మంగళవారం 07 ఏప్రిల్ 2020
Gadwal - Jan 20, 2020 , 02:02:16

వార్‌ వన్‌ సైడే

వార్‌ వన్‌ సైడే
  • - కారు వేగాన్ని ఎవరూ ఆపలేరు
  • - అధికార పార్టీతోనే అభివృద్ధి సాధ్యం
  • - ప్రతిపక్షాల కుట్రలు ప్రజలు నమ్మరు
  • - మూడు మున్సిపాలిటిల్లో విజయం తథ్యం
  • - ‘నమస్తే తెలంగాణ’తో ఎమ్మెల్యే డాక్టర్‌ వీఎం అబ్రహం

మున్సిపల్‌ ఎన్నికల్లో వార్‌ వన్‌ సైడే ..ప్రతి పక్షాలు ఎన్ని కుట్రలు చేసిన వారిని ప్రజలు విశ్వసించరు. అధికార పార్టీతోనే అభివృద్ధి సాధ్యం.. అలంపూర్‌ నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీల్లో గులాబీ జెండాను ఎగురవేస్తామని అలంపూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ వీ ఎం అబ్రహం ధీమా వ్యక్తం చేశారు.   60 ఏండ్లల్లో జరగని అభివృద్ధి ఆరు ఏండ్లలో కేసీఆర్‌ చేసి చూపించారన్నారు. నియోజకవర్గంలో ఆయిల్‌ కంపెనీ, ఫుడ్‌ పార్క్‌, రైల్వే కోచ్‌ పనులు పూర్తి చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తున్నాం. మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం.. ఎన్నికల వాటిని అమలు  పరుస్తామన్నారు.  ఈ సందర్భంగా అలంపూర్‌, అయిజ, వడ్డేపల్లి మున్సిపాలిటీల్లో  ఏఏ అభివృద్ధి పనులు చేస్తారో ఆయన నమస్తే తెలంగాణకు వివరించారు.
-అలంపూర్‌,నమస్తే తెలంగాణ 

అలంపూర్‌,నమస్తే తెలంగాణ : ప్రతి పక్షాలు చేస్తున్న కుట్రలు అరచేయి అడ్డం పెట్టి సూర్య కాంతిని  ఆపినట్టుగా ఉంది.. ప్రతి పక్షాల కల్లబొల్లి మాటలు ప్రజలు నమ్మే స్థితిలో లేరు..మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెల వడం ఖాయమని అలం పూరు ఎమ్మెల్యే డాక్టర్‌ వీఎం అబ్రహం అన్నారు.  ప్రస్తుత మున్సిపల్‌ ఎన్నికల్లో నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులే గెలుస్తారని మూడు స్థానాల్లో కూడా టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులే మున్సిపల్‌ చైర్మన్‌ సీటు దక్కించుకుంటున్నామన్నారు.

నమస్తే తెలంగాణ : పురపోరెలో  ఏ ఎజెండా ఎంచుకుని ముందుకు పోతు న్నారు..?
ఎమ్మెల్యే అబ్రహం : అభివృద్ధే లక్ష్యంగా ముందుకు పోతున్నాం. గత ఎమ్మెల్యేలు చేయని అభివృద్ధి పనులు నేను చేశాను. ఏదైనా అధికార పార్టీలో ఉంటేనే అనుకున్న అభివృద్ధి సాధ్యమవుతుంది. సంక్షేమ పథకాలు మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపిస్తాయనే నమ్మకం ఉంది. ఇదివరకు అన్ని మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. అధికార పార్టీతోనే అభివృద్ధి సాధ్యమనే నినాదంతో ముందుకు పోతున్నాం..

 అభివృద్ధి ప్రణాళికలు ఏమైనా సిద్ధం చేశారా..?

నియోజకవర్గంలో కొత్త మున్సిపాలిటీలకు ఒక్కో మున్సిపాలిటీకి పది కోట్ల చొప్పున నిధులు మంజూరయ్యాయి. ఎన్నికల కోడ్‌ ఉన్న కారణంగా వచ్చిన నిధులను విని యోగించలేకపోయాం. పనులకు తగిన ప్రణాళికలు సిద్ధం చేశాం. ఎన్నికల ముగియ గానే పనులు మొదలు పెడతాం. అయిజలో రూ. 27 కోట్ల నిధులుతో పలు  అభివృద్ధి పనులు చేపట్టాం. మిగిలి పోయిన నిధులను ఎన్నికల తర్వాత వినియోగిస్తాం.

ప్రతి పక్షాల కుట్రలు ఎలా ఎదుర్కొంటున్నారు...?

అధికార పార్టీతో పోటీ చేయలేక ఎత్తుగడలతో అధికార పార్టీని అభాసుపాలు చేయడానికి ప్రతి పక్షాలు కుట్రలు పనుతున్నాయి. పార్టీలో ఉంటూ వెన్నుపోటు పొడిచే వారికి తగిన గుణపాఠం చేబుతాం. తల్లి పాలు రొమ్ము గుద్దె నాయకులను ప్రజలు విశ్వసించరు. పార్టీకి నష్టం చేసే నాయకులను గుర్తించి హైకమాండ్‌కు రిపోర్టు చేశాం. రెబల్స్‌గా మున్సిపల్‌ ఎన్నికల్లో ఉండే వారిని పార్టీ సస్పెండ్‌ చేస్తుంది. నన్ను రాజకీయంగా అణగతొక్కాలని ఆధారాలు లేని ఆరోపణలకు ప్రతి పక్షాలు తెర తీశాయి. ఎవరు ఎటువంటి వారో ప్రజలు గమనిస్తున్నారు. మంత్రి పర్యటన తర్వాత నియోజక వరాగల్లో  మార్పు వచ్చింది. వార్‌ వన్‌ సైడే అన్నట్టుగా మారిపోయింది.

ఓటర్లకు మీరిచ్చే సందేశం ఏమి..?

 తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన నీళ్లు, మన నిధులు, అనే నినాదంతో ప్రభుత్వం అన్ని హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంది.గత ప్రభుత్వాల పాలనకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనకు తేడా గుర్తించి ఓటు వేయమని అడుగుతు న్నాం. ప్రజల్లో చాలా మార్పు వచ్చింది స్వతహాగా ఆలోచించే స్థాయిలో ఉన్నారు. ఎవరో చెబిబితే వినే స్థితిలో లేరు.. స్వచ్చందంగా కారు గుర్తుకే ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి పక్షాలకు తగిన గుణపాఠం చెప్పనున్నారు. ప్రతి పక్షాల కుట్రలకు, కుతంత్రాలకు మోసపోవద్దని ఓటర్లకు గుర్తు చేస్తున్నాం.అభివృద్దిని చూసి ఓటు వేయమని అడుగుతున్నాం.

ఏ అంశాలు అభ్యర్థుల గెలుపునకు తోడ్పడతాయని అనుకుంటున్నారు..?

 ప్రజా సంక్షేమ పథకాలు పార్టీ అభ్యర్థుల గెలుపునకు తోడ్పడతా యనే నమ్మకం ఉంది.  ఏ పార్టీ చేయని విధంగా కార్యకర్తలను  టీఆర్‌ఎస్‌ ఆదుకుంటుంది. ప్రతి కార్యకర్తకు అండగా నిలబడింది. సీఎం రీలిఫ్‌ ఫండ్‌ కింద నియోజకవర్గంలో వందల కుటుంబాలకు  కోట్ల రూపాయలు  ఆర్థిక సాయం అందజేశాం. పార్టీ పరంగా అన్ని వర్గాల వారికి అవకాశం కల్పించాం. ఆయా వార్డుల్లో గెలిచే అభ్యర్థులకే అవకాశం కల్పించాం. రెబల్స్‌కు మరో సందర్భంలో నామినేటెడ్‌ పోస్టుల్లో  అవకాశం కల్పిస్తామని నచ్చ జెప్పాం. పార్టీ అధిష్టానం మాట విని పోటీ నుంచి తప్పుకున్న వారికి తగిన స్థానాలు ,హోదాలు కల్పిస్తాం.

మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రధాన మేనిఫెస్టో ఏమిటి..?

అన్ని మున్సిపాలిటీలను అద్దంలా తీర్చిదిద్దుతాం. వీలైననన్నీ నిధులు మంజూరు  చేయించి చిన్న, పెద్ద అనే తేడా లేకుండా సమస్యలన్నీ పరిష్కరిస్తాం. అంతర్గత రోడ్లు  ,మురుగు కాల్వలు, తాగునీరు, వీధి లైట్లు ,పింఛన్లు ఇలా ఒకటేమిటీ, అన్ని వర్గాల వారి సమస్యలను పరిష్కరస్తామన్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రులు  సహకారంతో రాష్ట్రంలో ఆదర్శ మున్సిపాలిటీలుగా మార్చేందుకుయ కృషి చేస్తా. పార్టీ ఆదేశాల మేర కు, ప్రజాభిష్టం మేరకు అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా. ముఖ్యంగా వం ద పడకల దవాఖాన, మినీ డిపో, డీగ్రి కాలేజీ ఏర్పాటు, గురుకుల విద్యాలయం ఏర్పా టు, తదితర అభివృద్ధి పనులు చేపట్టబోతున్నాం. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అన్ని హోదాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఉన్నందున ఏదైన సాధించాలంటే ఒక్క టీఆర్‌ఎస్‌ పార్టీ వల్లే సాధ్యమవుతుంది. ప్రతి పక్షాలు వల్ల సాధ్యం అయ్యే పరిస్థితి లేదు.logo