శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Gadwal - Jan 19, 2020 , 01:07:29

రమనీయం.. గోపాలదాసుల వారి రథోత్సవం

రమనీయం.. గోపాలదాసుల వారి రథోత్సవం


అయిజ : అప్రోక్ష జ్ఞానులలో భవిష్యత్‌ గురించి చెప్పిన మహాజ్ఞాని గోపాలదాసుల ఆరాధనోత్సవాలు ఉత్తనూరులో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శనివారం గోపాలదాసుల వారికి బ్రాహ్మణులు సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, అష్టోదశ, సర్వసేవను నిర్వహించిన అనంతరం మధ్యారాధన మహోత్సవాన్ని కమణీయంగా నిర్వహించారు.

రమణీయంగా రథోత్సవం..

ఆరాధనోత్సవాల్లో భాగంగా గోపాలదాసులవారి రథోత్సవం రమణీయంగా నిర్వహించారు. స్వామిని రథంపై ఆశీనులను చేసి భక్తుల గోవింద నామస్మరణలు, తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారులు భక్తికీర్తనలు ఆలపిస్తుండగా రథోత్సవాన్ని బ్రాహ్మణ భక్తులు ధన్వంతరి వెంకటేశ్వరస్వామి ఆలయం వరకు తీసుకొచ్చి అక్కడ వెంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజల అనంతరం తిరిగి గోపాలదాసుల వారి ఆలయం వరకు రథాన్ని లాగారు. ఊరేగించారు. అంతకుముందు గోపాలదాసుల జీవిత చరిత్ర గురించి బ్రాహ్మణులు భక్తులకు ఉపన్యాస రూపంలో వివరించారు. భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో గోపాలదాసుల వంశీయులు, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్రలకు చెందిన బ్రాహ్మణులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.

నేడు ధన్వంతరి హోమం, ఉత్తరరాధన..

గోపాలదాసుల ఆరాధనోత్సవాల్లో భాగంగా ఆదివారం ధన్వంతరి హోమం, ఉత్తరరాధన మహోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామి కృపకు పాత్రులు కాగలరని బ్రాహ్మణులు కోరారు.


logo