మంగళవారం 26 మే 2020
Food - May 19, 2020 , 17:27:15

ఈ బర్గర్‌ ఎంత అందంగా ఉందో..

ఈ బర్గర్‌ ఎంత అందంగా ఉందో..

దీన్ని ఒకసారి బాగా పరిశీలించండి. చూడగానే నున్నటి గుండు అనుకున్నారు కదా! దీన్ని చూసిన వారంతా అలానే అనుకుంటున్నారు. ఇదేదో కాదు బేకరిలో దొరికే బర్గర్‌ బన్‌. అందరూ తినే ఆహార పదార్థం. బర్గర్‌ అనగానే పైన కొంచెం క్రాక్స్‌, దానితోపాటు తెల్లని రంగులో నువ్వులు చల్లి ఉంటారు. ఇలా ఉండుంటే టక్కున బర్గర్‌ అని గుర్తుపట్టేవాళ్లు. కానీ ఇది కాస్త భిన్నంగా ఉంది కదా అందుకే అందరూ కన్‌ఫ్యూజ్‌ అవుతున్నారు. ఇపుడు ఈ బర్గర్‌ బన్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీనిని చూసినవారంతా స్పూకీ, స్కిన్‌కేర్‌, అందమైన బర్గర్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. దీన్ని చూస్తే సబ్బులా ఉంది కానీ ఆకలిగా ఉండడంతో తినేయాలనిపిస్తుంది అంటూ మరికొంత మంది అంటున్నారు. ఏదైతేనేం బర్గర్‌ని ఇంత అందంగా సాఫ్ట్‌గా ఎలా తయారు చేశారంటూ తెగ పొగిడేస్తున్నారు. 

logo