శనివారం 04 ఏప్రిల్ 2020
Gadwal - Jan 13, 2020 , 01:19:08

వివేకానందుడి ఆశయాలు స్ఫూర్తిదాయకం

వివేకానందుడి ఆశయాలు స్ఫూర్తిదాయకం


పెబ్బేరు రూరల్‌ (శ్రీరంగాపురం) : యువతకు మార్గదర్శి, జ్ఞానసంపన్నుడైన స్వామి వివేకానంద ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శ్రీరంగాపురం మండలం శేరుపల్లి గ్రా మంలో వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివేకానందుడి విగ్రహాన్ని ఆదివారం మంత్రి నిరంజన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశానికి వివేకానందుడు చేసిన సేవలను కొనియాడారు. భారతదేశ కీర్తి ప్రతిష్టలను ఖండాంతరాలు వ్యాపింపజేసిన ఘనత వివేకానందుడిదేనన్నారు. స్వామి వివేకానంద ఆశయాలను నెరవేర్చేందుకు యువత ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌రెడ్డి, హైదరాబాద్‌కు చెందిన చిన్న శ్రీశైలం యాదవ్‌, ఎంపీపీ గాయత్రి, జెడ్పీటీసీ రాజేంద్రప్రసాద్‌, సర్పంచ్‌ సునీత, సింగిల్‌ విండో అధ్యక్షుడు ఆనందరాజు,  నాయకులు కురుమూర్తి, నాగరాజు, రామచంద్రయ్య, వెంకటయ్య, యూత్‌ సభ్యులు మహేశ్‌, అంజి, పృథ్వీరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం విగ్రహదాత శ్రీశైలం యాదవ్‌ను సంఘం సభ్యులు సన్మానించారు.

వివేకాందుడి విగ్రహం వద్ద నివాళులు

వనపర్తి వైద్యం : వివేకానందుడి మాటలు తరతరాలకు వన్నె తరగని స్ఫూర్తి మంత్రాలు అని మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. ఆదివారం వివేకానందుడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.   మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ భారతదేశ ఔన్నత్యాన్ని, దేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వివేకానందుడి ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని తెలియజేశారు. కార్యక్రమంలో డాక్టర్‌ చల్మారెడ్డి, రవీందర్‌రెడ్డి, గట్టుయాదవ్‌, వాకిటి శ్రీధర్‌, ప్రభాకర్‌ రెడ్డి, కోటేశ్వర్‌ రెడ్డి, భరత్‌ చంద్ర, వెంకటేశ్వర్‌ రెడ్డి, జీజే శ్రీనివాసులు, కుమారస్వామి, సుమిత్రమ్మ, ఉపాధ్యాయ సంఘం నాయకులు రవీందర్‌ గౌడ్‌, నరేందర్‌ రెడ్డి, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.


logo