e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 16, 2021
Home జిల్లాలు ఇక రో(జా)జూ నమాజ్‌

ఇక రో(జా)జూ నమాజ్‌

ఇక రో(జా)జూ నమాజ్‌

నేటి నుంచి రంజాన్‌ మాసం షురూ..
నెల రోజులు సమత మమతల కలయిక
ఉపవాస దీక్షలకు సిద్ధమైన ముస్లింలు
మసీదుల వద్ద ఏర్పాట్లు పూర్తి

మహబూబ్‌నగర్‌ టౌన్‌/వనపర్తి టౌన్‌, ఏప్రిల్‌ 13:పవిత్ర రంజాన్‌ అత్యంత శుభప్రదమైన మాసం.. మా నవుల మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి, జీవన సాఫల్యానికి కావాల్సిన అనేక విషయాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. మహ్మదీయుల పవిత్ర గ్రంథం ఖురాన్‌ ఆవిర్భవించిన పుణ్యమాసం.. ‘రంజాన్‌’ లేదా ‘రమజాన్‌’ అని పిలిచే ఈ మాసంలో మహ్మదీయులు ఉపవాస దీక్షను ఆచరిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ముస్ల్లింలు నియమ, నిష్టలతో గడిపే ఈ మాసం ఇస్లాం క్యాలెండర్‌లో తొమ్మిదో నెల పేరు. ఈ మాసంలో పేద వాడికి ఒక పూట భోజనం పెడితే అల్లాహ్‌ వెయ్యిపూటలు ఆహారం ప్రసాదిస్తాడని విశ్వాసం.

ముస్లింలు పరమ పవిత్రంగా భావించే రంజా న్‌ మాసం రానే వచ్చింది. మంగళవారం సాయం త్రం నెలవంక దర్శనమివ్వడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొన్నది. బు ధవారం ఉదయం ఉపవాస దీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇస్లాం మతంలో రంజాన్‌ నెలకు విశే ష ప్రాధాన్యత ఉంటుంది. సమత, మమతల కలయికగా.. దానధర్మాలకు ప్రతీకగా.. రంజాన్‌ మా సం నిలుస్తోంది. నెల రోజుల పాటు మహోన్నతమైన జీవన విధానాన్ని నేర్పిస్తున్నది. ఇస్లాం మతానికి మూలధారమైన ఖురాన్‌ ఈ నెలలోనే ఆవిర్భవించింది. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలతో శరీ రం, ఆత్మలోని మలినాలు ప్రక్షాళన కావడంతోపాటు సర్వపాపాలు దహించుకుపోతాయని ముస్లిం మతపెద్దలు చెబుతారు. మహమ్మద్‌ ప్రవ క్త బోధించిన నియమాల ప్రకారం నెల రోజులు సూర్యోదయ సమయంలో ‘సహర్‌’ నుంచి సూర్యాస్తమయం సమయంలో జరిపే ‘ఇఫ్తార్‌’ వరకు మంచి నీళ్లు సైతం తాగకుండా ఉపవాసం ఉంటారు. అల్లా ఆరాధనలో గడిపే మాసం. పవి త్ర ఖురాన్‌లో పేర్కొన్న ప్రకారం రంజాన్‌ నెలలో విధిగా ఆచరించవలసిన నియమం ఉపవాస వ్రతం. దీనినే పార్సీ భాషలో రోజా, అరబ్బీలో సౌమ్‌ అంటారు. పవిత్ర ఖురాన్‌ సంపూర్ణంగా అవతరించిన దినం కూడా రంజాన్‌ మాసంలోనే ఉండడం విశేషం. జిల్లా వ్యాప్తంగా మసీదులను విద్యుద్దీపాలతో అలకరించారు. పట్టణ కేంద్రాల్లో హలీం, హరీస్‌ దుకాణాలు వెలిశాయి.

సమయపాలన ముఖ్యమే..
ధర్మనిష్టతో ఉపవాసాలు ఉండాలి. నిర్ణీత సమయాల్లోనే సహర్‌, ఇఫ్తార్‌ పాటించాలి. అందరూ ఒకేసారి కచ్చితమైన వేళలు పాటించేందుకు వీలు గా సైరన్‌ మోగిస్తారు. ఉపవాసంలో శరీరానికే కా కుండా దృష్టితో చూడాలి. మంచినే పాటించాలి. చెడుకు దూరంగా ఉండాలి. ఐదు పూటలు విధిగా నమాజ్‌ చేయాలి. ఖురాన్‌ పఠనం, సారాంశంపై అవగాహన, అల్లాహ్‌ నామస్మరణ, అల్లాహ్‌ చిం తన ఆచరించాలి. రంజాన్‌లో చేసే ఏ పవిత్ర కా ర్యాలకైనా 70 రెట్ల పుణ్యం అధికంగా లభిస్తుంది. అందువల్ల ఈ మాసంలో దానధర్మాలు చేస్తారు. మాసం చివరిలో ప్రతి ముస్లిం ఫిత్రా దానం చెల్లించుకోవాలి. ఆర్థిక స్థోమత కలిగిన వారు జకాత్‌ దానం చేయాలి.

నియమాలు..
మత గ్రంథాల ప్రకారం వయోజనులైన స్త్రీ, పు రుషులు విధిగా రోజా (దీక్ష) పాటించాలి. వృద్ధు లు, పిల్లలు, వ్యాధిగ్రస్తులు, ప్రయాణంలో ఉన్నవారికి మాత్రం మినహాయింపు ఉంటుంది. సాధ్యమైనంత వరకు పుణ్యకార్యాలు చేయాలి. సహర్‌ నుంచి ఇఫ్తార్‌ వరకు మంచినీటిని సైతం తాగకుం డా ఉపవాసం ఉండాలి. రంజాన్‌ మాసంలో 27 వ రోజు షబ్‌-ఏ-ఖదర్‌ రాత్రి నిర్వహిస్తారు. ఈ రాత్రుల్లో జాగారం ఉండి, ప్రార్థన జరిపితే వెయ్యి నెలలపాటు నమాజ్‌ చేసినట్లు ముస్లింలు భావిస్తారు.

Advertisement
ఇక రో(జా)జూ నమాజ్‌
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement