e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 23, 2021
Home జోగులాంబ(గద్వాల్) గ్రామీణ రహదారులకు పెద్ద పీట

గ్రామీణ రహదారులకు పెద్ద పీట

మరికల్‌, ఆగస్టు 4:తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ రహదారులకు ప్రభుత్వం పెద్ద పీట వేసిందని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్‌. రాజేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని పల్లెగడ్డ, పెద్దచింతకుంట దగ్గర రహదారుల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ పుసల్‌పాడ్‌ గ్రామస్తుల కోరిక మేరకు పల్లె గడ్డ- పుసల్‌పాడ్‌ గ్రామల మధ్య సుమారు 4.5 కిలోమీటర్లకుగానూ రూ. 2కోట్ల 72లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే పెద్దచింతకుంట నుంచి లాల్‌ కోటకు వెళ్లే రహదారి సుమారు 3 కిలోమీటర్లకుగానూ రూ.2 కోట్ల తో బీటీ రహదారి నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. గ్రామీణులకు రవాణా సౌకర్యం సులభతరం చేసేందుకు ప్రతి గ్రామానికీ బీటీ రోడ్డు నిర్మిస్తున్నట్లు తెలిపారు. మండలంలో ఇప్పటికే రాకొండ నుంచి పుసల్‌పాడ్‌ వరకు, ఇబ్రహీంపట్నం, తీలేరు, అప్పంపల్లి రోడ్ల నిర్మాణం పూర్తయ్యిందని , పెద్దచింతకుంట, పస్పుల, బీటీ రోడ్ల నిర్మాణం కొనసాగుతున్నదన్నారు. మండలంలోని అన్ని గ్రామాలకు బీటీ రోడ్ల నిర్మాణం చేపడుతామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామల్లో సీసీ రోడ్ల నిర్మాణాలు కూడా ఎక్కువ మొత్తంలో చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌చైర్మన్‌ గౌని సురేఖారెడ్డి, ఎంపీపీ శ్రీకళ, పల్లెగడ్డ, పెద్దచింతకుంట, మరికల్‌ గ్రామాల సర్పంచులు అంజనేయులు, శ్రీనివాసరెడ్డి , కస్పే గోవర్ధన్‌, వైస్‌ ఎంపీపీ రవికుమార్‌, ఎంపీటీసీలు సు జాత, అంజనేయులు, మంజుల మండల కోఆప్షన్‌ సభ్యు డు మతీన్‌, జిల్లా కోఆప్షన్‌ సభ్యుడు వహీద్‌, ధన్వాడ, తీలేరు సింగిల్‌విండో అధ్యక్షులు వెంకట్‌రాంరెడ్డి, రాజేందర్‌గౌడ్‌ , ధన్వాడ, మరికల్‌ మండలాల రైతుబంధు సమితి కోఆర్డినేటర్లు వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ , సీనియర్‌ నా యకులు రాజవర్ధన్‌రెడ్డి, హన్మిరెడ్డి, లక్ష్మయ్య, రాయుడు, మురళీధర్‌రెడ్డి, తిరుపతయ్య పాల్గొన్నారు.

నారాయణపేటలో..
పేట పట్టణంలోని ఎర్రగుట్ట నుంచి ఎక్లాస్‌పూర్‌ మీదుగా కర్ణాటకలోని పుట్‌పాక్‌ బార్డర్‌ వరకు రూ. 5.58 కోట్లతో చేపట్టునున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులను బుధవారం ఎమ్మెల్యే ఎస్‌. రాజేందర్‌రెడ్డి, భూమిపూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి మాట్లాడుతూ 5.5 కిలోమీటర్ల ఈ రోడ్డును త్వరితగతిన పూర్తిచేయాలని, అలాగే నాణ్యతతో పనులు చేపట్టాలని సంబంధిత కంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఈ రోడ్డును ఎవరూ పట్టించుకోలేదని పేట ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి ప్రత్యేక చొరవతోనే బీటీ రోడ్డు మంజూరైనందున కర్ణాటకలోని పుట్‌పాక్‌ గ్రామానికి చెందిన నాయకులు ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. పలువురు పుట్‌పాక్‌ గ్రామానికి చెందిన నాయకులు ఎర్రగుట్ట చౌరస్తా వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీటీసీ అంజలి, పీఏసీసీఎస్‌ చైర్మన్‌ డా.నర్సింహారెడ్డి, సర్పంచ్‌ జమునాబాయి, ఎంపీటీసీ రాంరెడ్డి, కౌన్సిలర్‌ మహేశ్‌, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు రాంరెడ్డి, ఉప సర్పంచ్‌ ఎల్లప్ప, మండల, పట్టణ టీఆర్‌ఎస్‌ అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి, కోట్ల రాజవర్ధన్‌రెడ్డి, మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ కన్నా జగదీశ్‌, గందె చంద్రకాంత్‌, వేపూరి రాములు, పంచాయతీరాజ్‌ ఈఈ నరేందర్‌ పాల్గొన్నారు.

- Advertisement -

లోకుర్తిలో..
మండలంలోని లోకుర్తి గ్రామంలో రోడ్డు పనులకు ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. లోకుర్తి గ్రామం నుంచి ముస్తాపేట వరకుగల రోడ్డుకు రూ.3 కోట్ల 75 లక్షల విలువైన పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 60 సంవత్సరాల పాలనలో ఏ నాయకుడూ ఈ రోడ్డు గురించి పట్టించుకోలేదన్నారు. ఈ రోడ్డు పనుల వల్ల చాలా దూరం తగ్గిపోతుందని, చాలా గ్రామాలకు అనుకూలంగా మారుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బక్క నర్సప్స, సర్పంచ్‌ మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana