శనివారం 04 ఏప్రిల్ 2020
Gadwal - Jan 12, 2020 , 05:31:13

570 నామినేషన్లు ఆమోదం

570 నామినేషన్లు ఆమోదం
  • ఒక నామినేషన్‌ తిరస్కరణ
  • అయిజ 15వ వార్డులో నామినేషన్‌గా ప్రకటన
  • నేడు సాయంత్రం 5వరకు అప్పీలుకు అవకాశం
  • ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఎన్నికల అధికారులు ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికల కార్యచరణ సజా వుగా కొనసాగుతుంది. శుక్రవారం నామినేషన్ల ప్రక్రియను ముగించిన అధికారులు శనివా రం అన్ని మున్సిపాలిటీల్లో నామినేషన్ల పరిశీలన ప్రక్రియను చేపట్టారు. నిబంధనల ప్రకారం ఎన్నికల అధికారులు ప్రకటించిన అన్ని వివరాలను నామినేషన్‌ పత్రంలో నమోదు చేశారా లేదా అనే అంశాలను ఎన్నికల అధికారులు పరిశీలించారు. జీవో ప్రకారం ఉన్న నిబంధనలను పరిశీలించి సరైన ధ్రువపత్రాలు, వివరాలు అందించని అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించి అన్ని ప్రతాలు, వివరాలు ఉన్న నామినేషన్లను అధికారులు ఆమోదించారు. తిర స్కరణకు గురైన అభ్యర్థులకు అప్పీలుకు కూడా అవకాశం కల్పించారు.

ఒక్క నామినేషన్‌ తిరస్కరణ

జిల్లాలోని 4మున్సిపాలిటీల్లో 3 రోజులపాటు స్వీకరించిన నామినేషన్ల ప్రక్రి య లో మొత్తం 571 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో గద్వాలలో 37 వార్డులకుగాను  296 నామినేషన్లు, అయిజ లో 20వార్డులకుగాను  139 నామినేషన్లు, అలంపూర్‌ 10 వార్డులకు గాను 81 నామినేషన్లు, వడ్డేపల్లిలో 10 వార్డులకు 55 నామినేషన్లుదాఖలయ్యాయి. వీటిన్నింటిని పరిశీలన చేపట్టిన అధికారులు అయిజలో ఒక నామినేషన్‌ను మాత్రమే తిరస్కరించి మిగిలిన 570 నామినేషన్లును ఆమోదించారు.

అప్పీలుకు అవకాశం

అయిజ మున్సిపాలిటీలోని 139 నామినేషన్లలో ఒక నామినేషన్‌ను తిరస్కరించి 138 నామినేషన్లను ఎన్నికల అధికారులు ఆమోదించారు. 15వ వార్డుకు నామినేషన్‌ వేసిన అభ్యర్థి ఒక్క నామినేషన్‌లో ఎన్నికల అధికారులు సూచించిన అన్ని ధ్రువ పత్రాలను, వివరాలను అందించని కారణంగానే ఈ నామినేషన్‌ను తిరస్కరించినట్లు ప్రకటించారు. నామినేషన్‌ తిరస్కరించిన అభ్యర్థికి ఎ న్నికల అధికారులు అప్పీలుకు అవకాశం కల్పించారు. నేడు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు తి రస్కరణ నామినేషన్‌పై ఆర్డీవోకు అప్పీ లు చేసుకునేందుకు వెసులుబాటు క ల్పించారు. ఈ ప్రక్రియ ముగియడంతో తదుపరి విత్‌డ్రా ప్రక్రియ ఈ నెల 14న చేపట్టనున్నారు. 


logo