e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 23, 2021
Home జోగులాంబ(గద్వాల్) యలమంద ధరహాసం

యలమంద ధరహాసం

  • యూనిట్‌కు రూ.50 వేలు పెంపు
  • రెండో విడుత గొర్రెల పంపిణీకి ఏర్పాట్లు
  • లబ్ధిదారుడి ప్రీమియం రూ.43,750
  • ప్రభుత్వం సబ్సిడీ రూ.1,31,250
  • జంబ్లింగ్‌ పద్ధతిలో కొనుగోళ్లు

నాగర్‌కర్నూల్‌, జూలై 27 (నమస్తే తెలంగాణ) : చేతి, కులవృత్తులపై ఆధారపడిన వర్గాలకు ప్రభు త్వ సంక్షేమ పథకాలు చేదోడువాదోడుగా నిలుస్తున్నాయి. గొల్ల కురుమలకూ ప్రభుత్వం చేయూతనందిస్తున్నది. ఈ వర్గాల ప్రజలకు గొర్రెల పంపిణీ పథకాన్ని అమలు చేస్తున్న ది. ఇప్పటికే తొలి విడుతలో వేలాది మంది గొల్లకురుమలకు లక్షలాది గొర్రెలను పం పిణీ చేశారు. దీంతో ఆ వృ త్తిదారుల్లో ఆ ర్థిక స్థిరత్వం వచ్చింది. ఈ క్రమంలో రెం డో విడుత పంపిణీకి ప్రభుత్వం పచ్చజెండా ఊ పింది. త్వరలో పంపిణీ చేసేలా ప శుసంవర్ధక శాఖకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే యూనిట్‌కు అదనంగా రూ.50 వేలను పెంచుతూ ఉత్తర్వులు వెలువరించింది. ఈ నిర్ణయం పెంపకందారుల్లో ఆనందాన్ని నింపుతున్నది. దీన్ని హర్షిస్తూ ఇప్పటికే గొల్లకురుమలు సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేస్తూ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇంతకు ముందు గొర్రెల యూనిట్‌కు ఒక్కింటికి రూ.1.25 లక్షలు కేటాయించింది. అది ఇప్పుడు రూ.1.75 లక్షలకు చేరుకున్నది. ఇందులో భాగం గా తొలివిడుతలో లబ్ధిదారుడు 25 శాతంగా రూ. 31,250 చెల్లిస్తే ప్రభుత్వం రూ.93,750 (75 శా తం) చెల్లించింది. దీంట్లోనే రవాణా ఖర్చులు, దా ణ, భీమా సౌకర్యం కల్పించారు. అయితే ఈసారి ప్రభుత్వం యూనిట్‌కు రూ.50వేలను పెంచింది. దీని ఆధారంగా లబ్ధిదారుడు తన వాటా కింద రూ. 43,750 డీడీ కట్టా ల్సి ఉం టుంది. ఇ ది తొలి వి డుతకు రూ.12,250 అదనం. ఇలా రెండో విడుతగొర్రెల పంపిణీలో రూ.1,31,250 సబ్సిడీని
ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఈసారి గొర్రెల పంపిణీ పథకాన్ని పారదర్శకంగా అమలు చేయనున్న
ది. ఇంతకు ముందు రీ సైక్లింగ్‌ జరిగినట్లుగా ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈసారి జంబ్లింగ్‌
పద్ధతిలో గొర్రెలను కొనుగోలు చేయనున్నారు.

జీవాలను ఎక్కడి నుంచి కొనుగోలు చేసే విషయం లబ్ధిదారులకు తెలియకుండా చర్యలు తీసుకోను
న్నారు. దీంతో గొర్రెల పంపిణీలో అవకతవకలకు చోటుండదని అధికారులు చెబుతున్నారు.
నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 340 సొసైటీల్లో 38,500 మంది సభ్యులు ఉన్నారు. ఇందులోతొలి విడుతలో రూ.200 కోట్లతో 19,253యూనిట్లను మంజూరు చేశారు. కాగా 126యూనిట్లకు డీడీలు ఇవ్వకపోవడంతో మొదటి విడుత పూర్తయినట్లు అధికారులు ప్రకటించారు.

- Advertisement -

ఈ సారి 19 వేల యూనిట్లనుపంపిణీ చేయాలని

ప్రభుత్వ ఆదేశాలువచ్చిన వెంటనే జిల్లాలోరెండో విడుత గొర్రెలపంపిణీ చేపడుతాం. తొలివిడుతలో జిల్లాలో 19,127యూనిట్ల చొప్పున 4 లక్షలకుపైగా గొర్రెలను రూ.200కోట్లతో పంపిణీ చేశాం.ఈసారి 19 వేల యూనిట్లను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. పారదర్శకంగా గొర్రెల పంపిణీ చేపడుతాం.

  • రమేశ్‌బాబు, పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి, నాగర్‌కర్నూల్‌
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana