సోమవారం 06 ఏప్రిల్ 2020
Gadwal - Jan 18, 2020 , 01:13:46

ప్రచార హోరు

ప్రచార హోరు
  • - స్పీడ్‌ పెంచిన కారు
  • - చతికిల పడ్డ ప్రతిపక్షాలు
  • -గద్వాలలో అభివృద్ధే మంత్రంగా ఇంటింటా టీఆర్‌ఎస్‌ ప్రచారం
  • -నేడు అలంపూర్‌ సెగ్మెంట్‌లో మంత్రి నిరంజన్‌రెడ్డి రోడ్‌షోలు

జిల్లాలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రచార హోరు జోరుగా కొనసాగుతుంది. ఏ వార్డు, ఏ కాలనీలో చూసిన ఇంటింటా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రచార జోరును కొనసాగిస్తున్నారు. గద్వాల మున్సిపాలిటీల్లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఉదయం సాయంత్రం వార్డుల్లో ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను కలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలంపూర్‌ నియోజకవర్గంలోని మూడు బల్దియాల్లో రాష్ట్ర అగ్రోస్‌ చైర్మన్‌ లింగంపల్లి కిషన్‌రావు, జెడ్పీచైర్‌పర్సన్‌ సరిత, ఎమ్మెల్యే అబ్రహం, రాష్ట్ర వినియోగదారుల ఫోరం చైర్మన్‌ గట్టు తిమ్మప్పతో కలిసి  వార్డులో పర్యటిస్తూ ప్రజలను టీఆర్‌ఎస్‌ వైపు మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలోని టీఆర్‌ఎస్‌ ప్రచార దూకుడు కొనసాగిస్తుంటే ప్రతి పక్షాలు ప్రచారం చతికిల పడిపోయాయి. గెలిస్తే ఏమి చేస్తారో ప్రజలకు చెప్పలేని పరిస్థితి నాలుగు పురపాలక సంఘాల్లో ప్రతిపక్షాలకు ఉంది. శనివారం అలంపూర్‌ నియోజకవర్గంలో మంత్రి నిరంజన్‌రెడ్డి రోడ్‌షో నిర్వహించునున్నారు.
-గద్వాల,నమస్తేతెలంగాణ

మున్సిపల్‌ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో
అభ్యర్థుల తరుపున మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ బాధ్యులు ప్రచారం ముమ్మరం చేశారు. కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తే మున్సిపాలిటీల అభివృద్ధికి మరిన్ని నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామని హామీలు ఇస్తున్నారు. ప్రతిపక్ష నాయకుల మాటలు నమ్మొద్దని ఓటర్లకు సూచిస్తున్నారు.
- నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌ 
logo