డయాబెటిస్ ఉందా..? చలికాలంలో ఇవి తినండి..

న్యూఢిల్లీ: ప్రపంచ జనాభాలో చాలామంది డయాబెటిస్తో బాధపడుతూ ఉంటారు. డయాబెటిస్ అనేది తీవ్రమైన పరిస్థితి. ఇది గుండె, మూత్రపిండాలలాంటి అంతర్గత అవయవాలకు గణనీయమైన నష్టాన్ని కలిగిస్తుంది. దీనిని నియంత్రించకపోతే కరోనా బారినపడే ప్రమాదం కూడా ఉంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు కొవిడ్ బారినపడ్డట్లు పలు అధ్యయనాల్లో కూడా తేలింది.
తరచుగా మూత్రం రావడం అనేది డయాబెటిస్ సాధారణ లక్షణం. రక్తంలో అధిక చక్కెర స్థాయిలు ఉంటాయి. శీతాకాలంలో తక్కువ నీరు తాగినా మూత్రం వస్తూ ఉంటుంది. చెమట ద్వారా నీరు బయటకుపోకపోవడమే ఇందుకు కారణం. అందుకే డయాబెటిస్ పేషెంట్లు ఈ శీతాకాలంలో చక్కెరస్థాయిలను స్థిరంగా ఉంచుకోవాలి. ఇందుకోసం ఆరోగ్య నిపుణులు డైట్ ప్లాన్‌ను రూపొందించారు.
అల్పాహారంలో ఇవి తినాలి..!
- శీతాకాలంలో మధుమేహం ఉన్నవారు అధిక ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉండే అల్పాహారం తీసుకోవాలి.
- చిలగడదుంప సలాడ్
- ఉడకబెట్టిన గుడ్లు
- చక్కెరలేని కాఫీ / టీ
- నారింజ, ద్రాక్ష మొదలైన తాజా కాలానుగుణ పండ్లు
- *మధ్యాహ్న భోజనంలో ఇవి ఉండాలి..
- మధ్యాహ్న భోజనంలో అధిక మొత్తంలో పీచుపదార్థం ఉండేలా చూసుకోవాలి.
- కూరగాయలు, పాలకూర, బచ్చలికూర, ఆవాలు, మొదలైనవి..
- మల్టీగ్రెయిన్ చపాతీలు
- క్యారెట్లు, ముల్లంగితోకూడిన సలాడ్
ఈవినింగ్ స్నాక్స్..
- రోజంతా కొద్ది మొత్తంలో స్నాక్స్ తీసుకుంటూ ఉండాలి.
- రోస్టెడ్ ఫాక్స్‌నట్స్..
- ఆపిల్లాంటి తక్కువ కేలరీలుగల తాజా పండ్లు
- క్యారెట్లలాంటి ముడి కూరగాయలు.
రాత్రి భోజనంలో ఇవి తినాలి..
- రాత్రి భోజనంలో తక్కువ కేలరీలు, అధిక పీచుగల ఆహారపదార్థాలు తినాలి.
- ఆకుపచ్చ కూరగాయలు
- చికెన్ సూప్, సలాడ్
- కాలానుగుణమైన ఆహారం..
చిట్కా..
మధుమేహ వ్యాధిగ్రస్తులు చక్కెర లేదా కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండే స్నాక్స్‌ను రాత్రిపూట తప్పనిసరిగా అందుబాటులో ఉంచుకోవాలి. ఎందుకంటే మందులు, డయాబెటిస్ మేనేజ్మెంట్ ఆహారం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోయి హైపోగ్లైసీమియాకు కారణమవుతాయి. డార్క్ చాక్లెట్ లేదా రోస్టెడ్ నట్ బార్లను దగ్గర పెట్టుకోవాలి. ఇవి అత్యవసర పరిస్థితుల్లో మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచడానికి సహాయపడుతాయి.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- మెట్రోరైల్ ప్రాజెక్టులకు ప్రధాని భూమిపూజ
- స్మిత్ ముందే రోహిత్ శర్మ కూడా అదే పని చేశాడా.. వీడియో
- దొరస్వామి మృతికి ఎన్టీఆర్ సంతాపం
- తెలంగాణలో కొత్తగా 206 కరోనా కేసులు
- కోతిని తప్పించబోయి పల్టీ కొట్టిన కారు..
- కూతురి హత్యకు తల్లి 50 వేల సుపారీ..
- గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో నటి మీనా
- ఎన్టీఆర్ వర్ధంతి.. స్మరించుకున్న నందమూరి హీరోలు
- పాకిస్థాన్‌లో మోదీ ప్లకార్డులు.. ఎందుకు?
- ఈ పెళ్లాం వద్దురోయ్…!