e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home జోగులాంబ(గద్వాల్) అచ్చంపేటను ఆదర్శంగా తీర్చిదిద్దుదాం

అచ్చంపేటను ఆదర్శంగా తీర్చిదిద్దుదాం

  • దుకాణాల వద్ద మొక్కలను కాపాడుకోవాలి
  • ప్లాస్టిక్‌ కవర్లు ఉపయోగించరాదు
  • అచ్చంపేట మున్సిపల్‌ చైర్మన్‌ నర్సింహగౌడ్‌

అచ్చంపేట, జూలై27: అచ్చంపేట పట్టణాన్ని ఆదర్శంగా అభివృద్ధి చేసుకోవడంలో పట్టణవాసులు, వ్యాపారస్తులు పూర్తి సహకారం అందించాలని మున్సిపల్‌ చైర్మన్‌ నర్సింహగౌడ్‌ అన్నారు. మంగళవారం అచ్చంపేట మున్సిపల్‌ కార్యాలయంలో చికెన్‌సెంటర్‌ వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించారు. కోళ్ల వ్యర్థాలను రోడ్లపై, ఎక్కడపడితే అక్కడ పడేయడంతో పందులు, కుక్కలు రోడ్లపైకి వస్తుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రతిరోజు సాయంత్రం మున్సిపల్‌ చెత్త ఆటో వస్తుందని, అందులోనే వేయాలని రోడ్లపై వేస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. వాహనదారులు దుకాణాల ఎదుట పార్కింగ్‌ లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. హరితహారంలో భాగంగా మొక్కలను కాపాడే బాధ్యత దుకాణదారులదేనన్నారు. ఖాళీ ప్లాట్లలో పెరిగిన చెట్లు, చెదారాన్ని పట్టణప్రగతిలో తొలగించామని, యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలని లేకుంటే జరిమానా విధిస్తామన్నారు. స్వచ్ఛ అచ్చంపేటలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. ప్లాస్టిక్‌ కవర్లు వ్యాపారస్తులు, పట్టణవాసులు ఉపయోగించరాదని సూచించారు. సమావేశంలో మున్సిపల్‌ చైర్మన్‌ శ్రీహరిరాజు, వైస్‌చైర్మన్‌ శైలజవిష్ణువర్ధన్‌రెడ్డి, కౌన్సిలర్లు మన్నుపటేల్‌, గడ్డంరమేశ్‌, రమేశ్‌రావు, గౌరిశంకర్‌ పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana