గురువారం 02 ఏప్రిల్ 2020
Gadwal - Jan 21, 2020 , 01:39:26

ష్‌!

ష్‌!
  • -ముగిసిన మున్సిపల్‌ ప్రచారం
  • -మూగబోయిన మైకులు
  • -ప్రశాంతంగా కాలనీలు
  • -రేపు 76 వార్డుల్లో ఎన్నికలు

ఆరు రోజులుగా నిరంతరంగా మోగిన మైకులు మూగబోయాయి. బల్దియా ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం ముగిసింది. చివరి నిమిషం వరకు ప్రచారం చేసి వాహనాలకు ఉన్న ఫ్లెక్సీలు, మైకులు తదితర వాటిని తొలగించుకున్నారు.. అలంపూర్‌లో 5వ వార్డు ఏకగ్రీవంగా టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోగా రేపు జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో 76 వార్డులకు గాను 331 మంది పోటీ పడతున్నారు..
జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి, నమ స్తే తెలంగాణ : వారం రోజలుగా జోరుగా నడిచిన ప్రచారాలు సోమవారం సాయంత్రంతో  ముగిశాయి. నాలుగు మున్సి పాలిటీల్లో గెలుపే ధ్యేయంగా టీఆర్‌ఎస్‌ పార్టీ చేపట్టిన ప్రతి ఒక్క కార్యక్రమం విజయవంతమాయ్యాయి. బల్దియా కుర్చీలను సొంతం చేసు కునేందుకు టీఆర్‌ఎ స్‌ పార్టీ ఎమ్మ్యెలేలు చేపట్టిన ప్రతి ఒక్క వ్యూహం ఫలించింది. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసిన నాటి నుంచి ఒక్క క్షణం కూడా వృథా చేయకుండా ముందస్తుగా ఏర్పాటు చేసిన ప్రణాళికల న్నింటి ని కార్యకర్తలు తూచా తప్పకుండా పా టించి ప్రచారాలను సమర్థ వంతంగా ని ర్వహించారు. ప్రతిపక్షాలు తేరుకోకముం దే ప్రతి ఒక్క ఓటరు ను ప్రసన్నం చేసుకొని కారు గుర్తుకు ఓటు వేయాలంటూ విజ్ఞప్తులు చేసి ఓటర్ల ఆదరణను పొందా రు. ప్రతి వార్డుల్లో ఎక్కడ చూసిన గులా బీ కండు వాలతో, గులాబీ జెండాను ఎగరవేస్తున్న కార్యకర్తలే దర్శనమిచ్చారు.

రోడ్‌షోలతో సత్తా చాటిన టీఆర్‌ఎస్‌

చివరి రోజు ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు చేపట్టిన రోడ్‌షో కార్యక్రమం పార్టీ అభ్యర్థులను ప్రజలకు మరింత చేరువ చేసింది. గద్వాల, అయి జ పట్టణాల్లో చేపట్టిన ఈ కార్యకర్తల ర్యా లీలు, గులాబీ పార్టీ నినాదాలు ఓటర్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి పట్టణంలోని కృష్ణారెడ్డి బంగ్లా నుంచి ప్రారంభించి పట్టణం మొత్తం పాదయాత్ర చేపట్టారు. ఎమ్మెల్యే వెంట అన్ని వార్డుల అ భ్యర్థులతో పాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గులాబీ ర్యాలీని చూసిన ఓటర్లు టీఆర్‌పార్టీకి ఉన్న ఆదా రాభిమానాలను అంచనా వేసుకున్నారు. గద్వాలతో పాటు అయిజ పట్టణంలో కూడా ఎమ్మెల్యే డాక్టర్‌ వీఎం అబ్రహం, జెడ్పీచైర్‌ పర్సన్‌లు రోడ్‌ షోను నిర్వహించారు. అయిజ ప్రధాన రహదారిపై టీఆర్‌ఎస్‌ చేపట్టిన ర్యాలీ ఆ పార్టీ స త్తాను ప్రజలను తెలియజేసింది. ఈ రోడ్‌షోలో ఎమ్మెల్యే అ బ్రహం చేసిన ప్రసం గం ప్రజలను ఆలోచింపజేసేలా చేసింది.
ప్రచారం ఆధ్యత్యం టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలపైనే కొనసాగించా రు. ఆరేళ్ల కాలంలో టీఆర్‌ఎస్‌ పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలు, ప్రాజెక్ట్‌లను వివరిస్తూ టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రజల్లోకి వెళ్లారు. అభివృద్ధి కేవలం టీఆర్‌ఎస్‌ పార్టీతోనే సాధ్యమని ఓటర్లకు వివరించారు.

కారు వేగాన్ని అందుకోలేని ప్రతిపక్షాలు

ఈ మున్సిపల్‌ ఎన్నికల్లో అన్ని ప్రతిపక్ష పార్టీలు కారు వేగాన్ని అందుకోలేక పో యాయి. టీఆర్‌ఎస్‌ నాయకులు పన్నిన వ్యూహాలను తెలుసుకోలేక పోయాయి. అభ్యర్థులకు టికెట్లు కేటాయించడం నాటి నుంచి ప్రచారం ముగిసే వరకు ఒక్క విషయంలో కూడా గులాబీ పార్టీని మించి కార్యక్ర మాలు చేయలేకపోయారు. స్పష్టమైన ఎజెండా లేకపోవడం, గెలిస్తే ఎలాం టి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతారో ప్రజలకు వివరించలేకపోవడం, ప్రచారంలో ప్రతి ఒక్క ఓటరును ప్రసన్నం చేసుకోలేక పోవడం వలన ప్రతిపక్షాలు ప్రజల్లోకి వెళ్లలేకపోయాయి. ప్రచారం ముగిసే నాటికి టీ ఆర్‌ఎస్‌ వేగాన్ని ఏ మాత్రం అందుకోలేకపోయాయి.


logo
>>>>>>