ఆదివారం 29 మార్చి 2020
Gadwal - Jan 19, 2020 , 01:10:31

నిండు జీవితానికి రెండు చుక్కలు

నిండు జీవితానికి రెండు చుక్కలు
  • - నేడు పల్స్‌ పోలియో
  • - 457 పోలియో కేంద్రాల ఏర్పాటు
  • - 45మంది రూట్‌ అధికారులను నియామకం
  • - జిల్లాలో 73891మంది చిన్నారులు
  • - సంచార జాతులపై ప్రత్యేక దృష్టి
  • - అవగాహన ర్యాలీ ప్రారంభించిన జేసీ నిరంజన్‌, జిల్లా వైద్యఆరోగ్య అధికారులు
గద్వాలటౌన్‌ : జిల్లా వ్యాప్తంగా ఆదివా రం నుంచి మూడు రోజుల పాటు చిన్నారులకు పోలియో చుక్కల పంపిణీకి స ర్వం సిద్ధమైంది. చుక్కల పంపిణీకి జిల్లా వైద్య శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. అందుకు గాను ఇప్పటికే విస్తృత ప్రచారం నిర్వహించారు. వాడ వాడలా బ్యానర్లు కట్టారు, పోస్లర్లు వేశా రు. అలాగే పాతబస్టాండ్‌లో పెద్దపాటి బెలూన్‌ను ఏర్పాటు చేశారు. చుక్కల మందు పంపిణీకి ప్రత్యేకంగా సిబ్బందిని నియామం చేశారు. రూట్‌ అధికారులు, సూపర్‌వైజర్లు, ఆశాలు, ఏఎన్‌ఎంల ను ప్రత్యేక టీంలుగా ఏర్పాటు చేశారు. అలాగే ప్రధాన కూడళ్లతో పాటు బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌ తదితర ప్రాంతాలలో కూడా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 20, 21తేదీలలో ఇంటింటికీ తి రిగి మందును పంపిణీ చేసేందుకు గాను అన్ని చర్యలు తీసుకున్నారు.

సంచార జాతులపై ప్రత్యేక దృష్టి..

జిల్లాలోని సంచార జాతులు, ఇటుక బట్టీలపై వైద్య శాఖ ప్రత్యేక దృష్టి సా రించింది. అందులో భాగంగా జిల్లాలో గత నెలలో  ప్రత్యేక సర్వే చేశారు. సర్వే లో 68ప్రాంతాలు హైరిస్క్‌ ప్రాంతా లుగా అధికారులు గుర్తించారు. గుర్తించి న ప్రాంతాల్లో ఐదేళ్లలోపు చిన్నారులు 566మంది ఉన్నట్లు అధికా రులు తెలి పారు. గుర్తించిన పిల్లలందరికీ పోలీయో చుక్కలు పంపిణీ చేసేందుకు ప్రత్యేక చర్యలను చేపట్టినట్లు అధికారులు వెల్ల డించారు.

చుక్కలను వేయించడం అందరి బాధ్యత

- జేసీ నిరంజన్‌

 అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవ త్సరాలలోపు ఉన్న ప్రతి చిన్నారికి పోలి యో చుక్కలను వేయించడం అం దరి బాధ్యతని జాయింట్‌ కలెక్టర్‌ నిరంజన్‌ సూచించారు. ఆదివారం నుం చి నిర్వ హించనున్న పోలీయో చుక్కల మందు పంపిణి కార్యక్రమాన్ని పురస్క రించుకు ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధర్యంలో శనివారం అవగాహన ర్యా లీ నిర్వ హించారు. ర్యాలీని జిల్లా కేంద్రం లోని కృష్ణవేణి చౌరస్తాలో జేసి, ఇన్‌చార్జి డీ ఎంహెచ్‌వోలు జెండాఊపి ర్యాలీని ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ పోలియో చుక్కల మం దు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వ హించాలని సూచించారు. ముఖ్యంగా సంచార జాతుల పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. నిర్ణిత తేదీలలో తల్లిదండ్రులు తమ పిల్లలకు విధిగా పో లియో చుక్కలను వేయించాలని కోరా రు. ప్రతి చిన్నారికి మందును తప్పక పంపిణీ చేయాలన్నారు. అనంతరం  ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డాక్టర్‌ సునీత మాట్లాడుతూ జలుబు, దగ్గు, చిన్న పా టి అస్వస్థలు ఉన్న మందును వేయించు కోవాలని సూచించారు. అనంతరం పట్టణ ప్రధాన రహదారుల గుండా ర్యాలీని నిర్వహించారు.  కార్యక్రమం లో జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ శశికళ, జిల్లా సంక్షేమ అధికారి కమలాదేవి, సీహెచ్‌వో రామకృష్ణ, డీపీ ఎంవోలు మల్లికార్జున్‌, ప్రేమ్‌సాగర్‌, హెచ్‌ఈ మధుసూదన్‌రెడ్డి, ఆశా కార్యక ర్తలు, సూపర్‌వైజర్లు, ఆరోగ్యకార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.logo