ఆదివారం 29 మార్చి 2020
Gadwal - Jan 15, 2020 , 02:16:12

బరిలో 331 మంది

బరిలో 331 మందిబల్దియా బరిలో 331 మంది పోటీ పడుతున్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలోని 77 వార్డు స్థానాలకు గాను అలంపూర్‌ ఐదోవార్డు స్థానానికి టీఆర్‌ఎస్‌కు చెందిన దేవన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 76 స్థానాలకు నామినేషన్లు వేసిన వారిలో 127 మంది ఉపసంహరించుకున్నారు. 331 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. స్వతంత్రులకు గుర్తులు కేటాయించడంతో అభ్యర్థులు ప్రచారం మొదలు పెట్టారు. ఈనెల 22న పోలింగ్‌ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
-  జోగుళాంబ గద్వాల ప్రతినిధి/నమస్తే తెలంగాణ

జోగుళాంబ గద్వాలజిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ: నామినేషన్‌ విత్‌డ్రా ప్రక్రియ ముగియడంతో ఎన్నికల అధికారులు బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించారు. అలంపూర్‌ మున్సిపాలిటీలో 5వ వార్డు ఏగ్రీవం కాగా, జిల్లాలోని మిగిలిన 76వార్డులకు ఎన్నికల అధికారులు పోలింగ్‌ నిర్వహించనున్నారు. విత్‌డ్రా సమయం ముగిసే నాటికి  మొత్తం జిల్లా వ్యాప్తంగా 127 అభ్యర్థులు విత్‌డ్రా చేసుకోవడంతో పోటీలో 331 మంది నిలిచారు. వారిలో గద్వాలలో 37 వార్డులకు 137 మంది, అయిలో 20 వార్డులకు 91 మంది, అలంపూర్‌లో 10 వార్డులకు 47 మంది, వడ్డేపల్లిలో 10వార్డులకు 29 మంది పోటీలో ఉన్నట్టుగా ప్రకటించారు. ఇండిపెండెంట్‌ అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. ఈ నెల 22న పోలింగ్‌ నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. 

గద్వాల బరిలో137 మంది

జిల్లాలోని అతిపెద్ద మున్సిపాలిటీ అయిన గద్వాల మున్సిపాలిటీలో మొత్తం 37 వార్డులకుగాను మొత్తం 296 నామినేషన్లు దాఖలయ్యాయి. మంగళవారం విత్‌డ్రా ప్రక్రియ చేపట్టడంతో వారిలో 70 మంది అభ్యర్థులు నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకున్నారు. వారిలో టీఆర్‌ఎస్‌ నుంచి 20మంది, బీజేపీ నుంచి 13 మంది, కాంగెస్‌ నుంచి 8 మంది, టీడీపీ నుంచి ఇద్దరు, ఇండిపెండెంట్లుగా నామినేషన్‌ వేసిన వారు 27 మంది అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో బరిలో మొత్తం 137 మంది అభ్యర్థులు నిలవగా వారి లో  పార్టీల వారీగా  టీఆర్‌ఎస్‌ 37, బీజేపీ 34, సీపీఐ ఒకరు, కాంగ్రెస్‌ నుంచి 25 మంది, ఎంఐఎం నుంచి నలుగురు,  టీడీపీ నుంచి నలుగురు, ఇండిపెండెంట్లు 30 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. గద్వాల ము న్సిపాలిటీలో అత్యధికంగా 18, 14 వ వార్డుల్లో 7 మం ది అభ్యర్థులు పోటీ పడగా అత్యల్పంగా 1,17, 27, 28వ వార్డుల్లో ఇద్దరు మాత్రమే పోటీ పడుతున్నారు.

