సోమవారం 06 ఏప్రిల్ 2020
Gadwal - Jan 15, 2020 , 02:15:18

యువతే దేశానికి పెట్టుబడి

యువతే దేశానికి పెట్టుబడి
  • -సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి
  • -గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించాలి
  • -అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహం
  • - కంచుపాడులో యువజన క్రీడోత్సవాలు ప్రారంభం

ఉండవెల్లి : యువతే దేశానికి పెట్టుబడి అని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని కంచుపాడు గ్రామంలో ఏఐవైఎఫ్‌ ఆధ్వర్యంలో యువజనోత్సవాల కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించగా ముఖ్య అతిథులుగా సురవరం సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే అబ్రహం హాజరై క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో 35శాతం యువతీ, యువకులు శక్తి సామర్థ్యాలు, నైపుణ్యాలు కలిగి ఉన్నారన్నారు. అంతరించి పోతున్న గ్రామీణ క్రీడలకు ఏఐవైఎఫ్‌ జీవం పోయడం ఎంతీ సంతోషించదగ్గ విషయం అని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యువత నూతన ఆవిష్కరణలు చేస్తూ తక్కువ ఖర్చుతో వ్యవసాయ యంత్రాలు తయారుచేయాలన్నారు. ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ అంతరించిపోతున్న కళలు, సంప్రదాయాలు, క్రీడలను నేటి యువత కాపాడుకోవలసిన అవసరం ఎంతైన ఉందన్నారు. ఇలాంటి యువజనోత్సవాలు ప్రతి గ్రామంలో నిర్వహించి యువతలో స్ఫూర్తి నింపాలన్నారు. గెలుపు, ఓటములు సమానంగా స్వీకరించి క్రీడల్లో రాణించి గ్రామానికి, రాష్ర్టానికి పేరు తీసుకు రావాలని ఎమ్మెల్యే అకాంక్షించారు. అనంతరం క్రీడాకారులకు క్రీడా దుస్తులను అందజేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి విజయలక్ష్మి,  కపిల్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
logo