గురువారం 02 ఏప్రిల్ 2020
Gadwal - Jan 14, 2020 , 01:38:18

ఎన్నికల నిర్వహణ బాధ్యత నోడల్‌ బృందాలదే

ఎన్నికల నిర్వహణ బాధ్యత నోడల్‌ బృందాలదే


వనపర్తి, నమస్తే తెలంగాణ : మున్సిపాలిటీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించే బాధ్యత నోడల్‌ బృందాలపైనే ఉందని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి శ్వేతామొహంతి పేర్కొన్నారు. వనపర్తి కలెక్టర్‌ కార్యాలయంలో మున్సిపల్‌ ఎ న్నికల నిర్వహణపై ఆమె వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల నోడల్‌ అధికారులతో సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా నియమించిన సిబ్బంది అందరూ విధులకు హాజరయ్యేలా చూ డాలన్నారు. రెండు జిల్లాల్లో బ్యాలెట్‌ బాక్సులను సిద్ధంగా ఉంచాలని, అవసరమైన బాక్స్‌లకు ఆయిల్‌ వేయాలన్నా రు. బ్యాలెట్‌ బాక్స్‌లు, సిబ్బందిని పో లింగ్‌ కేంద్రాలకు తీసుకెళ్లేందుకు, రిసెప్ష న్‌ కేంద్రానికి తీసుకువచ్చేందుకు ఆయా మున్సిపాలిటీల వారీగా వాహనాలను ఏర్పాటు చేయాలన్నారు. మున్సిపాలిటిలకు సంబంధించి వాహనాల వినియోగ విషయమై గద్వాల జిల్లాలో ఈ సాయం త్రం నాటికి నివేదిక సమర్పించాలని అ ధికారులను ఆమె ఆదేశించారు. ఎన్నిక ల సిబ్బంది 17వ తేదీన రెండు జిల్లా కేంద్రాలలో పాఠశాల లేదా కళాశాల తరగతి గదుల్లో శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటుచేయాలన్నారు. ఇందుకు అవసరమైన సామగ్రితో పాటు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ చేయాలని వారిని ఆదేశించారు. 17వ తేదీన కలెక్టర్‌ కార్యాలయంలో సూక్ష్మ పరీశీలకులు, వెబ్‌ కాస్టింగ్‌ సిబ్బందికి శిక్షణ ఏర్పాటుచేయాలని, ఎన్నికల ఖర్చులకు సంబందించి ఎక్సెండీచర్‌ కమిటీలు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు ఖర్చులను సంబందిత అభ్యర్థుల ఖాతాలలో జమ చేయాలని సూచించారు. సమావేశంలో వనపర్తి జేసీ వేణుగోపాల్‌, వనపర్తి, గద్వాల జిల్లాల నోడల్‌ అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు పాల్గొన్నారు.


logo
>>>>>>