సోమవారం 06 ఏప్రిల్ 2020
Gadwal - Jan 12, 2020 , 02:11:41

కనీస సౌకర్యాల కోసమే పల్లెప్రగతి

కనీస సౌకర్యాల కోసమే పల్లెప్రగతికేటీదొడ్డి : ప్రతి గ్రామంలో కనీస సౌకర్యాల కల్పన కోసమే పల్లెప్రగతి నిర్వహించడం జరుగుతుందని జాయింట్‌ కలెక్టర్‌ నిరంజన్‌ పేర్కొన్నారు. మండలంలోని మైలగడ్డ గ్రామంలో జరుగుతున్న రెండో విడత పల్లెప్రగతి పనులను ఆయన శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెప్రగతి కార్యక్రమం గ్రామాల్లో చక్కగా జరుగుతుందని, ప్రతి గ్రామానికి డంపింగ్‌యార్డ్‌, శ్మశానవాటిక, ఇంటింటికీ ఇంకుడుగుంతలు, మరుగుదొడ్డి ఉండాలన్నారు. ప్రజల్లో చైతన్యం వస్తే ఇక గ్రామాల అభివృద్ధిని ఎవరూ ఆపలేరన్నారు. మొదటి విడతలో మండలంలో చాలా పనులు జరిగాయని, ఇప్పుడు కూడా అభివృద్ధిలో జిల్లాలోనే మండలం మొదటి స్థానంలో రావాలన్నారు. డంపింగ్‌యార్డ్‌, శ్మశానవాటికలను పరిశీలించిన ఆయన పనులు తొందరగా పూర్తిచేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో జయరామ్‌నాయక్‌, వ్యవసాయ అధికారి కరుణశ్రీ, ఎంపీవో సయ్యద్‌ఖాన్‌, ఆర్‌ఐ నాగేశ్‌, పంచాయతీ కార్యదర్శి శివ తదితరులు పాల్గొన్నారు.

బూరెడ్డిపల్లిలో పర్యటించిన జేసీ

ధరూరు: మండల పరిధిలోని బూరెడ్డిపల్లి జీపీలో పల్లెప్రగతి పనులను జేసీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన నర్సరీ, డంపింగ్‌యార్డ్‌, శ్మశాన వాటిక స్థలాన్ని పరీశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో అబ్దుల్‌ జబ్బార్‌, పంచాయతీ సెక్రటరి రాధాకృష్ణరెడ్డి, స్పెషల్‌ ఆఫీసర్‌ రవీంద్రనాయుడు, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ రాజు ఉన్నారు


logo