శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Gadwal - Jan 14, 2020 , 01:37:07

భారీ బందోబస్తు నడుమ ఎన్నికలు

భారీ బందోబస్తు నడుమ ఎన్నికలు


గద్వాల అర్బన్‌ : భారీ బందోబస్తు నడుమ మున్సిపల్‌ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని ఇన్‌చార్జి ఎస్పీ అపూర్వరావు జిల్లా పోలీస్‌ యంత్రాంగానికి సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఎన్నికలకు సంబంధించి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా 22వ తేదీన జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తీసుకొవాల్సిన జాగ్రత్తలు, బందోబస్తు గురించి చర్చించారు. ఎన్నికల కౌటింగ్‌ కేంద్రాలను, బ్యాలెట్‌ బాక్స్‌లను భద్రపరిచే స్ట్రాంగ్‌ రూమ్‌లను ఏఎస్పీ కృష్ణ ఆధ్వర్యంలో పరిశీలించారు. పోలీస్‌ బందోబస్తు, బారికేడ్ల నిర్మాణం, పటిష్టమైన భద్రత ఏర్పాట్లు, కౌంటింగ్‌ సెంటర్‌ నందు ఎటువంటి అవాంతరాలు జరగకుండా పటిష్టమైన బందోబస్తుకు పలు సూచనలను చేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ కృష్ణ, డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, శాంతినగర్‌ సీఐ వెంకటేశ్వర్లు, అయిజ ఎస్సై జగదీశ్‌, శాంతినగర్‌ ఎస్సై శ్రీహరి, అలంపూర్‌ ఎస్సై మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.logo