సోమవారం 06 ఏప్రిల్ 2020
Gadwal - Jan 13, 2020 , 01:21:35

ప్రచారానికి సన్నద్ధం

ప్రచారానికి సన్నద్ధం
  • - ప్రణాళికలు సిద్ధం చేస్తున్న ఎమ్మెల్యేలు
  • - కార్యకర్తలకు దిశానిర్ధేశం చేస్తున్న నేతలు
  • - ఇప్పటికే గులాబీని వరించిన అలంపూర్‌ ఐదోవార్డు
  • - ఏకగ్రీవమైన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎరుకలి దేవన్న


జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మున్సిపల్‌ ఎన్నికల్లో నాలుగు మున్సిపాలిటీల్లో గులాబీ జెండాను ఎగురవేసేందుకు ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, డాక్టర్‌ వీఎం అబ్రహంలు సిద్ధమవుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం టీఆర్‌ఎస్‌ పార్టీని గడపగడపకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధే ప్రచార మంత్రంగా ముందుకు సాగనున్నారు. గద్వాలలో మహిళా ఆశీర్వాద సభను ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే కృష్ణమోహన్‌ రెడ్డి ఆలోచనల్లో ఉండగా, అలంపూర్‌ నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యనాయకులతో ప్రచారం చేపట్టేందుకు ఎమ్మెల్యే అబ్రహం ఏర్పాట్లను చేస్తున్నారు. అయితే ఇప్పటికే అలంపూర్‌ ఐదో వార్డు టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది.  ఐదో వార్డులో ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు వేయగా, ఒక అభ్యర్థి ఆదివారం తన నామినేషన్‌ ఉపసంహరించుకోగా ఐదో వార్డు నుంచి ఎరుకలి దేవన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు..

ఈ నెల 14న నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ప్రతి క్షణాన్ని కూడా విలు వైనదిగా భావించి టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రచారానికి  సిద్ధమవుతుంది. 22న పోలింగ్‌ నిర్వహిస్తుండటంతో 20వరకు ముమ్మరంగా ప్రచారాన్ని నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి కార్యకర్తలకు ఇద్దరు ఎమ్మెల్యేలు దిశానిర్దేశాలు చేస్తున్నారు. ప్రతిపక్షాలు తేరుకొక ముందే ప్రతి ఇంటింటికీ వెళ్లి ప్రతి ఓటరును కలవాలాని కార్యకర్తలు సూచిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ చేపట్టిన అభివృద్ధి పథకాలను ప్రజలందరికీ తెలియజేసేలా భారీగా బహిరంగ సభలను ఏర్పాటు చేసేందుకు ఆలోచనలు చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్రంలో తీసువచ్చిన మార్పులను, అమలు చేసిన సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో తెలియజేయనున్నారు.

మహిళా ఆశీర్వాద సభకు ఆలోచనలు

గద్వాలలో నియోజకవర్గంలో గత ఏడాదిగా జరిగిన ఎ న్నికల్లో మహిళా ఆశీర్వాద స భలు ఎంతో విజయవంతమయ్యాయి. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి ప్రతి మండల కేంద్రంలో మహిళా ఆశీర్వాద సభలను ఏర్పాటు చేసి ఆడబిడ్డల మన్ననలను పొందారు. ఈసభల ద్వారా టీఆర్‌ఎస్‌ పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాల ను, రాష్ట్రంలో చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులను, మహిళల కోసం ప్రత్యేకం గా చేపట్టిన పథకాలను ప్రజలకు వివరించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా మహిళా ఆశీర్వాధ సభను ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌ రెడ్డి ఆలోచనలు చేస్తున్నారు. గద్వాల మున్సిపా లిటీలోని 37 వార్డుల్లో గల మహిళలందరికీ ప్రత్యేక ఆహ్వానాలు అందించి  ఎంతో ఘనంగా సభను నిర్వహించుందుకు కార్యకర్తలతో చర్చలు కొనసాగిస్తున్నారు. ఈ సభ ద్వారా గద్వాల మున్సిపాలిటీలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను కూడా వివరించనున్నారు.

రాష్ట్ర నాయకుల పర్యటనలు

అలంపూర్‌ నియోజకవర్గంలో అలంపూర్‌, అయిజ, వడ్డేపల్లి మూడు మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహిస్తుండటంతో రాష్ట్ర నాయకత్వం ఈ నియోజ కవర్గంపై దృష్టి సారించింది. మూడు మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ జెండాను ఎగురవేసేందుకు ఎమ్మెల్యే డాక్టర్‌ వీఎం అబ్రహం పక్కా ప్రణాళికలతో ముందు కు వెళ్తున్నారు. గెలుపే ధ్యేయంగా పార్టీ నాయకులతో చర్చించి మున్సిపాలిటీ సీట్లను కేటాయించారు. ఈ నియోజకవర్గంలో ప్రచారం చేసేందుకు రాష్ట్ర ముఖ్య నాయకులు హాజరయ్యే అవకాశాలున్నట్టు కార్యకర్తలు చర్చిస్తున్నారు. ప్రముఖుల ప్రచార కార్యక్రమ తేదీని నిర్ణయించి భారీగా ఏర్పాట్లు చేసేందుకు ఎమ్మెల్యే అబ్రహం సన్నాహకాలు చేపడుతున్నారు.

కార్యకర్తలకు దిశానిర్దేశం

ప్రతి వార్డులోని కార్యకర్తలకు ప్రచారంపై  ఎమ్మెల్యేలు దిశా నిర్ధేశం చేస్తున్నారు. బరిలో నిలిచిన అభ్యర్థులకు చేదోడువాదోడుగా ఉంటూ భారీ మెజారిటీని సా ధించేందుకు కృషి చేయాలని సూచిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అమలు చేసిన సంక్షే పథకాలను ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు గుర్తు చేయాలని సూచిస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ప్రచారం నిర్వహించే 6రోజులు ఎంతో కీలకమైనవిగా భావించి క్షేత్ర స్థాయిలో ఓటర్లను ప్రసనం చేసుకోవాలని పార్టీ నుంచి ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే ఆదేశానుసారు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఇప్పటికే ఇంటింటికీ తిరిగి ప్రచారం చేపడుతున్నారు. ఓటర్లను కలిసి వార్డుల్లోని సమస్యలను పరిష్క రిస్తామని హామీ ఇస్తున్నారు.logo