గురువారం 02 ఏప్రిల్ 2020
Gadwal - Jan 14, 2020 , 01:37:43

బంగారు తెలంగాణకు సహకరించండి

బంగారు తెలంగాణకు సహకరించండి


అలంపూర్‌, నమస్తే తెలంగాణ : బంగారు తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ సహకరిస్తూ ఎన్నికల్లో ముందుకు సాగాలని అలంపూరు ఎమ్మెల్యే అబ్రహం అన్నారు. సోమవారం అలంపూరు ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో బీ ఫాంల పంపిణీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మున్సిపల్‌ ఎన్నికల్లో స్టీరింగ్‌ నిర్ణయం మేరకు అభ్యర్థుల ఎంపిక జరిగిందని, ఆ ప్రకారంగా నామినేషన్‌ వేసిన అభ్యర్థులకు బీ ఫాంలు అందజేయడం జరిగిందన్నారు. నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీల్లో కార్యకర్తలు, నాయకులు కలిసిమెలిసి పనిచేయాలని సూచించారు. విజయం మనదే అయినా మెజార్టీ దిశగా  ప్రతి ఒక్కరూ సైనికుల వలే పనిచేస్తూ పార్టీ బలపర్చిన అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలన్నారు. పార్టీలో ఉంటూ రెబల్స్‌గా ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేస్తే అలాంటి వారు ఉపసంహరణ చేసుకోవాలన్నారు. లేదంటే అటువంటి వారిపై వేటు తప్పదని ఎమ్మెల్యే హెచ్చరించారు. కార్యక్రమంలో స్టీరింగ్‌ కమిటీ సభ్యులు విష్ణువర్దన్‌రెడ్డి, దేవరపోగు జయన్న, శరణప్ప, ఏసు రత్నం, శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.logo