e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 19, 2021
Home జోగులాంబ(గద్వాల్) ఆడబిడ్డల పెండ్లికి చేయూత

ఆడబిడ్డల పెండ్లికి చేయూత

  • కరోనా కష్టకాలంలోనూ సజావుగా పథకాల అమలు
  • 26 నుంచి కొత్త రేషన్‌కార్డులు పంపిణీ
  • జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
  • కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ

జడ్చర్ల, జూలై 19 : పేదింటి ఆడబిడ్డల పెండ్లికి ప్రభుత్వం చేయూత అందిస్తున్నదని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నా రు. సోమవారం జడ్చర్లలోని చంద్రాగార్డెన్‌లో 65మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పని చేస్తున్నారన్నారు. కరోనా కాలంలోనూ పథకాలను సజావుగా అమలు చేస్తూ పేదలకు అండ గా నిలిచారన్నారు. 26నుంచి అర్హులకు కొత్త రేషన్‌కార్డులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. జడ్చర్ల మున్సిపాలిటీ, మండలంలో 1100మందికి రేషన్‌కార్డులు మంజూరయ్యాయని చెప్పారు. నియోజకవర్గంలో సుమారు 400 గ్రామా లు, తండాలకు మిషన్‌ భగీరథ నీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. జడ్చర్లలో 100 పడకల దవాఖానను త్వరలోనే అందుబాటులోకి తెస్తామన్నారు. కార్యక్రమంలో సంగీత, నాటక అకాడమీ చైర్మన్‌ శివకుమార్‌, జెడ్పీ వైస్‌చైర్మన్‌ యా దయ్య, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కాట్రపల్లి లక్ష్మయ్య, పీఏసీసీఎస్‌ చైర్మన్‌ సుదర్శన్‌గౌడ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లక్ష్మి, వైస్‌ చైర్‌పర్సన్‌ సారిక, మాజీ వైస్‌ ఎంపీపీ గోవర్దన్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మురళి, సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి ప్రణీల్‌చందర్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, కౌన్సిలర్లు కోట్ల ప్రశాంత్‌రెడ్డి, సతీశ్‌, లత, సర్పంచులు ప్రభాకర్‌రెడ్డి, శ్రీనివాసులు, రామకృష్ణారెడ్డి, నర్సింహులు, బృందం గోపాల్‌, కొండల్‌, రామ్మోహన్‌, మసియుద్దీన్‌, శంకర్‌నాయక్‌, ఇమ్మూ, దానిశ్‌ పాల్గొన్నారు.

రాజకీయ లబ్ధికి ప్రతిపక్షాలు పాకులాట
మిడ్జిల్‌, జూలై 19 : ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధికి పాకులాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని లింబ్యాతండాలో పల్లెప్రకృతి వనం, సెగ్రిగేషన్‌ షెడ్‌, వైకుంఠధామాలను ప్రారంభించారు. అనంతరం చేదుగట్టుతండాలో విత్తనబంతులు చల్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కిందన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతుబంధు, రైతుబీమా,మిషన్‌ భగీరథ, కల్యాణలక్ష్మి, వ్యవసాయానికి 24గంటల విద్యుత్‌ లాంటి పథకాలు లేవని వివరించారు. 70ఏండ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ చేసిందేమీలేదన్నారు. ఇప్పుడు ఎవరో వచ్చి డబ్బా కొట్టుకోవడం సిగ్గుచేటన్నారు. గత ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి, తెలంగాణ రాష్ట్రం వచ్చాక జరిగిన అభివృద్ధిని ప్రజ లు గమనించాలని కోరారు. కాగా, కొత్తపల్లి గ్రామంలో నిర్మించిన డబుల్‌బెడ్రూం ఇండ్ల పంపిణీకి దరఖాస్తులు స్వీకరించాలని తాసిల్దార్‌ శ్రీనివాసులుకు ఎమ్మెల్యే సూచించారు.

- Advertisement -

తండాకు బీటీరోడ్డు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం వల్లభురావుపల్లి గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన వడ్డె గోపాల్‌, వేములలో మృతి చెందిన అంజిరెడ్డి పార్థివదేహాల వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో సంగీత, నాటక అకాడమీ చైర్మన్‌ శివకుమార్‌, ఎంపీపీ కాంతమ్మ, పీఏసీసీఎస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీవో సాయిలక్ష్మి, ఏపీఎం రాందాసు, ఎంపీటీసీ సుదర్శన్‌, సర్పంచులు మేఘనానాయక్‌, జంగారెడ్డి, నారాయణరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పాండు, నాయకులు సుధాబాల్‌రెడ్డి, శ్రీనివాసులుగుప్తా, శివప్రసాద్‌, బాలస్వామి, కృష్ణానాయక్‌, ప్రతాప్‌రెడ్డి, వెంకట్‌, భీంరాజు, నవీనాచారి, వెంకటయ్య, సుకుమార్‌ పాల్గొన్నారు.

పేదలకు సర్కారు అండ
పేదలకు ప్రభుత్వం అండగా ఉం టున్నదని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని రంగారెడ్డిగూడకు చెందిన జనార్దన్‌ కుటుంబసభ్యులకు మం డలకేంద్రంలో రూ.2.25లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేశారు. ముందుగా ఎరువుల దుకాణాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రఘవీరారెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహు లు, సర్పంచు ల సంఘం మండల అధ్యక్షుడు బచ్చిరెడ్డి, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు శ్రీశైలంయాదవ్‌, యాదగిరి, అల్తాఫ్‌, శ్రీనివాస్‌, ఆనంద్‌గౌడ్‌, వెంకటేశ్‌, తిరుపతయ్య, విజయ్‌ పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana