బుధవారం 01 ఏప్రిల్ 2020
Gadwal - Jan 20, 2020 , 01:57:56

నేటితో ప్రచారం బంద్‌

నేటితో ప్రచారం బంద్‌
  • -స్పీడు మీదున్న కారు.. కనిపించని ప్రతిపక్షాల జోరు
  • -మున్సిపాలిటీల కైవసం దిశగా కారు పరుగులు..
  • - ఓటరులంతా టీఆర్‌ఎస్‌వైపే
  • -ఉత్సాహాన్ని నింపిన సభలు, రోడ్‌షోలు
  • -కాంగ్రెస్‌, కమలంలో నిస్తేజం
  • -ప్రచార బరిలో వెనుకంజ
  • -నేటి సాయంత్రంతో ప్రచారానికి తెర

జోగుళాంబ గద్వాలజిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు నేటితో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారానికి తెరపడునుంది. గత వారం రోజులగా టీఆర్‌ఎస్‌ పార్టీ నాలుగు మున్సిపా లిటీల్లో ముమ్మర ప్రచారం నిర్వహించారు. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులంద రూ ఇంటింటికి వెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు. గులాబీ దూకుడు ముందు ప్రతిపక్ష పార్టీలన్నీ బేజారయ్యాయి. టీఆర్‌ఎస్‌ నాయకుల వేగాన్ని తట్టుకోలేక చతికిలబడ్డాయి. మున్సిపాలిటీల్లో నిర్వహించిన సభలు, రోడ్‌షోలు కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపడంతో పాటు ఓటర్లను ఆకర్శించగలిగింది.

నామినేషన్ల ఉపసంహరణ ముగిసినప్పటి నుంచి ముమ్మరంగా చేపట్టిన ప్రచారాలు నేటితో ముగియనున్నాయి. ఎన్నికలకు ఒక రోజు ముందుగానే ప్రచారాన్ని నిలిపివేయాలని ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన ఆదేశాలు అమ లుకానున్నాయి. దీంతో లౌడ్‌ స్పీకర్లు, వాహనాల్లో చాటింపులు, బహిరంగ సభలు, రోడ్‌షోలు మూకుమ్మడి ప్రచారాలు నిలిచిపోనున్నాయి. ఎన్నికల సంఘం ఆదేశాలను మీరి అభ్యర్ధులు ప్రచారం చేపడితే చట్టపరమైన చర్య లను అమలు చేయనున్నారు. ఇప్పటికే అన్ని రాజకీయపార్టీల నాయకులకు ఎన్నికలకు సంబంధించిన నిబంధలను అందజేశారు.

గద్వాలలో తిరుగులేని శక్తిగా టీఆర్‌ఎస్‌

గద్వాల మున్సిపాలిటీల్లో మొత్తం 37 వార్డుల్లో కూడా టీఆర్‌ఎస్‌ ముమ్మర ప్రచారాన్ని చేపట్టింది. అభ్యర్థులందరూ ప్రతి ఒక్క ఓటరును ప్రసన్నం చేసకొని కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తులు చేశారు. స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, అతని సతీమణి బండ్ల జ్యోతి ఎన్నికల ప్రచార రంగంలోకి దిగడంతో గద్వాలలో టీఆర్‌ఎస్‌ పార్టీకి తిరుగులేదని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. ప్రతి ఒక్క ఓటరను ఆప్యాయంగా పలుకరించి కారు గుర్తుకు ఓటు వేయమని అభ్యర్థించారు. వార్డుల్లోని సమస్యలను అడిగిమరీ తెలుసుకొని పరిష్కరిస్తామనడంతో ఓటర్లు మంత్ర ముగ్దులవుతున్నారు. గద్వాల ఎమ్మెల్యేకు సెంటిమెంట్‌గా వస్తున్న మహిళా ఆశీర్వాద సభను ఆదివారం నిర్వహించడంతో టీఆర్‌ఎస్‌ పార్టీ మహిళ ఆదరాభిమానాలను చూరగొంది.

అలంపూర్‌లో సుడిగాలి పర్యటనలు

అలంపూర్‌ నియోజకవర్గంలో అలంపూర్‌, అయిజ, వడ్డేపల్లి మూడు మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగతుండటంతో ఎమ్మెల్మే డాక్టర్‌ వీఎం అబ్రహం మూడు మున్సిపాలిటీల్లో సుడిగాలి పర్యటనలు చేపట్టారు. ప్రతి ఒక్క మున్సిపాలిటీల్లో పర్యటించి కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. ఎమ్మెల్యేతో పాటు జెడ్పీ చైర్‌పర్సన్‌ సరిత క్షేత్ర స్థాయిలో ఎన్నికల పర్యట నలు నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు. శనివారం అలంపూర్‌ నియోజకవర్గంలో మంత్రి నిరంజన్‌ రెడ్డి చేపట్టిన రోడ్‌షోలు పార్టీకి మంచి మైలేజీని అందించాయి. రోడ్‌షోలో ప్రసంగిస్తూ ఎన్నికల అనంతరం చేపట్టే అభివృద్ధి పథకాలపై ప్రజలకు మంత్రి నిరంజన్‌ రెడ్డి వివరించారు. దీంతో అలంపూర్‌లోని మూడు మున్సిపాలిటీలో గులా బీ జెండా ఎగురడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.

చతికిలపడ్డ ప్రతిపక్షాలు

మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రచారాలకు ప్రతి పక్షాలు తట్టుకోలేక పోయాయి. పార్టీల తరపున అభ్యర్థులను ప్రకటించే నాటి నుంచి ప్రచారం చేపట్టే వరకు కూడా టీఆర్‌ఎస్‌ పార్టీని ఏ మాత్రం అందుకోలేక పోయాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీలకు కొన్ని స్థానాల్లో అభ్యర్థులే లేక పోవడం ఆయా పార్టీల బలహీనతలను తెలియజేస్తున్నాయి. మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు మొక్కుబడిగా మాత్రమే ప్రచారాలు నిర్వ హించారు. చెప్పుకోదగిన సమావేశాలు, ఓటర్లను ఆకర్శించే సభలు ఒక్కటి కూడా ఏర్పాటు చేయకపోవడంతో ఆ పార్టీ నాయకులపై సొంత పార్టీ కార్యకర్తలే విశ్వాసం కోల్పోయే పరిస్థితులు ఏర్పాడ్డాయి.logo
>>>>>>