ఆదివారం 24 జనవరి 2021
Food - Dec 12, 2020 , 18:01:57

వెల్లుల్లితో లైంగిక సమస్యలు దూరమవుతాయా..?

వెల్లుల్లితో లైంగిక సమస్యలు దూరమవుతాయా..?

హైదరాబాద్‌ : ప్రస్తుతం చాలా జంటలు సంతాన లేమి సమస్యతో బాధపడుతున్నాయి. దీంతోపాటు శృంగార జీవితం ఎక్కువ సేపు గడపలేక, భాగస్వామిని సంతృప్తి పరచలేక సమస్యలను ఎదుర్కుంటున్నాయి. ఇందుకు కారణం మారుతున్న ఆహారపు అలవాట్లు, ఆధునిక జీవనశైలి ఏదైనా కావచ్చు. కారణాలేవైనా.. వీటిన్నింటికీ వంటిట్లో లభించే వెల్లుల్లితో చెక్‌పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వెల్లుల్లిలోని ఔషధ గుణాలు సెక్స్‌ సామర్థ్యాన్ని పెంపొందిస్తాయట.  నపుంసకత్వాన్ని నివారించే శక్తి సైతం దీనికి ఉందట. స్త్రీ పురుషుల లైంగిక సమస్యల్ని దూరం చేసి.. సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు వెల్లుల్లి సహాయపడుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

ఇక వెల్లుల్లితో లాభాలేంటో చూద్దాం..

1. రోజూ వెల్లుల్లి తినడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. ప్రతిరోజు 2-4 రెబ్బరు తినడం వల్ల పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.

2. రక్తశుద్ధి, రక్త ప్రసరణకు వెల్లుల్లి బాగా సహాయపడుతుంది. అంతేకాదు, గర్భం ధరించేందుకు ప్రయత్నించినప్పుడు మహిళలకు అవసరమైన శక్తిని వెల్లుల్లి ఇస్తుంది.

3. వెల్లుల్లిలోని సెలీనియం, విటమిన్లు సీ, బీ-6 క్రోమోజోమ్ లోపాలను నివారిస్తాయి.

4. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ లైంగిక అవయవాలకు రక్త ప్రసరణను పెంచుతుంది.

5. స్త్రీ, పురుషులలో సంతానోత్పత్తిని పెంచే పోషకాలు వెల్లుల్లిలో పుష్కలంగా ఉన్నాయి. స్పెర్మ్ తో పాటు, పిండం తయారుచేసే గుడ్లను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.

6. చాలామంది పురుషులలో, రియాక్టివ్ ఆక్సిజన్ జాతుల (ROS) ఉత్పత్తి పెరగడం సంతానలేమికి ప్రధాన కారణం. శరీరం సహజ యాంటీఆక్సిడెంట్లు లేనప్పుడు ఆక్సీకరణస్థాయి పెరిగి ఒత్తిడిని సృష్టిస్తుంది. వెల్లుల్లి ఒక సహజ యాంటీఆక్సిడెంట్, ఈ ఆక్సీకరణ ఒత్తిడి వల్ల కలిగే సెల్యులార్ నష్టాన్ని తగ్గించి పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతుంది.

వెల్లుల్లితో పురుషులకు లాభాలు

1. వెల్లుల్లి పురుషులలో శక్తిని పెంచుతుంది. అంతేకాక.. హృదయనాళ వ్యవస్థకు అవసరమైన విటమిన్లు, ఇతర పోషకాలను అందిస్తుంది.

2. వెల్లుల్లిలోనిఅల్లిసిన్  లైంగిక అవయవాలకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వీర్యంలోని నాణ్యతను కూడా రక్షిస్తుంది.

వెల్లుల్లిలోని సెలీనియం సహజ యాంటీఆక్సిడెంట్ లా పనిచేసి శుక్రకణాల చలనశీలతను పెంచుతుంది. 

సీ, బీ-6 - ఈ విటమిన్లు వీర్యాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

3. పురుషులు రెగ్యులర్‌గా వెల్లుల్లి తీసుకోవడం వల్ల  రక్తం శుద్ధికావడంతో పాటు సంతానోత్పత్తి సామర్థ్యం  పెరిగే అవకాశం ఉంది. 

4. రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచి అంగస్తంభన వేగంగా అభివృద్ధి చెందడానికి వెల్లుల్లి సహాయపడుతుంది. 

 స్త్రీలకు లాభాలు ఇవే..

1. వెల్లుల్లి అండోత్సర్గమును ఉత్తేజపరచడమేకాక  క్రోమోజోమ్ లోపాలను నివారిస్తుంది.  కాబట్టి ఆడవారిలో సంతానోత్పత్తికి బాగా సాయపడుతుంది.

2. క్రమం తప్పకుండా వెల్లుల్లిని ఆహారంలో చేర్చుకునే స్త్రీలకు నెలసరి నొప్పి బాధ తప్పుతుంది. గర్భాశయం ఆరోగ్యంగా ఉంటుంది. 

3. వెల్లుల్లిలోని విటమిన్ బీ- 6 పుష్కలంగా ఉంటుంది, ఇది  అండోత్సర్గములో సహాయపడుతుంది.

4. వెల్లుల్లి వాసన కొందరికి నచ్చకపోవచ్చు. కానీ.. ఇది ఆహారంలో చేర్చుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్ లాంటి వ్యాధులను నివారిస్తుంది. అధిక బరువు, ఈస్ట్ సమస్యలను నియంత్రించడానికి బాగా సహాయ పడుతుంది. 

5. ఇది చర్మం, జుట్టు, గోర్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో పాటు రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు, హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదపడుతుంది.


logo