శనివారం 04 ఏప్రిల్ 2020
Gadwal - Jan 15, 2020 , 02:14:18

సూపర్‌ -7 క్రికెట్‌ ఛాంపియన్‌గా .. తెలంగాణ బాలుర జట్టు

సూపర్‌ -7 క్రికెట్‌ ఛాంపియన్‌గా .. తెలంగాణ బాలుర జట్టు
  • -బాలికల విభాగంలో ఫైనల్‌కు చేరిన తెలంగాణ - ఛత్తీస్‌ఘడ్‌ జట్లు
  • -నేడు ఫైనల్‌ మ్యాచ్‌

మహబూబ్‌నగర్‌ స్పోర్ట్స్‌ : జాతీయ స్థాయి ఎస్‌జీఎఫ్‌ సూపర్‌ -7 క్రికెట్‌ టోర్నీ హోరాహోరీగా కొనసాగింది. మంగళవారం ఎండీసీఎ మైదానంలో బాలుర విభాగంలో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో  తెలంగాణ జట్టు ఢిల్లీపై 32 పరుగులతో వికెట్ల పరుగుల తేడాతో గెలిచి ఛాంపియన్‌గా నిలిచింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటిం గ్‌ చేసిన తెలంగాణ జట్టు 7 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది.  జట్టులో విశాల్‌గౌడ్‌ (39), సిద్దూనాయక్‌ 20 పరుగులు చేశారు.అనంతరం బ్యా టింగ్‌కు దిగిన ఢిల్లీ జట్టు 7 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసి ఓటమి పాలైంది. తెలంగాణ బాలుర జట్టు చాంపియన్‌గా నిలిచింది. 

ఫైనల్‌కు చేరిన తెలంగాణ ఛత్తీస్‌గఢ్‌ జట్టు

బాలుర కళాశాల మైదానంలో బాలికల విభాగంలో జరిగిన మ్యాచ్‌లో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ జట్లు ఫైనల్‌కు చేరాయి. మొదటి సెమీ ఫైనల్‌లో ఛత్తీస్‌గఢ్‌ జట్టు మ హారాష్ట్రపై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొ దట బ్యాటింగ్‌ చేసిన మహారాష్ట్ర జట్టు 7  ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికి 83 పరుగులు చేసింది. జట్టులో మ యూరి 41, ప్రియ 13 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఛత్తీస్‌గఢ్‌ జట్టు 6.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసి ఫైనల్‌కు చేరింది. రెండో సెమీ ఫైనల్‌లో తెలంగాణ జట్టు ఢిల్లీపై 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసి న తెలంగాణ జట్టు 7ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 65 ప రుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ జట్టు 7 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసి ఓడిపోయింది. బుధవారం జరిగే ఫైనల్‌ మ్యాచ్‌లో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ బాలికల జట్లు తలబడనున్నాయి.

గెలుపోటములు సహజం : ఎండీసీఏ సెక్రటరీ

క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడా స్ఫూర్తిని చాటాలని జిల్లా క్రికెట్‌ సంఘం ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ అన్నారు. ఎండీసీఏ మైదానంలో జరుగుతున్న క్రికెట్‌ పోటీలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, క్రీడా కారులకు బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు. జాతీయ స్థాయి పోటీలకు జిల్లా కేంద్రం వేదిక కావడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్‌ అం డర్‌-19 కార్యదర్శి పాపిరెడ్డి, టోర్నీ ఆర్గనైజర్‌ సురేశ్‌ కుమార్‌, టెక్నికల్‌ అఫీషియల్‌ బాల్‌రాజ్‌, రాష్ట్ర, జాతీ య పరిశీలకులు విశాల్‌పాటక్‌,  బీఎస్‌ ఆనంద్‌, వ్యా యామ ఉపాధ్యాయులు వేణుగోపాల్‌, అబ్దుల్లా, జగన్మోహన్‌గౌడ్‌, రాఘవేందర్‌, నాగరాజు, ముకరం రామ్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

logo