అయిజలో 91 మంది పోటీ

అయిజ మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులకుగాను మొత్తం 115 నామినేషన్ల దాఖలుకాగా, వారిలో చివరకు 91 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. గడువు సమయం ముగిసే వరకు 24మంది అభ్యర్థులు తమ నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకున్నట్టుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. నామినేషన్‌ విత్‌డ్రా చేసుకున్న వారిలో టీఆర్‌ఎస్‌ నుంచి 9మంది, బీజేపీ  నుంచి ముగ్గురు, కాంగ్రెస్‌ నుంచి 6 మంది,  ఇండిపెండెంట్లు 6 మంది అభ్యర్థులు ఉన్నారు. అయిజలో పార్టీల వారీగా  టీఆర్‌ఎస్‌ నుంచి 20 మంది, బీజేపీ 15, కాంగ్రెస్‌ 20 మంది,  టీడీపీ నుంచి 7 మంది, ఇతర రాష్ర్టాల్లో గుర్తింపు పొందిన పార్టీ నుంచి 20 మంది,  ఇండిపెండెంట్లు 9మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. అయిజ మున్సిపాలిటీలో 3వవార్డు నుంచి 8మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా అత్యల్పంగా 1,2, 13, 20వ వార్డుల నుంచి ముగ్గురు అభ్యర్థులు  మాత్రమే పోటీ పడుతున్నారు.

వడ్డేపల్లి మున్సిపాలిటీలో29  మంది పోటీ

వడ్డేపల్లి మున్సిపాలిటీలో మొత్తం 10 వార్డులకుమొత్తం 52 నామినేషన్లు దాఖలయ్యాయి. వారిలో 23 మంది అభ్యర్థులు నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకున్నట్టుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. నామినేషన్‌ విత్‌డ్రా చేసుకున్న వారిలో టీఆర్‌ఎస్‌ నుంచి 10, బీజేపీ నుంచి ఒకటి, కాంగ్రెస్‌ నుంచి 11,  ఇండిపెండెంట్లు ఒక నామినేషన్‌ ఉన్నాయి. పోటీదారుల జాబి తా విడుదల కావడంతో మొత్తం 29 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వారిలో  పార్టీల వారీగా  టీఆర్‌ఎస్‌ నుంచి 10 మంది బీజేపీ 6 మంది మంది, కాంగ్రెస్‌ 10 మంది, ఎంఐఎం నుంచి ఇద్దరు, ఇండిపెండెంట్‌ ఒకరు పోటీలో నిలిచారు. వడ్డేపల్లి మున్సిపాలిటీలో అత్యధికంగా 7, 9వ వార్డుల్లో నలుగురు, అత్యల్పంగా 1,2,4వ వార్డుల్లో ఇద్దరు మాత్రమే పోటీ పడుతున్నారు.

అలంపూర్‌లో  47  మంది అభ్యర్థులు

అలంపూర్‌ మున్సిపాలిటీలో మొత్తం 10 వార్డుల్లో 5వ వార్డు నుంచి ఎరుకలి దేవన్న ఏకగ్రీవం కాగా, మిగిలిన 9 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. వారిలో 10మంది అభ్యర్థులు నామినేషన్లను విత్‌డ్రా చేసుకున్నట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. నామినేషన్‌ విత్‌డ్రా చేసుకున్న వారిలో టీఆర్‌ఎస్‌ నుంచి ఇద్ద రు, సీపీఎం నుంచి ఒకరు,  కాంగెస్‌ నుంచి ఒకరు, సీపీ ఐ నుంచి ఇద్దరు,  ఇతర పార్టీల నుంచి ఒకరు, ఇండిపెండెంట్లు ముగ్గరు ఉన్నారు. బరిలో నిలిచిన 47 మం ది అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. పార్టీల వారీగా  టీఆర్‌ఎస్‌ నుంచి 9 మంది, బీజేపీ6 మంది, కాంగ్రెస్‌ 8మంది, టీడీపీ ఒక రు, ఎంఐఎం నుంచి ఒకరు, సీపీఐ నుంచి ఒకరు, సీపీ ఎం నుంచి ఒకరు, టీడీపీ నుంచి ఒకరు, ఇతర రా ష్ర్టాల్లో గుర్తింపు పొందిన పార్టీల నుంచి 8మంది, ఇండిపెండెంట్లుగా 12 మంది బరిలో ఉన్నట్టు ప్రకటించారు. అలంపూర్‌ మున్సపాలిటీలో అత్యధికంగా 2వ వార్డు నుంచి 8మంది, అత్యల్పంగా 8వ వార్డు నుంచి ముగ్గరు పోటీలో ఉన్నారు. logo