బుధవారం 01 ఏప్రిల్ 2020
Gadwal - Jan 14, 2020 , 01:32:11

అభివృద్ధిలో గ్రామం దూసుకుపోతోంది

అభివృద్ధిలో గ్రామం దూసుకుపోతోంది


కేటీదొడ్డి : నూతనంగా ఏర్పడిన సోంపురం గ్రామం అభివృద్ధిలో అన్ని విధాలుగా దూసుకుపోతోందని సర్పంచ్‌ తిక్కన్న పేర్కొన్నారు. ఆదివారంతో పల్లెప్రగతి కార్యక్రమం ముగిసిన సందర్భంగా సోమవారం సోంపురం గ్రామంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక గ్రామ పంచాయితీ ఏర్పడి ఏడాదైన సందర్భంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. ఇంటింటికీ నల్లాలు ఏర్పాటు చేయడంతోపాటు ఇంకుడుగుంతలు, గ్రామ శివారులో డంపింగ్‌యార్డ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మొదటి, రెండో విడత పల్లెప్రగతిలో జరిగిన అభివృద్ధి పనుల్లో ప్రజల పాత్రే కీలకమైందని తెలిపారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారి భారతి, పంచాయతీ కార్యదర్శి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

కొనసాగుతున్న ఎన్‌ఎస్‌ఎస్‌ శిబిరం

గట్టు : మండలంలోని గొర్లఖాన్‌దొడ్డిలో ఎన్‌ఎస్‌ఎస్‌ శిబిరం సోమవారం కూడ కొనసాగింది. వలంటీర్లు ఓటు హక్కుపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. పచ్చదనం-పరిశుభ్రతలో భాగంగా ఇంకుడుగుంతల నిర్మాణాన్ని ప్రారంభించారు. మోటివేషనల్‌ స్పీకర్‌ ఉరుకుందుశెట్టి పలు అంశాలపై మాట్లాడారు. అంతకుముందు వలంటీర్లు గ్రామంలో సర్వే నిర్వహించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి చంద్రశేఖర్‌, ప్రిన్సిపాల్‌ శశిధర్‌రెడ్డి, లెక్చరర్లు రాజగోపాల్‌, మహేశ్‌, ఆంజనేయులు, మధు, విష్ణు, మహేశ్‌, రాధిక, మోహన్‌ పాల్గొన్నారు.


logo
>>>>>>