e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 29, 2021
Home జోగులాంబ(గద్వాల్) నేడు గురుపౌర్ణమి

నేడు గురుపౌర్ణమి

ఆత్మకూరు/గద్వాలటౌన్‌, జూలై 23 : గురు వు అంటే నిర్గుణ పరబ్రహ్మతో సమానం అని శాస్త్రవచనం. జ్ఞాన స్వరూపుడు, త్రిగుణాతీతుడైన సద్గురువు అనుగ్రహం అందరికీ కావాలి. మన సంస్కృతీ, సంప్రదాయాల్లో గురువుకు అగ్రతాంబూలం ఇచ్చారు. తల్లిదండ్రుల తరువాత గు రువునే పూజిస్తారు. ఆ తరువాతే దేవుడిని కొలుస్తారు. సాక్షాత్తు పరబ్రహ్మతో సమానంగా గురువును గౌరవిస్తారు. గురువు లేనిదే జగత్తు లేదన్న ది అక్షర సత్యం. అంతటి ప్రాధాన్యత ఉన్న గురువును కొలిచేందుకు ఓ శుభదినం కావాలి కదా అదే గురుపౌర్ణమి. దీనినే వ్యాస పౌర్ణమి అని కూ డా అంటారు.

సంస్కృతంలో ‘గు’ అంటే అజ్ఞానమనే చీకటి అని.. ‘రు’ అంటే తొలగించే వాడని అర్థం.. గురు అంటే అజ్ఞానమనే చీకటిని తొలగించేవాడని అ ర్థం. అష్టాదశ పురాణాలను భావితరాలకు అందించిన ఆయన వ్యాసు డు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున వ్యాసమహర్షి జన్మించారు. అందుకే ఈ పౌర్ణమిని వ్యాసపౌర్ణమి అని కూ డా అంటారు. బడుల్లో పాఠాలు చె ప్పే వారిని మాత్రమే గురువుగా సం బోధించడం పరిపాటి. కానీ సిద్ధపురుషులను, కారణ జన్ములను, జీవి త సారాన్ని అందించిన వారిని కూ డా గురువులుగా భావిస్తారు. అం దుకు వ్యాస మహర్షి నిదర్శనం.

- Advertisement -

జంతూనాం నరజన్మ దుర్లభం అని శ్రీ ఆదిశంకరాచార్యుల మాటలను మరిచిపోయి మానవుడు సం సార బంధనంలో పడి కొట్టుమిట్టాడుతున్నాడు. నాది నీది అన్న భా వన పెరిగి మనది అన్నమాట మరిచిపోతున్నారు. మనమంతా ఒక్క టే.. అందరూ ఈశ్వరాంశ సంభూతులేనని చెప్పిన మహా గురువుల మాటలను పట్టించుకోనంత కాలం ఈ దుస్థితి తప్పదు. అందుకే సమాజానికి దిశానిర్దేశం చేసిన గురువులను స్మరించుకునేందుకు ఏటా ఆషాడ శుద్ధ పౌర్ణమి రోజున గురుపూజా మహోత్సవాలు నిర్వహిస్తారు. ‘వ్యాసాయవిష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే.. నమో వై బ్రహ్మనిధయే వాశిష్ణాయ నమోనమః’ అని భవిష్యత్‌ గురుపరంపరకు గురుతర బాధ్యత అప్పగించారు.

