మంగళవారం 31 మార్చి 2020
Gadwal - Jan 12, 2020 , 02:14:02

జూరాలకు స్వల్ప వరద

జూరాలకు స్వల్ప వరదజోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జూరాలకు స్వల్పం గా వరద కొనసాగుతుంది. శనివారం సాయంత్రం నాటికి ఇన్‌ ఫ్లో 900,  అవు ట్‌ ఫో ్ల 1,802క్యూసెక్కులు నమోదైం ది. జూరాల ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమ ట్టం 1045అడుగుల  ఎత్తులో 9.657టీఎంసీలుండగా ప్రస్తుతం 1040 అడుగుల ఎత్తులో 7.971టీఎంసీల నీటిని నిల్వ చేస్తున్నారు. కుడికాలువ ద్వారా 437క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వా రా 500 క్యూసెక్కులు, సమాంతర కా లువ ద్వారా 100 క్యూసెక్కులు నీటిని అధికారులు కాలువల్లోకి విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి ప్రాజెక్ట్‌కు వరద ప్రవా హం పూర్తిగా నిలిచిపోగా నారాయణపుర ప్రాజెక్ట్‌కు  వరద కొనసాగుతుంది. ఆల్మట్టి ప్రాజెక్ట్‌ నుంచి అవుట్‌ ఫ్లో 865 క్యూసెక్కులు నమోదు కాగా ప్రాజెక్ట్‌కు  పూర్తి సామర్థ్యం 129.72 టీఎంసీలు ఉండగా 99.53 టీఎంసీల నీరు నిల్వ ఉంది.  నారాణయణఫుర ప్రాజెక్ట్‌ కు ఇన్‌ఫ్లో 351 క్యూసెక్కులు,  అవుట్‌ఫ్లో 193 క్యూసెక్కులు  నమోదైంది. ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 37.64 టీఎంసీల సామర్థ్యం ఉండగా  33.99 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

తుంగభద్ర డ్యాం నుంచి నీటి విడుదల

అయిజ : కర్ణాటకలోని టీబీ డ్యాం నుం చి ఆర్డీఎస్‌, కేసీ కెనాల్‌ నీటి వాటా విడుదల చేస్తున్నారు. ఈ నెల 10వ తేదీ నుం చి 24వ తేదీ వరకు ఇరు రాష్ర్టాల ఇం డెంట్‌లో 4.28 టీఎంసీల నీటిని టీబీ డ్యాం నుంచి విడుదల చేయనున్నారు. తుంగభద్ర నదిలో నీటి ప్రవాహం తగ్గిపోవడంతో తెలంగాణ, ఏపీ రాష్ర్టాల ఆయకట్టుకు సాగునీటితోపాటు తాగునీటికి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని టీబీ డ్యాం నుంచి నీరు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం విడుదల చేస్తున్న నీరు ఆర్డీఎస్‌ ఆనకట్టకు ఈ నెల 15వ తేదీ నాటికి చేరుకునే అవకాశం ఉందని ఆర్డీఎస్‌ డీఈఈ శ్రీనివాస్‌ తెలిపారు. ఇం డెంట్‌ నీరు ఆనకట్టకు చేరుకోగానే ఆయకట్టుకు సాగునీరు పుష్కలంగా అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం ఆనకట్టలో నీటి లభ్యత తగ్గిందన్నారు. దీంతో ఆయకట్టుకు నీరు స్వల్పంగా వస్తోందన్నారు.

 టీబీ డ్యాంలో ..

కర్ణాటకలోని టీబీ డ్యాం ద్వారా ఏపీ, కర్ణాటక, తెలంగాణ రాష్ర్టాలకు నీటి విడు దల కొనసాగుతోంది. శనివారం తుంగభద్ర జలాశయానికి  ఇన్‌ఫ్లో నిల్‌ ఉం డగా, అవుట్‌ ఫ్లో 11,965 క్యూసెక్కులు నమోదైంది. టీబీ డ్యాం ద్వారా కర్ణాటక పరిధిలోని కాల్వలతోపాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రంలోని ఆయకట్టుకు సాగునీరు అందించే హెచ్‌ఎల్‌సీ, ఎల్‌ఎల్‌సీ కాల్వలు, నది దిగువకు 11,965 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నట్లు టీబీ బోర్డు సెక్షన్‌ అధికారి విశ్వనాథ తెలిపారు. టీబీ డ్యాంలో ప్రస్తుతం 67.479 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, 1623. 24 అడుగుల నీటి మట్టం ఉన్నట్లు ఆ యన తెలిపారు.


logo
>>>>>>