మంగళవారం 31 మార్చి 2020
Gadwal - Jan 14, 2020 , 01:39:49

బరిలో నిలిచేదెవరో..?

బరిలో నిలిచేదెవరో..?


జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఎన్నికల్లో పోటీ చే సేందుకు వార్డుల వారీగా  గద్వాలలో 296, అయిజలో 136, వడ్డేపల్లిలో 55, అలంపూర్‌లో 81 నామినేషన్లు అధికారులు స్వీకరించారు. వీటిలో వివరాలు సరిగా పొందుపరచని అయిజ మున్సిపాలిటీకి చెందిన అభ్యర్థి నామినేషన్‌ను అ ధికారులు తిరస్కరించి మొత్తం 570 నా మినేషన్లు ఆమోదించారు. వీటిలో నేడు పోటీ నుంచి తప్పుకోవాలని నిర్ణ యిం చుకున్న అభ్యర్థులకు ఎన్నికల కమిషన్‌ నామినేషన్‌ ఉపసంహరణకు అవ కాశం కల్పించారు. ఒకటికి మించి ఎక్కువ నామినేషన్లు వేసిన అభ్యర్థులు నేడు అదనంగా వేసిన నామినేషన్లను ఉపసంహరించుకోనున్నారు. వీరితో  పాటు కొంద రు ఇండిపెండెంట్లు, రెబల్స్‌ కూడా విత్‌ డ్రా చేసుకునే అవకాశాలున్నాయి.

టీఆర్‌ఎస్‌ నుంచి 169 నామినేషన్లు

జిల్లా వ్యాప్తంగా మొత్తం 77 వార్డులకుగాను టీఆర్‌ఎస్‌ తరుపున 169 నా మినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో గద్వాల మున్సిపాలిటీ నుంచి 37 వార్డులకు గా ను 77 నామినేషన్లు, అయిజ మున్సిపాలిటీ నుంచి 20 వార్డులకుగాను 50 నా మినేషన్లు, అలంపూర్‌ మున్సిపాలిటీ నుంచి 22 నామినేషన్లు, వడ్డేపల్లి మున్సిపాలిటీ నుంచి 20 నామినేషన్లు టీఆర్‌ఎస్‌ తరుపున దాఖలయ్యాయి. ఒకటి కంటే ఎక్కువ నామినేషన్‌ వేసిన అభ్యర్థులు బీఫారాలను ఎన్నికల అధికారుల కు సమర్పించి అదనంగా వేసిన 92 నా మినేషన్లను ఉపసంహరించుకోనున్నా రు. దీంతో టీఆర్‌ఎస్‌ తరుపున 77 మం ది  బరిలో ఉండనున్నారు.

బీజేపీ నుంచి 129 నామినేషన్లు

బీజేపీ నుంచి మొత్తం 129 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో గద్వాల నుంచి 37 వార్డులకుగాను 92 నామినేషన్లు, అయిజ నుంచి 20 వార్డులకు గాను 19 నామినేషన్లు, అలంపూర్‌ 10 వార్డులకుగాను  11 నామినేషన్లు, వడ్డేపల్లి నుంచి 10 వార్డులకుగాను 7 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో వార్డుల సంఖ్యకు మించి అదనంగా గద్వాలలో, అలంపూర్‌లో మాత్రమే అధికంగా నామినేషన్లు దాఖలయ్యాయి. అదనంగా నామినేష న్లు వేసిన అభ్యర్థులు నామినేషన్‌ ఉపసంహరణ చేసుకుంటే బీజేపీ నుంచి మొత్తం 73 మంది అభ్యర్థులు బరిలో ఉండనున్నారు.

కాంగ్రెస్‌ నుంచి 100 నామినేషన్లు

కాంగ్రెస్‌ నుంచి 100 నామినేషన్లను దాఖలు చేశారు. వీటిలో గద్వాల నుంచి 37 వార్డులకుగాను 36నామినేషన్లు, అయిజ నుంచి 20 వార్డులకు గాను 26 నామినేషన్లు, అలంపూర్‌ 10 వార్డులకుగాను  నుంచి 15 నామినేషన్లు, వడ్డేపల్లి నుంచి 10 వార్డులకుగాను 23 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో వార్డుల సంఖ్యకు మించి అదనంగా అయిజ, అలంపూర్‌లో వడ్డేపల్లిలో నామినేషన్లు దాఖలయ్యాయి. అదనంగా నామినేషన్లు వేసిన అభ్యర్థులు నామినేషన్‌ ఉప సంహరణ చేసుకుంటే కాంగ్రెస్‌ నుంచి మొత్తం 76 మంది అభ్యర్థులు బరిలో ఉండే అవకాశాలున్నాయి.

ఇండిపెండెంట్‌, ఇతర పార్టీల నామినేషన్లు

ఇతర రాష్ర్టాల నుంచి గుర్తింపు పొందిన పార్టీల నుంచి  63 మంది, ఇండి పెం డెంట్లుగా 110 మంది మొత్తం 173 మంది అభ్యర్థులు నామినేషన్‌ వేశారు. ఇందులో  గద్వాల నుంచి 37 వార్డులకుగాను 91 నామినేషన్లు, అయిజ నుం చి 20 వార్డులకు గాను 44 నామినేష న్లు, అలంపూర్‌ 10 వార్డులకుగాను  నుంచి 34నామినేషన్లు, వడ్డేపల్లి నుంచి 10వార్డులకుగాను 5నామినేషన్లు దా ఖలయ్యాయి. వీరిలో కొందరు అభ్యర్థులు తాము ఆశించిన పార్టీల నుంచి టికెట్లు రాకపోవడంతో ఇండిపెండెంట్లు గా నామినేషన్‌ వేశారు. వీరిలో కొందరు పార్టీ నాయకుల బుజ్జగింపులతో నామినేషన్లను విత్‌డ్రా చేసుకోనున్నారు.

బీ ఫాంలు అందజేస్తున్న నాయకులు

ఎన్నికల్లో బరిలో నిలిపేందుకు వివిధ పా ర్టీల నాయకులు తమ అభ్యర్థులను ప్రకటించి నామినేషన్‌ వేయించారు. నేడు వి త్‌ డ్రాకు అవకాశం ఉండటం, బీఫాంలు అందజేసేందుకు చివరి రోజు కావడంతో అభ్యర్థులకు బీఫాంలు అందించే పనిలో పార్టీ నాయకులు నిమగ్నమయ్యారు. పార్టీ తరుపున బీఫాంలు అందించిన అ భ్యర్థులకు మాత్రమే పార్టీ గుర్తులు కేటాయించి ఎన్నికల్లో జా బితాలో పొందుపరుచనున్నారు. బీఫాంలు అందించని అ భ్యర్థులను ఇండి పెండెంట్లుగా భావించి వారికి ఎన్నికల కమిషన్‌ ప్రత్యేక గుర్తులను కేటా యించనున్నారు. అయిజ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే అబ్రహం ప్ర కటించిన అభ్యర్థులకు సోమవారం బీ ఫాంలను అందించారు. ఇప్పటికే గద్వా లలో 7,అయిజలో 7, అలంపూర్‌లో 2, వడ్డేపల్లిలో 2 నామినేషన్లు మొత్తం జి ల్లాలో 18 నామినేషన్లు ఉపసంహ రిం చుకున్నట్లు అధికారులు తెలిపారు.


logo
>>>>>>