బుధవారం 01 ఏప్రిల్ 2020
Gadwal - Jan 12, 2020 , 02:14:58

కల్యాణం కమనీయం

 కల్యాణం కమనీయం

 కల్యాణం కమనీయం

గద్వాలటౌన్‌ : వేదమంత్రోచ్ఛరణలు..బాజభజంత్రీలు.. మధ్యగా సీతారాముల కల్యాణం అత్యంత కమనీయంగా సాగింది. జిల్లా కేంద్రం గద్వాలలో గల కోట లోని రామాలయంలో శనివారం పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని సీతా రాముల కల్యాణోత్సవాన్ని మంత్రాలయ పీఠాధిపతి ఆదేశానుసారం అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి  ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. కల్యాణరాముడిని దర్శించుకునేందుకు అనేక మంది భక్తులు తరలివచ్చారు. శ్రీ రాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రాన స్వామి కల్యాణం నిర్వహించడం ఎంతో శుభప్రదమని అర్చకులు శ్రీనివాసచారి చెప్పారు. ఈ రోజు స్వామిని దర్శించుకున్న వారికి అన్ని శుభాలే కలుగుతాయని ఆయన తెలిపారు.


logo
>>>>>>