శనివారం 04 ఏప్రిల్ 2020
Gadwal - Jan 17, 2020 , 00:50:45

మూడు రాష్ర్టాలకు సరిహద్దు అయిజ

మూడు రాష్ర్టాలకు సరిహద్దు అయిజ
  • -ఉద్యమాలకు పురిటి గడ్డ n ఆవో.. జావో నుంచి వచ్చినదే అయిజ
  • -2014 మున్సిపల్‌ ఎన్నికల్లో ఎగిరిన టీఆర్‌ఎస్‌ జెండా
  • -2018లో మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌మూడు రాష్ర్టాలకు సరిహద్దుగా ఉంటూ.. తుపత్రాల, పర్దిపురం గ్రామాలతో మేజర్‌ గ్రామ పంచాయతీగా ఉన్న అయిజ 2012లో నగరపంచాయతీగా ఏర్పడింది. 2014 జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి గులాబీ జెండాను ఎగురవేసింది. 2018, మార్చి 18న స్వరాష్ట్రంలో మున్సిపాలిటీగా ఏర్పాటైన అయిజ మున్సిపాలిటీ గ్రౌండ్‌ రిపోర్ట్‌.    - అయిజ
అయిజ: నాటి నిజాం నవాబులు, పౌరహక్కుల ఉద్యమాలు, ప్రజా సంఘాల ఉద్యమాలతోపాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు చేపట్టిన ఉద్యమాలకు అయిజ పురిటి గడ్డగా నిలిచింది. నిజాం నవాబులు కృష్ణా, తుంగభద్ర నదుల నడుమ ధ్యాన్యాగారాలను ఏర్పాటు చేసుకుని ఇక్కడి నుంచి లేవీ (ధాన్యం సేకరణ) చేసేవారని, అప్పడు నాటి నవాబులు ఆవో .. జావో అని పిలిచేవారని, అందువల్లే అయిజకు పేరు వచ్చినట్లు చరిత్ర ఆధారాలను బట్టి తెలుస్తోంది. తుపత్రాల, పర్దిపురం గ్రామాలు కలిసి మేజర్‌ గ్రామ పంచాయతీగా ఉన్న అయిజను 2012, ఏప్రిల్‌ 12న నగరపంచాయతీగా అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2014, మార్చి 30న జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో 20 వార్డులలో 16 వార్డులు టీఆర్‌ఎస్‌ పార్టీ అఖండ విజయం సాధించి గులాబీ జెండాను ఎగురవేసింది. అయిజ నగరపంచాయతీ చైర్‌ పర్సన్‌గా మొట్టమొదటిగా రాజేశ్వరి 2014,జులై 3న ప్రదవీ ప్రమాణం చేసింది. ఆనాడు ఉమ్మడి జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీకి అందించిన ఏకైక మున్సిపాలిటీ అయిజ. 2018, మార్చి 18న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నగరపంచాయతీని మున్సిపాలిటీగా ఏర్పాటు చేసింది.

అయిజ మున్సిపాలిటీ జనాభా ..

అయిజ మున్సిపాలిటీలో 2011 జనాభా లెక్కల ప్రకారం 27,921. అందులో పురుషులు 1,091, స్త్రీలు 13,830. నగరపంచాయతీగా ఏర్పాటైన సమయంలో 2001 జనాభా లెక్కల ప్రకారం 22,527 ఉండగా, పురుషులు 11,953, స్త్రీలు 10,574 ఉండేది.

2012న నగరపంచాయతీగా ..

అయిజ నగరపంచాయతీగా 2012, ఏప్రిల్‌ 16న శివారు గ్రామాలను కలుపుతూ అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి 2014 జులై వరకు ప్రత్యేకాధికారులతో పాలన కొనసాగింది. 2014లో మొట్ట మొదటి సారిగా అయిజ నగరపంచాయతీకి ఎన్నికలు నిర్వహించారు. 20వార్డులతో ఏర్పాటై అయిజ నగరపంచాయతీలో 20 వార్డులకు ఎన్నికలు జరుగగా 16 వార్డులలో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు ప్రభంజనం సష్టించి, ఉమ్మడి జిల్లాలోనే టీఆర్‌ఎస్‌ పార్టీకి స్వచ్ఛమైన మెజార్టీతో అయిజ నగరపంచాయతీ ప్రజలు అందించింన ఘనత అయిజ దక్కించుకున్నది. అయిజ నగరపంచాయతీ మొట్ట మోదటి చైర్‌ పర్సన్‌గా రాజేశ్వరి, వైస్‌ చైర్మన్‌గా నాగన్నగౌడ్‌లు ఎన్నికైనారు. 2018, మార్చి 23న అయిజ నగరపంచాయతీని మున్సిపాలిటీగా తెలంగాణ ప్రభుత్వం అప్‌గ్రేడ్‌ చేసింది.

సరిహద్దుగా అయిజ మున్సిపాలిటీ

జోగుళాంబ గద్వాల జిల్లాలోని అయిజ మున్సిపాలిటీ మూడు రాష్ర్టాలకు సరిహద్దుగా ఉంది. 20 వార్డులు, 7 రెవిన్యూ వార్డులతో 18 కిలోమీటర్ల మేర వ్యాపించిన అయిజ మున్సిపాలిటీకి ఓ ప్రత్యేకత ఉంది. అయిజ పట్టణం మీదుగా నిత్యం ఏపీలోని కర్నూల్‌, కడప, నెల్లూరు, రాజమండ్రి, చీరాల, మంత్రాలయం, శ్రీశైలం, కర్ణాటకలోని రాయచూర్‌, సింధనూరు, తెలంగాణ రాష్ట్రంలోని హన్మంకొండ, గద్వాల పాంత్రాలకు అయిజ మీదుగా ఆర్టీసీ బస్సులు రాక పోకలు సాగిస్తుంటాయి. అయిజకు సమీపంలోనే తుంగభద్ర నదిపై నిర్మిస్తున్న నాగల్‌దిన్నె వంతెన నిర్మాణం పూర్తి చేస్తే ఎమ్మిగనూర్‌, ఆదోని, బళ్లారి, మంత్రాలయం ప్రాంతాలకు రాకపోకలకు అనువుగా ఉంటుంది. అయిజ పట్టణం వ్యాపార కేంద్రంగా దినదినాభివృద్ధి చెందుతోంది. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న నిధులతో అయిజ మున్సిపాలిటీ మరింత వేగవంతంగా అభివృద్ధికి బాటలు పడుతున్నాయి.logo