరుల సమావేశంలో ఇన్‌చార్జి కలెక్టర్‌ శ్వేతామొహంతి

గద్వాల, నమస్తే తెలంగాణ: ఈ నెల 22న జరగనున్న నాలుగు పురపాలక ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఇన్‌చార్జి కలెక్టర్‌ శ్వేతామొహంతి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎన్నికలకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించారు. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలకు సంబంధించి 152 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు చెప్పారు.అందు కోసం 456 మంది సిబ్బందిని వినియోగించనుండగా అదనంగా 20శాతం (102)మందిని అందుబాటులో ఉంచుకున్నట్లు తెలిపారు. గద్వాల పురపాలకలో 59,498, అయిజ పురపాలకలో 20,035, అలంపూర్‌ పురపాలకలో 9,033, వడ్డేపల్లి పురపాలకలో 9,575 మంది ఓటర్లు ఉన్నట్లు ఆమె తెలిపారు. ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా ఎన్నికలు పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లే సమయంలో ఓటర్‌ స్లిప్‌తోపాటు ఏదైనా ఓ గుర్తింపు కార్డు తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ సూచించారు. జిల్లాలో 152 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా అందులో 97 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలుగా గుర్తించినట్లు ఆమె తెలిపారు. ఈ కేంద్రాల్లో లైవ్‌ వెబ్‌ కెమెరాలు ఏర్పాటుచేసి మిగతా 55 కేంద్రాల్లో ఆఫ్‌లైన్‌ ద్వారా పర్యవేక్షిస్తామన్నారు. ఈ నెల 25న కౌంటింగ్‌ వరకు ఎన్నికల కోడ్‌ ఉంటుందని, కోడ్‌ను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. పోలింగ్‌ స్టేషన్ల వద్ద ఓటర్లకు అవసరమైన అన్ని వసతులు కల్పించినట్లు ఆమె తెలిపారు. జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి అందరూ సహకరించాలని ఆమె కోరారు. సమావేశంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ శ్రీహర్ష తదితరులు పాల్గొన్నారు.

చుక్కల మందు పంపిణీ 98శాతం పూర్తి ..

- పర్యవేక్షించిన జిల్లా ఇమ్యూనేజేషన్‌ అధికారి
గద్వాల టౌన్‌: జిల్లా వ్యాప్తంగా చేపట్టిన పోలియో చుక్కల మందు పంపిణీ సో మవారం కూడా కొ నసాగి 98శాతం ల క్ష్యాన్ని చేరుకుంది. జిల్లాలో 73,89 1మంది పిల్లలకు మందు వేయాలన్న లక్ష్యాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పెట్టుకోగా ఇప్పటివరకు 72,2215మంది చిన్నారుల కు మందును పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. మిగతా లక్ష్యాన్ని మంగళవా రం నాటికి చేరుకుంటామని అధికారులు వెల్లడించారు. జిల్లాలో చేపట్టిన ఇంటింటికీ మం దు పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి శశికళ పర్యవేక్షించారు. సంచారజాతులు, గుడారాల్లోని పిల్లల కు మందు వేశారా లే దా అని ఆమె ఆరా తీశారు. ఇంకా చిన్నారులకు మందు వే యించని వారు మం గళవారం తప్పక వే యించాలని ఆమె సూచించారు. మం దు పంపిణీలో అలసత్వం వహించరాదని సిబ్బందికి ఆమె సూచించారు. ఆమె వెంట హెచ్‌ఈ మధుసూదన్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.logo