గురువారం 02 ఏప్రిల్ 2020
Gadwal - Jan 12, 2020 , 02:15:25

ఒక నామినేషన్‌ తిరస్కరణ

ఒక నామినేషన్‌ తిరస్కరణ


గద్వాల,నమస్తేతెలంగాణ: జిల్లాలో నాలుగు పురపాలకులకు సంబంధించి మొత్తం 571 నామినేషన్లు అభ్యర్థులు దాఖలు చేయగా శనివారం జరిగిన పరిశీలనలో కేవలం ఒక నామినేషన్‌ తిరస్కరణకు గురి అయినట్లు జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ శ్వేతామొహంతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అయిజ పురపాలక సంఘంలోని 15వ వార్డుకు సంబంధించి ఒక నామినేషన్‌ మాత్రమే వివిధ కారణాల వల్ల తిరస్కరణకు గురి అయిందని చెప్పారు.తిరస్కారానికి గురైనా అభ్యర్థి తన నామినేషన్‌పై ఆర్డీవో వద్ద అప్పీలు చేసుకోవడానికి జనవరి ఉదయం 10గంటల నుండి 5గంటల వరకు అవకాశం ఉందని వెల్లడించారు. మిగిలిన పురపాలక సంఘాల్లో గద్వాల 190మంది అభ్యర్థులు 296 నామినేషన్లు వేయగా  స్కృటినిలో ఎలాంటి లోపాలు లేకుండా ఆమోదించబడ్డాయని చెప్పారు. అలంపూర్‌ నుండి 81నామినేషన్లు, వడ్డేపల్లి నుంచి 55 నామినేషన్లు సరిగా ఉన్నాయని ఆమె వెల్లడించారు.logo
>>>>>>