గురువారం 02 ఏప్రిల్ 2020
Gadwal - Jan 12, 2020 , 02:16:18

నామినేషన్‌ తిరస్కరణకు గురైతే 12న అప్పీల్‌ చేసుకోండి

నామినేషన్‌ తిరస్కరణకు గురైతే 12న అప్పీల్‌ చేసుకోండి


గద్వాల,నమస్తేతెలంగాణ:  పురపాలక సంఘం ఎన్నికల్లో నామినేషన్లు వేసిన అభ్యర్థులకు సంబంధించి స్కుృటిని సందర్భంగా  నామినేషన్‌ తిరస్కరణకు గురి అయినైట్లెతే అటువంటి అభ్యర్థులు జనవరి 12 తేదీ ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఆర్డీవో రాములు వద్ద అప్పీలు చేసుకోవాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ శ్వేతామొహంతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని నాలుగు పురపాలక సంఘాలకు వచ్చిన నామినేషన్లపై వచ్చే అప్పీళ్లను పరిష్కరించేందుకు గద్వాల ఆర్డీవోకు పూర్తి అధికారాలు ఇస్తూ  ఉత్తర్వులు జారిచేసినట్లు ఆమె చెప్పారు. దీనికి అనుగుణంగా అభ్యర్థులు తమ అప్పీళ్లు 12వ తేది సాయంత్రం వరకు చేసుకోవచ్చన్నారు. ఆ తర్వాత ఎలాంటి అప్పీళ్లకు అవకాశం ఉండదని చెప్పారు.


logo
>>>>>>