బాలీవుడ్ భామ జాన్వీకపూర్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. వీటిలో ఒక ప్రాజెక్టు రూహి అఫ్జానా. హార్దిక్ మెహతా దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో రాజ్‌కుమార్ రావు హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రం 2020 లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ కరోనా మహమ్మారితో లాక్డౌన్ కారణంగా సాధ్యం కాలేదు. ఇపుడు థియేటర్లు ప్రారంభమై.. సాధారణ పరిస్థితులు ఏర్పడటంతో మేకర్స్ సినిమాను ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
జాన్వీకపూర్ సినిమాను మార్చిలో రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయినట్టు బీటౌన్ వర్గాల సమాచారం. హార్రర్ కామెడీ కథాంశంతో తెరకెక్కుతున్న రూహి అఫ్జానా చిత్రంలో వరుణ్ శర్మ కీలక పాత్రలో నటించాడు. జాన్వీకపూర్ నటిస్తోన్న దోస్తానా-2, గుడ్ లక్ జెర్నీ సినిమాలు ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.