గురువే దైవంగా..
మన పురాణాల్లో ఎందరో ఆదర్శ గురువులున్నారు. రామలక్ష్మణులకు విశ్వామిత్రుడు, బలరామకృష్ణులకు సాందీపుడు, లవకుశులకు వాల్మీకి, అర్జునుడికి ద్రోణుడు ఆదర్శ గురువులు. నీ జీవితానికి మార్గదర్శి, తత్వవేత్త, ఆధ్యాత్మిక చింతనను కల్పించి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందజేసి, నిన్ను మోక్ష మార్గానికి తీసుకుపోయినప్పుడు గురువులకు ఆ స్థానం లభిస్తుంది.భక్తుల కష్టాలను కడతేర్చి కోరిన కోర్కెలను మాత్రమే తీర్చగల దేవుడికంటే శిష్యులకు విద్యాబుద్ధులు నేర్పించి ముక్తి మార్గాన్ని చూపే గురువుకే సముచిత స్థానం ఉంటుంది. హిందువులు దైవ స్వరూపుడిగా పూజించే దత్తాత్రేయుడు గురువులకు గురువు. షిర్డీ సాయిబాబా కూడా ఈ కోవలోకే చేరుతాడు. త్రిమూర్తుల అంశంతో జన్మించిన దత్తాత్రేయుడు తన శిష్యకోటి అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానమిస్తాడని ప్రతీతి. ఇక షిరిడీ సాయిబాబా గురించి చెప్పనక్కర్లేదు.

అడుగడుగునా తన భక్తులకు అండగా నిలిచే ఆదర్శ గురువులైన సాయినాథుడు, దత్తాత్రేయుడికి గురుపౌర్ణమి సందర్భంగా ప్రణమిల్లడం, ఆ సద్గురువుల కృపకు పాత్రులు కావడం గురువులో దైవాన్ని చూడడం ప్రతి ఒక్కరికీ ముక్తిమార్గం. ఇంతటి పరమపవిత్రమైన గురుపౌర్ణమిన నాడు పరమగురువు బతికినంత కాలం ప్రజల మాన, ప్రాణాలను రక్షించి మోక్షమార్గాన్ని ప్రసాదించిన షిర్డీసాయి బాబాను దర్శించి తరిద్దాం..! మరణానంతరం సమాధి నుంచే భక్తులను రక్షిస్తానని చెప్పి అందరికీ ఆరాధ్యదైవంగా వెలిసిన ఆ షిర్డీ సాయినాథుడిని స్మరించి, నమస్కరించి, ఆ గురుదేవునికి కృతజ్ఞతలు తెలియజేద్దాం.!

శోభాయమానంగా మందిరాలు..
గురుపౌర్ణమి మహోత్సవాన్ని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లాలోని ఆలయాలు ముస్తాబయ్యాయి. ఆత్మకూర్‌లోని షిర్డీ సాయిబాబా మందిరాన్ని శోభాయమానంగా అలంకరించారు. శనివారం ఆలయంలో కాకడ హారతి, నందీశ్వర, దత్తాత్రేయ, సంతాన నాగదేవత, జ్యో తిర్లింగ, రాంపరివార్‌, లక్ష్మీదేవి, షిర్డీ సాయినాథులకు పంచామృతాభిషేకం, చావిడి ఉత్సవం, అర్చన, అష్టోత్తర పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం ధూప హారతి, సాయి భజన, పల్లకీసేవ, శేజాహారతి చేపట్టనున్నారు. ఉదయం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు మందిరం తెరిచి ఉంటుందని, భక్తులందరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలని మందిర కమిటీ కార్యదర్శి ప్రభాకర్‌రావు తెలిపారు.

గద్వాల పట్టణంలోని సాయి ఆలయంలో ఉదయం 5 నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టనున్నారు. 5 గంటలకు కాకడ హారతి, 7 గంటలకు పంచామృతాభిషేకం, 8 గంటలకు హోమం, సాయిసత్యవ్రతం, మధ్యాహ్నం హారతి, సంధ్యా హారతి, పల్లకీసేవ, శేజాహారతి తదితర పూజలను నిర్వహించనున్నారు. కోటలోని భూలక్ష్మీచెన్నకేశవస్వామిని ప్రత్యేక రథంపై ఊరేగిస్తారు. రాఘవేంద్రస్వామి మఠంలో ప్రత్యేక పూజలతోపాటు సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహిస్తారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana