మంగళవారం 31 మార్చి 2020
Gadwal - Jan 13, 2020 , 01:16:10

నివేదిక ఇవ్వండి

నివేదిక ఇవ్వండి


గద్వాల,నమస్తేతెలంగాణ:  గద్వాల పురపాలక ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్‌ బాక్స్‌లు, స్యాచుటరి, నాన్‌స్యాచుటరి డిస్ట్రిబ్యూషన్‌తో పాటుగా రిసివింగ్‌, కౌంటింగ్‌ సెంటర్‌ను జిల్లా కేంద్రంలోని ఎంఏఎల్‌డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి గోన్‌పాడ్‌ వద్ద ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలకు మార్చేందుకు గల అవకాశాలపై నివేదిక ఇవ్వాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ శ్వేతామొహంతి పురపాలక కమిషనర్‌ నర్సింహను ఆదేశించారు. ఆదివారం ఇంతకు ముందు నిర్ణయించిన కౌంటింగ్‌, డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ అయిన ప్రభుత్వ డిగ్రీకళాశాలను ఆమె పరిశీలించారు. అక్కడే ఇప్పటికే గుర్తించిన బ్యాలెట్‌ బాక్సుల భద్రత గది, కౌంటింగ్‌ హాళ్లను ఇన్‌చార్జి కలెక్టర్‌ పరిశీలించారు. ఈ ప్రాంతం ఏ మాత్రం అనువుగా లేనందున డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, తాసిల్దార్‌ మంజులతో కలిసి పాలిటెక్నిక్‌ కళాశాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇన్‌చార్జి కలెక్టర్‌ వెంట తాసిల్దార్‌ మంజుల, టౌన్‌ప్లానింగ్‌ అధికారి శ్రీనివాసచారి తదితరులు ఉన్నారు.


logo
>>>>>>