e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 31, 2021
Home జోగులాంబ(గద్వాల్) పేద దళితులకు అండగా నిలిచిన కేసీఆర్‌

పేద దళితులకు అండగా నిలిచిన కేసీఆర్‌

పేద దళితులకు అండగా నిలిచిన కేసీఆర్‌
  • అణగారిన వర్గాలకు చేయూత
  • దేశానికే ఆదర్శంగా మరో పథకానికి శ్రీకారం
  • పాలమూరు వ్యాప్తంగా హర్షాతిరేకాలు

మహబూబ్‌నగర్‌, జూలై 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దేశానికే ఆదర్శంగా నిలిచేలా ఎన్నో పథకాలను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం.. దళితులకు అండగా ఉండేందుకు మరో అద్భుతమైన పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రాజెక్టు రిపోర్టులు, అనుమతులు, బ్యాంకులు, రుణాలు, లంచాలు, కమీషన్ల వంటివేమీ లేకుండా దళిత కుటుంబాలు తమ కాళ్లపై తాము నిలబడేందుకు నేరుగా ఆర్థికసాయం అందనున్నది. లక్షలాది అన్నదాతల కడగండ్లు తీర్చిన రైతుబంధు తరహాలోనే, లక్షలాది దళిత సోదరుల కష్టాలను తీర్చేందుకు తెలంగాణ దళితబంధు పథకాన్ని అమలు చేయనున్నది. ఈ పథకం ప్రవేశపెట్టినందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం కేసీఆర్‌ దళితుల పాలిట ఆత్మ బంధువని వివిధ రంగాలకు చెందిన వారు పేర్కొంటున్నారు.

దళితులకు అండగా..
దళితబంధు పథకం ద్వారా రాష్ట్రంలోని పేద దళితులకు సీఎం కేసీఆర్‌ అండగా నిలుస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని పథకాన్ని అమలు చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అర్హులైన దళితులను నిబంధనల మేరకు గుర్తించి, వారికి నేరుగా సాయం అందించనున్నది. దళితబంధు అమలులో వచ్చే సాదకబాధకాలు, అనుభవాలను అంచనా వేసి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్షేత్రస్థాయిలో సాఫీగా ఈ పథకాన్ని కొనసాగించేందుకు ముందుగా ఒక నియోజకవర్గంలో పైలెట్‌ ప్రాజెక్టుగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే హుజరాబాద్‌ను ఎంపిక చేశారు. సమగ్ర కుటుంబ సర్వేను ఆధారం చేసుకుని, దళితబంధు పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దళారుల బాధలేకుండా రైతుబంధు తరహాలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా ఆర్థికసాయాన్ని జమ చేస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పడంపై దళితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

చిరస్థాయిగా నిలవనున్న సీఎం కేసీఆర్‌..
దళితబంధు పథకం ద్వారా సీఎం కేసీఆర్‌ దళితుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. రాష్ట్రంలో దళితులు ఆర్థికంగా, సామాజికంగా, స్వావలంబన సాధించాలన్నదే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ ముందుకు సాగుతున్నారు. స్వయం సమృద్ధి సాధించేలా వివిధ పథకాల ద్వారా సబ్సిడీ రుణాలు, మూడెకరాల పంపిణీ, ఉచిత విద్యుత్‌, స్టడీసర్కిళ్లు, డ్రైవర్‌ ఎంపవర్‌మెంట్‌ పథకం, అంబేద్కర్‌ విద్యానిధి, నైపుణ్య శిక్షణ, గురుకుల విద్యాలయాలు, పోస్ట్‌మెట్రిక్‌ స్కాలర్‌షిప్స్‌ తదితర పథకాలు ప్రవేశపెట్టారు.దశాబ్ధ్దాలుగా వివక్ష, అణిచివేతకు గురైన దళితుల ఉద్ధరణకు తెలంగాణ దళితబంధు ఆశాదీపం కానున్నది. దళిత కుటుంబాలు తమ కాళ్లపై నిలబడి ఆత్మగౌరవంతో బతికేందుకు నేరుగా సాయం అందించడం హర్షణీయం. రాష్ట్రంలోని దళితుల పక్షాన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు.

  • గువ్వల బాలరాజు, ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే
    అద్భుతమైన పథకం..
    స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దళితుల సంక్షేమం కోసం గతంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిందేమీ లేదు. రోటీ, కప్డా, మకాన్‌ అన్నారు. కానీ దళితులను ఓటు బ్యాంకులుగానే వినియోగించుకున్నారు. సీఎం కేసీఆర్‌ అధికారంలోకి వచ్చాక అణగారిన వర్గాల సంక్షేమానికి పాటుపడుతున్నారు. ఇప్పటికే గురుకులాలు ఏర్పాటు చేసి కనీవినీ ఎరుగని విధంగా నాణ్యమైన విద్య అందిస్తున్నారు. అణగారిన దళిత కుటుంబాలను ఆదుకునేందుకు తీసుకొచ్చిన తెలంగాణ దళితబంధు అద్భుతమైన ఆలోచన. పేదల కష్టాలు తెలుసు కాబట్టే అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రూ. 10లక్షల ఆర్థిక సాయం అందించేందుకు పథకాన్ని ప్రవేశపెట్టారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి ఆలోచన చేయలేదు. దళితుల పక్షాన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
  • అబ్రహం, ఎమ్మెల్యే, అలంపూర్‌

నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి..
దళితుల ఆర్థిక పరిస్థితులు, జీవన ప్ర మాణాలు మెరుగుపడలేదంటే సమైక్య పా లనతోపాటు జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ విధానాలే కారణం. సమైక్య రా ష్ట్రంలో దళితులను కేవలం ఓటు బ్యాం కుగా మాత్రమే వాడుకున్నారు. అలా చూ సిన రాజకీయ పార్టీలకు సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన తెలంగాణ దళితబంధు పథ కం చెంప దెబ్బ సమాధానం లాంటిది. బ్యాంకులతో సంబంధం లేకుండా, తిరిగి చెల్లించమని అడగకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకే రూ.10 లక్షలను జమ చేయడం దేశంలోనే ఎక్కడా లేదు. దళితుల పక్షపాతి అయిన సీఎం కేసీఆర్‌కు ఎస్సీ సామాజికవర్గం ప్రజల తరఫున కృతజ్ఞతలు.

  • ఆంజనేయులు, మార్కెట్‌ కమిటీ మాజీ అధ్యక్షుడు, మహబూబ్‌నగర్‌
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పేద దళితులకు అండగా నిలిచిన కేసీఆర్‌
పేద దళితులకు అండగా నిలిచిన కేసీఆర్‌
పేద దళితులకు అండగా నిలిచిన కేసీఆర్‌

ట్రెండింగ్‌

Advertisement