e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, August 6, 2021
Home జోగులాంబ(గద్వాల్) అభివృద్ధి పనుల్లో జాప్యం వద్దు

అభివృద్ధి పనుల్లో జాప్యం వద్దు

అభివృద్ధి పనుల్లో జాప్యం వద్దు

భూత్పూర్‌, జూలై 19 : మున్సిపాలిటీ లో చేపట్టిన అభివృద్ధి పనుల్లో జాప్యం చేయొద్దని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. సోమవారం భూ త్పూర్‌ మున్సిపాలిటీలోని 2వ వార్డు సిద్ధాయపల్లి డబుల్‌బెడ్రూం ఇండ్ల వద్ద అదనపు కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌తో కలిసి ప్రజాప్రతినిధులు, అధికారు లు, కాంట్రాక్టర్లతో ఎమ్మెల్యే ఆల సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ మున్సిపల్‌ శాఖ మం త్రి కేటీఆర్‌ సహకారంతో భూత్పూర్‌ మున్సిపాలిటీకి రూ.20కో ట్లు మంజూరు చేయించగా, రూ.5కోట్ల పనులకు టెండ ర్లు పూర్తయి ఏడాది అవుతున్నా పనులు ప్రారంభించకపోవడం సరికాదన్నారు. కాంట్రాక్టర్ల తీరుతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్నారు. సకాలంలో పనులు చేపట్టని కాంట్రాక్టర్లను తొలగిస్తామని హెచ్చరించారు.

అలాగే సిద్ధాయపల్లిలో నిర్మించిన 288 ఇండ్లను అమిస్తాపూర్‌, సిద్ధాయపల్లి, సమీప తం డా ప్రజలకు పంపిణీ చేస్తామన్నారు. దసరా పండుగకు మంత్రి కేటీఆర్‌ చేతులమీదుగా ఇం డ్లు ప్రారంభిస్తామని తెలిపారు. డబుల్‌బెడ్రూం ఇండ్లకు తాగునీటి వసతి, డ్రైనేజీ వ్యవస్థ, సీసీరోడ్లు, విద్యుత్‌ సౌకర్యం ఏర్పాటు పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం సిద్ధాయపల్లి గ్రామశివారులోని నల్లగుట్టలో ఎమ్మెల్యే ఆల విత్తనబంతులు చల్లి మొక్కలు నాటారు. సమావేశంలో విద్యుత్‌ ఎస్‌ఈ మూర్తి, ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ సత్తూర్‌ బస్వరాజ్‌గౌడ్‌, వైస్‌చైర్మన్‌ కెంద్యాల శ్రీనివాస్‌, ఎంపీడీవో మున్ని, తాసిల్దార్‌ చెన్నకిష్టన్న, కమిషనర్‌ నూరుల్‌నజీబ్‌, పీఆర్‌ డీఈ రామకృష్ణ, ఏఈ ప్రదీప్‌, కౌన్సిలర్లు బాలకోటి, శ్రీనివాస్‌రెడ్డి, రామకృష్ణ, కోఆప్షన్‌ సభ్యులు అజీజ్‌, జాకీర్‌, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహగౌడ్‌, వైస్‌చైర్మన్‌ సత్తూర్‌ నారాయణగౌ డ్‌, మాజీ ఎంపీపీలు చంద్రశేఖర్‌గౌడ్‌, చంద్రమౌళి, కాంట్రాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ తదితరులు ఉన్నారు.

- Advertisement -

ఆర్థికసాయం అందజేత
మండలంలోని అన్నాసాగర్‌ గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ కార్యకర్త వెంకట్రాములు ఆదివారం మృతి చెందాడు. మృ తుడి కుటుంబసభ్యులను ఎమ్మెల్యే ఆల పరామర్శించి రూ.10వేల ఆర్థికసాయం అందజేశారు. ఎమ్మెల్యే వెంట కోఆప్షన్‌ సభ్యుడు ఖాజా, ఉపసర్పంచ్‌ రాజారెడ్డి, ఆల శశివర్ధన్‌రెడ్డి, షకీర్‌ ఉన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అభివృద్ధి పనుల్లో జాప్యం వద్దు
అభివృద్ధి పనుల్లో జాప్యం వద్దు
అభివృద్ధి పనుల్లో జాప్యం వద్దు

ట్రెండింగ్‌

Advertisement